Karthikadeepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ 1475 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు అక్టోబర్ 06న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్లో దుర్గ వచ్చినప్పటి నుంచి కథనం చాలా ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది. దుర్గ, దీపల దెబ్బకు మోనితకు చుక్కలు కనిపిస్తున్నాయి.
మోనితకు జలక్ ఇచ్చిన దీప :
గత ఎపిసోడ్ లో దీప అర్థరాత్రి 12 ఇంటికి మోనిత తలుపు కొట్టి ‘హ్యాపీ బర్త్‌డే డాక్టర్ బాబు నా జీవితంలో ఇదే అది పెద్ద పండుగ అని కార్తీక్ కు చెప్పి మోనితకు జలక్ ఇస్తుంది.అదే సీన్ ఈరోజు కంటిన్యూ అవుతోంది.దీప పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో కార్తీక్ కోపంగా ‘ఏంటి మోనిత నా పుట్టి రోజు అని నీకు గుర్తులేదా?’ అంటాడు కార్తీక్.మోనిత మాత్రం మనసులో ఈ రోజు నీ బర్త్‌డే కాదు అని అబద్దం చెబుదాం అంటే.. ఈ దీప ఏం ఆధారం తీసుకొచ్చిందో ఏమో తెలియదు. ఇప్పుడు ఏం చెప్పాలి’ అని తలపట్టుకుని ఏదోలా కవర్ చేస్తుంది.
కార్తీక్ విషెస్ చెప్పిన దీప, డాక్టర్ అన్నయ్య:
ఇక దీపతో పాటు వచ్చిన దీప వాళ్ల అన్నయ్య, వాళ్ల అమ్మ కూడా మోనితని వెటకారంగా కొన్ని మాటలు అని కార్తీక్ కు విషెస్ చెప్తారు.ఇక దీప మాత్రం.
‘డాక్టర్ బాబు.. ఈ ఇంట్లో ఈ పాటికే మోనిత మీతో కేక్ కట్ చేయించి ఉంటుంది. ఓ ముక్క తినిపించి మేము చేసిన అరేంజ్మెంట్స్ దగ్గరకు తీసుకుని వెళ్దాం అనుకున్నాను. కానీ మీరేంటి ఏ హడావుడి లేకుండా ఉన్నారు అని మా ఇంటికి వెళ్లి కేక్ కట్ చేద్దురుగానీ రండి అంటూ దీప, దీప వాళ్ల అన్నయ్యా,వాళ్ల అమ్మా పిలుస్తారు. ‘నువ్వు కూడా రా డాక్టర్ అమ్మా అంటుంది దీప నవ్వుతూ. మోనితకు వెళ్లడం ఇష్టం లేకపోయినా కార్తీక్ కోసం వెళ్తుంది.
కార్తీక్ తో కేక్ కట్ చేయించిన దీప :
ఇక కేక్ ఓపెన్ చేసి కార్తీక్‌తో కట్ చేయిస్తుంది దీప. అప్పుడే చెరో ముక్కను కార్తీక్‌కి పెట్టేందుకు సిద్ధమవుతారు ఇటు మోనిత అటు దీప. అయితే మోనిత పక్కనే ఉన్న దీప వాళ్ల అమ్మ.మోనిత కాళ్లు తొక్కుతుంది కావాలనే. దాంతో మోనిత చేతిలోని ముక్క కింద పడిపోతుంది.చూసుకోలేదమ్మా అనడంతో అందరూ కావాలనే చేస్తున్నారు అని రగిలిపోతుంది మోనిత. ఇక కేక్ కటింగ్ తర్వాత కార్తీక్ దీపకు థాంక్స్ చెప్పి ఏది గుర్తు ఉంచుకోకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటాను అంటాడు.డాక్టర్ బాబు మీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేస్తున్నా.. తర్వాత పేదలకు అన్నదానం.. ఆసుపత్రిలో రోగులకి పండ్లు పంపిణి ఇదంతా మీ చేతుల మీదుగానే అంటుంది దీప. ఎందుకు దీపా అంత ఖర్చు?’ అంటాడు కార్తీక్. ‘ఇవి నా డబ్బులు కాదు డాక్టర్ బాబు.. మొన్న మీరు ఇచ్చినవే’ అంటుంది దీప.
