Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1459వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 19న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం..మోనిత బాబును తీసుకుని రావడానికి ఊరు వెళ్తుంది. కార్తీక్ ను చూసుకోమని శివకు చెప్పి వెళ్తుంది. ఇక శివ అటు ఇటు తిరుగుతూ ఉంటే కార్తీక్ ఏమయ్యా వెంకటేష్ అని పిలుస్తాడు. నా పేరు వెంకటేష్ కాదు సార్..నా పేరు శివ సార్ అంటాడు. అయినా మా పేర్లు మచ్చిపోతారు కానీ ఆ వంటలక్క పేరు మాత్రం మీకు బాగా గుర్తుంటది అని శివ అంటాడు.
Karthika Deepam: వంటలక్క గురించి శివకు అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
అప్పుడే దీప ఆ ఇంటికి వచ్చి కిటికీ దగ్గర నిలబడి కార్తీక్ ని చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. అవునయ్యా వంటలక్క పేరు గుర్తుంటది, తను మాట్లాడిన మాటలు గుర్తుంటాయి అదేంటో అర్థం కావడం లేదని అంటాడు. అదే డాక్టర్ బాబు బంధం అంటే అని దీప అనుకుంటుంది.మేడమ్ ఊర్లో లేదు కదా మీరు ఏమి అనుకొకపోతే రాత్రికి మందు తెచ్చుకుంటాను సర్ అని అంటాడు శివ. అవునా అయితే నాకు కూడా తీసుకుని రా అంటాడు కార్తీక్. ఇక దీప కార్తీక్ మాటలు వింటూ డాక్టర్ బాబుకి దగ్గర అవడానికి అని దీప అనుకుంటుంది.
మోనిత ఆలోచనల్లో సౌందర్య:
సీన్ కట్ చేస్తే సౌందర్య మోనిత తన పిల్లాడిని ఎందుకు తీసుకెళ్ళిందా అని ఆలోచిస్తుంది. తల్లి కదా ప్రేమతో తీసుకుని వెళ్ళి ఉంటుందని ఆనందరావు వచ్చి సర్ది చెబుతాడు. దాని మొహం అది కన్న తల్లి ఏంటి దానికి అంత ప్రేమ ఉండదు, ఆస్తి వదిలేసి బిడ్డని మాత్రమే తీసుకుని వెళ్ళిందంటే అంతక మించి విలువైనది ఏదో తనకి దక్కి ఉండాలి, కానీ ఆస్తి కన్నా, బిడ్డ కన్నా విలువైనది ఏముంటుందని ఆనందరావు అడుగుతాడు. ఇంకేముంది మన కొడుకే అని సౌందర్య అంటుంది. అది కూడా కార్తీక్ కి ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా కార్తీక్ కి సంబంధించిన పనే. కార్తీక్ చనిపోయినప్పుడు తెల్ల చీర కట్టుకుంది. ఇప్పుడు రంగుల చీర కట్టుకుంటుంది. ఏదో జరుగుతుంది అదేంటో నేనే వెళ్ళి తెలుసుకుంటాను అని సౌందర్య చెప్తుంది.
శివను కాక పట్టే పనిలో దీప :
ఇక రాత్రికి శివ మందు బాటిల్ తీసుకుని వెళ్తుంటే దీప పిలుస్తుంది. ముందు శివ కాస్త బెట్టు చేసిన ఆ ఆ తర్వాత వంటలక్క మాటలను వింటాడు.బాటిల్ తీసుకుని వెళ్తున్నావ్ సరే మరి నంచుకోవడానికి చికెన్ పకోడీ వద్దా అని శివకు ఆశ పెట్టి నేను తెస్తాను వెళ్ళు అంటుంది
వారణాసిపై విరుచుకుపడ్డ సౌర్య:
మళ్ళీ సీన్ సౌర్య దగ్గర ఓపెన్ అవుతుంది.శౌర్య కోపంగా వారణాసిని నువ్వు తాతయ్య పంపిస్తేనే వచ్చావ్ కదా అని అడుగుతుంది. ఆమ్మో శౌర్యకి అనుమానం వచ్చింది కానీ ఆనందరావు గారు పంపించారని తెలిస్తే నన్ను పంపించేస్తుందని మనసులో అనుకుంటాడు. నాకు తెలుసు తాతయ్య పంపిస్తేనే వచ్చావు, నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అంతా వాళ్ళకి చెప్తున్నావ్ అని అంటుంది. లేదమ్మా నేను అలా చేయడం లేదని సర్ది చెప్తాడు వారణాసి
గత జ్ఞాపకాలు తలుచుకుంటూ కంట తడి పెట్టిన దీప :
ఇక కార్తీక్ మందు తాగుతూ ఉంటే దీప చికెన్ పకోడీ పట్టుకుని వస్తుంది. కార్తీక్ నవ్వుతూ పలకరిస్తాడు. దీప కార్తీక్ దగ్గర కూర్చుని మాట్లాడుతూ మీరు ఇలా మందు తాగడం చూస్తుంటే నేను డాక్టర్ బాబుతో కలిసి మందు తాగిన అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని చెప్తుంది. చెప్పు వంటలక్క అంటే కార్తీక్ కు దీప జరిగింది అంతా చెప్తుంది. భలే సరదాగా ఉంది వంటలక్కా మీ డాక్టర్ బాబుకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటాడు. ప్రాణం డాక్టర్ బాబు మా లోకంలో ఉండాల్సిన ఆయన వేరే లోకంలో ఉంటున్నారు. మమ్మల్ని ఎప్పడూ గుర్తు పడతారో అని ఎదురు చూస్తున్నా అని ఏడుస్తుంది. కానీ కార్తీక్ ఆ మాటలు వినకుండానే నిద్రపోతాడు. ఇక శివ, దీప కలిసి కార్తీక్ ని తన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు. శివ వెళ్లిపోగానే దీప కార్తీక్ గదిలో ఉన్న మెడికల్ రిపోర్ట్ తీసుకుని వెళ్తుంది.
బిడ్డతో మోనిత ఎంట్రీ… గత జ్ఞాపకాలతో కార్తీక్:
మరుసటి రోజు ఉదయం దీప కార్తీక్ కి కాఫీ ఇస్తుంటే మోనిత బిడ్డతో వచ్చి దీప ఇచ్చిన కాఫీ కప్పును విసిరేస్తుంది. మోనిత దగ్గర ఉన్నంత సేపు ఆనంద్ బాగా ఏడుస్తూ ఉంటాడు. బాబును చూసిన కార్తీక్.ఈ బాబు ఎవరు అని మోనితను అడుగుతాడు.ఇంతలో దీప.ఈయనకి బాబు బాగా అలవాటు కదా ఎత్తుకుంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయేమో అని డాక్టర్ బాబు మీరు ఎత్తుకుని చూడండి బాబు ఏడుపు ఆపేస్తాడేమో అని దీప చెప్తుంది. దాంతో కార్తీక్ బాబును ఎత్తుకుంటాడు వాడు ఏడుపు ఆపేస్తాడు. బాబు నా దగ్గరకి రాగానే ఏడుపు ఆపేశాడు ఏంటి అని కార్తీక్ అనేసరికి బాబుని చూడగానే ఏమైనా గుర్తుకు వస్తున్నాయా అని దీప అడుగుతుంది.కార్తీక్ కు గతంలో. జరిగినా సంఘటనలు గుర్తు వస్తుంటాయి..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!