బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యను, నిరూపమ్ ను ఎలాగయినా కలపాలి అని. హిమ, ప్రేమ్ ప్రయత్నాలు చేస్తారు. అలాగే హిమను, సౌర్యను ఇంట్లోనే ఉంచాలని. సౌందర్య, ఆనందరావు కూడా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.సౌర్య ఆటో రిపేర్ అవ్వడంతో సౌర్యను ఎలాగయినా ఆపాలని సౌందర్య తాతయ్యకు బాగోలేకపోతే.. కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పొచ్చుగా.. ఆయన సంతోషంగా ఉంటారు’ అంటుంది.దాంతో సౌర్య ఆటో దిగి ఇంట్లోకి వెళ్తుంది.సరిగ్గా అప్పుడే నిరుపమ్,హిమలు ఆనందరావుని జాగ్రత్తగా మెట్ల మీద నుంచి కిందకు దింపి సౌందర్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు
నిరుపమ్ ను దక్కించుకోవడానికి శోభ చేసిన ప్లాన్ ఏంటి :
ఇక శోభ ఇంటికి వెళ్లి కోపంతో అన్నీ వస్తువులు పగలగొడుతుంది. నిరుపమ్ నాకు ఎలా దక్కుతాడు? బ్యాంక్ వాళ్లని ఎలా ఆపాలి?ఏదొకటి చెయ్యాలి అంటూ తలపట్టుకుంటుంది. ఇంతలో ఓ ఫోన్ వస్తుంది. అవతల ఎవరో? ఏం మాట్లాడారో తెలియదు కానీ.. అలాగే అంటుంది శోభ.
హిమ మాట్లాడిన మాటలు విన్న నిరూపమ్ :
మరోవైపు తన రూమ్‌లో దీప, కార్తీక్‌ల ఫోటోల దగ్గర నిలబడి హిమ బాధపడుతుంది.బావ మారట్లేదు. సౌర్యకు కోపం తగ్గట్లేదు. అందుకే సౌర్యకి ఏది ఏమైనా ఈ రోజు నిజం చెప్పేస్తాను. నేను చేసే ప్రయత్నాల గురించి చెబుతా అంటుంది.వెనక్కి తిరిగే సరికి నిరుపమ్ ఉంటాడు. అంతా వినేస్తాడు. ‘బాావా నువ్వు ఎప్పుడు వచ్చావ్’ అంటుంది హిమ ఆ షాక్‌లోనే. ‘సౌర్య ఎక్కడుంది?’ అంటాడు నిరుపమ్ కోపంగా.‘తన రూమ్‌లో ఉంది’ అంటుంది హిమ. ‘సరే తనతో నేను మాట్లాడాలి. కాసేపు ఇక్కడే ఉండు’ అనేసి నిరుపమ్ సౌర్య రూమ్‌కి వెళ్తాడు. అప్పటికి నిరుపమ్ రక్తంతో గీసిన బొమ్మని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది సౌర్య. అది చూసిన నిరుపమ్ మనసు చివుక్కుమంటుంది.
హిమతో నా పెళ్లి చేయమని సౌర్యను అడిగిన నిరూపమ్ :
సౌర్యా నీకో విషయం చెప్పాలి’ అంటాడు నిరుపమ్.డాక్టర్ సాబ్ వెళ్లిపొండి’ అంటుంది సౌర్య. ‘నువ్వు వెళ్లిపో అంటే వెళ్లిపోవాలా ఏంటీ? అంటాడు.నువ్వు ఒకప్పుడు ఏం అన్నావ్.. మీ మనసు చెప్పేది వినండి అన్నావ్.. నువ్వు చెప్పిందే నేను చేశాను. నేను హిమని ప్రేమించాను సౌర్యా..’ అంటాడు నిరుపమ్. ‘అవన్నీ నాకెందుకు చెబుతున్నారు అని సౌర్య అంటే..నా పెళ్లి మా మమ్మీకి ఇష్టం లేదు.. హిమని మార్చిన నువ్వే మా మమ్మీ మనసు మార్చాలి.మా ఇద్దరి పెళ్లి నువ్వే చెయ్యాలి.నన్ను, హిమని ఒక్కటి చెయ్ సౌర్య అంటాడు నిరుపమ్. అప్పుడే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది హిమ.అప్పుడే సౌందర్య, ఆనందరావులు ఆ రూమ్‌లోకి వస్తారు.
నిరూపమ్ ను హిమ మెడలో తాళి బొట్టు కట్టమన్న సౌర్య:
బాగుంది.. చాలా బాగుంది అంటూ అక్కడ నుంచి హాల్లోకి వెళ్తుంది సౌర్య.వెనుకే నిరుపమ్, హిమ, సౌందర్య, ఆనందరావులు వెళ్తారు. హాల్లో నిలబడి ఉండగానే.. సౌర్య ఎదురు వస్తుంది పసుపు తాడుతో. నిరుపమ్ ముందు పెట్టి కట్టు’ అంటుంది హిమవైపు చూపిస్తూ. ‘చూస్తారేంటీ డాక్టర్ సాబ్ ఇది మెడలో కట్టండి..’ అంటుంది.మీరిద్దరూ అమర ప్రేమికులు.మీ ప్రేమ, మీ డ్రామా చూసి చూసి విసుగెత్తిపోయింది. ప్రేమ అని ఒకరు అంటారు. పెళ్లి అని ఇంకొకరు అంటారు.. ఇష్టం అని ఒకరు అంటారు.. ఇష్టం లేదని ఇంకొకరు అంటారు. ఏంటిది?ఈ తాళి బొట్టు తన మెడలో కట్టండి. ఈ మహా నాటకానికి తెర పడుతుంది అంటుంది సౌర్య. వెంటనే నిరుపమ్ పసుపు తాడు అందుకుంటాడు.
బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పిన హిమ :
బావా ఆగు.నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాను కదా’ అంటుంది హిమ. ‘ఆపవే.. నీ నంగనాచి మాటలు.. అసలు నేను నీకు ఏ ద్రోహం చేశానే..? నా జీవితంలో ఆటలు ఆడుతున్నావ్ కదే.. నేను నీకు ఎప్పుడైనా అడ్డు వచ్చానా? అంటూ సౌర్య ఏడుస్తూ ఉంటుంది.ఏంటే ఇది’ అంటుంది సౌందర్య. ‘మీకు తెలియదు నాన్నమ్మా ఈ మహా తల్లి లీలలు’ అంటూ సౌర్య ఏడుస్తూ తన రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. వెంటనే పైకి లేచి.. ‘ఛాఛా నేను ఏడవడం ఏంటీ? నేనెందుకు ఏడుస్తాను’ అని కళ్లు తుడుచుకుంటుంది.
నిరూపమ్ తుది నిర్ణయం ఏంటంటే..?
ఇక నిరుపమ్ హిమా నీకో విషయం చెబుతాను జాగ్రత్తగా విను.నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసుని మార్చలేవు.నేను జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను.నిన్నే పెళ్లి చేసుకుంటాను. చచ్చేదాకా నీతోనే కలిసి ఉంటాను అంటాడు.అది కాదు బావా’ అని హిమ ఏదో చెప్పబోతుంటే.. ‘వాడు అంత క్లారిటీ చెబుతుంటే ఇంకా ఏంటే’ అంటుంది సౌందర్య. నువ్వు ప్రేమించిన మనిషే నిన్ను చేసుకుంటాను అంటున్నప్పుడు ఈ త్యాగాలెందుకమ్మా’ అంటాడు ఆనందరావు. హిమ మౌనంగా చూస్తూ ఉండడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.