కార్తీక్ కు పర్సు గిఫ్ట్ గా ఇచ్చిన దీప :
ఇక వెళ్దామా కార్తీక్?’ అంటూ కార్తీక్ చేయి పట్టుకుంటుంది మోనిత.ఒక్క నిమిషం డాక్టర్ అమ్మా అంటూ దీప ఆపి ఒక పర్స్ అందిస్తూ.. ‘డాక్టర్ బాబు.. ఈ పర్స్ గుర్తుందా? పోయిన సంవత్సరం మీ పుట్టిన రోజుకి మీకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చాను’ అంటుంది దీప. వెంటనే అందుకున్న కార్తీక్ నిజంగా లాస్ట్ బర్త్‌డేకి ఇది గిఫ్ట్‌గా ఇచ్చావా? మరి నీకు గుర్తు లేదా మోనితా?’ అంటాడు కార్తీక్.నాకు అన్నీ గుర్తున్నాయిలే గాని నీకు తర్వాత చెబుతానులే.. పదా’ అంటూ లాక్కుని వెళ్లబోతుంది మోనిత.
మోనిత, కార్తీక్, దుర్గ ఎక్కడికి వెళ్లారు… ఆందోళనలో దీప :
ఇక మరునాడు దీప అందంగా రెడీ అయ్యి గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి మోనిత ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దుర్గకి ఫోన్ చేస్తే కలవదు. కార్తీక్, మోనితలు కనిపించకపోవడంతో కంగారుగా దీప తన అన్నయ్యదగ్గరకు వెళ్లి జరిగింది చెబుతుంది.
సీన్ కట్ చేస్తే కార్తీక్ డ్రైవర్ చేస్తుంటే మోనిత పక్కనే కూర్చుంటుంది.మోనితా నిజం చెప్పు.. నువ్వు నా బర్త్ అనే విషయం మరిచిపోయావ్ కదా?’అంటాడు
అయ్యో కార్తీక్ నిజమే.. నేను నీ బర్త్‌డే గురించి రెండు రోజులు క్రితం వరకూ కూడా గుర్తుంది అని ఏదేదో చెబుతుంది కానీ కార్తీక్ నమ్మడు. సర్లే గాని నీ ఫ్రెండ్ ఎక్కడా? వదిలేసి వచ్చావేంటీ? ఇంట్లో క్షణం కూడా వదిలి ఉండేవారు కాదు కదా అంటాడు కార్తీక్ వెటకారంగా. ‘నువ్వు ఏదైనా మాట్లాడు కార్తీక్.. నన్ను అనుమానించే టాపిక్ మాత్రం వద్దు’ అంటుంది మోనిత. సర్లే కానీ.. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్.? అని మోనితను కార్తీక్ అడుగుతాడు.వంటలక్క నుంచి దూరంగా ఎటైనా తీసుకుని వెళ్తున్నావా?లేదంటే నీకు దుర్గకీ మధ్యలో నేను అడ్డొస్తాను అని నన్ను ఏమైనా చేయడానికి తీసుకుని వెళ్తున్నావా అంటాడు కార్తీక్.
అనుమానంతో మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్:
ఇక మోనిత కోపంగా స్టాప్ ఇట్ కార్తీక్ అంటుంది.‘రోజులు బాలేదు మోనితా.. ఈ మధ్య ఎక్కడ చూసినా అలాంటి న్యూసులే అందుకే అడిగాలే అంటాడు కార్తీక్.మోనిత మాత్రం వాడికి నాకు ఏ సంబంధం లేదు.నీతో కలిసి ప్రశాంతంగా ఉండాలనే నిన్ను తీసుకుని వెళ్తున్నాను అంటుంది మోనిత. సర్లే అయితే వేరొక ప్లాన్ ఎమన్నా రెడీ చేసి. పెట్టుకున్నారా అంటాడు. ఇక వెంటనే మోనిత తల పట్టుకుని.. ‘దేవుడా ఇంత అనుమానం ఏంటి కార్తీక్ నీకు నిన్ను భరించడం చాలా కష్టం.నీ అనుమానాన్ని రెండు రోజులు భరించడమే నాకు ఇంత కష్టంగా ఉంటే ఆ దీప పదేళ్లు ఎలా భరించిందో?’అని మనసులో అనుకుంటుంది మోనిత.అయితే ఈ ఎపిసోడ్ లో దుర్గ ఏమయ్యాడో అనేది తెలియదు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!