Telugu TV Serials

శోభ ఉచ్చులో జ్వాల.. అసలు నిజం తెలుసుకున్న నిరూపమ్…!

Share

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో చంద్రమ్మకు కడుపు నొప్పి రావడంతో ఇంద్రుడు కంగారుపడుతూ మందులు తేవడానికి వెళ్తాడు.అయితే నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలను కుంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది. ఇంద్రుడు, సౌర్య హాస్పిటల్ రూమ్ బయట కంగారు పడుతుంటారు.

హాస్పిటల్లో హిమను చూసి మండిపడ్డ జ్వాల :

ఆటో జ్వాల ఇక నుండి సౌర్యలాగా మారనుందా..?

అప్పుడే చంద్రమ్మని బయటికి తీసుకొస్తారు.వచ్చిన డాక్టర్స్‌లో హిమ కూడా ఉంటుంది. హిమను చుసిన జ్వాల ఒక్కసారిగా కోపంతో ఉగిపోతుంది. కానీ. హిమ మాత్రం బాబాయ్ సమస్యేం లేదు పిన్నిది చాలా చిన్న సమస్యే అంటుంది హిమ ‘థాంక్యూ డాక్టర్.. మీ ఆసుపత్రిలో వైద్యం చేయనిచ్చారు అంటుంది అక్కడ ఉన్న మరో డాక్టర్‌తో హిమ.వెంటనే సౌర్య కోపంగా..‘బాబాయ్ ఏంటిది? ప్రాణాలు తీసేవాళ్లతో వైద్యం చేయించారా?’ అంటూ అరుస్తుంది.నాకు కంగారు వచ్చి డాక్టరమ్మకు చెప్పనమ్మా.. దగ్గరల్లో హాస్పెటల్ అని ఇక్కడికి ఆవిడే తీసుకొచ్చింది అంటాడు ఇంద్రుడు. దాంతో సౌర్య కోపంగా అక్కడ నుంచి వెళ్లబోతుంటే సౌర్యా నువ్వు నా మాట ఒక్కసారి విను అని హిమ వెంటపడుతుంది.

శోభకు సపోర్ట్ చేస్తున్న జ్వాల :

‘నా మాట విను.. జరిగినవి నీకు చెప్పాలనే ఇంటికి వచ్చాను.అప్పుడే పిన్నికి నొప్పి వచ్చింది. అందుకే ఈ హాస్పెటల్‌కి తీసుకొచ్చాను’ అంటుంది హిమ. ‘నాటకాలు ఆడటం,అద్భుతంగా నటించడం నీకు అలవాటే కదా? అయినా నీ ఘన చరిత్ర మొత్తం శోభ నాకు చెప్పిందిలే’ అంటుంది సౌర్య. ‘శోభ చెప్పడం ఏంటీ? ఆ శోభ చెప్పేవన్నీ అబద్దాలు నువ్వు నమ్మొద్దు సౌర్యా అంటుంది హిమ. అబద్దాల గురించి మోసాల గురించి నువ్వు చెప్పాలి.ఏం నటించావే.. డాక్టర్ సాబ్ తో పెళ్లి చేసే బాధ్యత నీదే అని చెప్పావ్.చివరికి క్యాన్సర్ డ్రామా ఆడావ్ కదా?’అంటుంది సౌర్య. ‘ఏం చేసినా నీ మంచికే చేశాను సౌర్యా’ అంటుంది హిమ. ఆపు ఇంకా నీ కన్నా ఆ శోభే బెటర్ నాకు ప్రతిదీ చెబుతూనే ఉంటుందిలే’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

స్వప్నకు జ్వాల గురించి అసలు నిజం తెలిసిపోయిందా..?

సీన్ కట్ చేస్తే సౌందర్య హాల్లో హిమ, సౌర్యల ఫొటోని పెద్దగా చేయించి తగిలిస్తుంది. అప్పుడే వచ్చిన ఆనందరావు అది చూసి ‘మళ్లీ మన ఇంట్లో సంతోషాలు వచ్చాయి అంటాడు. అప్పుడే సడెన్ గా స్వప్న చప్పట్లు కొట్టుకుంటూ లోపలికి వస్తుంది. ‘మమ్మీ,డాడీ మీరు సూపర్.. దాన్ని నెత్తిన ఎక్కించుకోవడమే కాకుండా.. దాని ఫొటో కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారా? అసలు మీరు మనుషులేనా?’ అంటుంది. ‘సౌందర్యకు కోపం వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన మాటలేనా అంటుంది.మీరు నా కన్నవాళ్లే కానీ.. నేనేం తప్పు మాట్లాడలేదు మమ్మీ.హిమ క్యాన్సర్ డ్రామా ఆడిందని నాకు తెలిసిపోయింది అది చాలదు అన్నట్టు ఈ ఫొటో పెట్టుకుని మరో డ్రామాకి తెర తీస్తున్నారా’ అంటుంది స్వప్న కోపంగా. ‘డ్రామా కాదే ఈ జ్వాల ఎవరో కాదు.. మన సౌర్యే తెలుసా?’ అంటుంది సౌందర్య.అంటే నీ ఇద్దరు మనవరాళ్లు నా కొడుకు వెంట ప్రేమా అని తిరుగుతున్నారన్నా మాట. అయినా నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే అర్హత వీళ్లిద్దరికీ లేదు నిరుపమ్ పెళ్లి శోభతోనే జరుగుతుంది’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

హిమ ఊహల్లో ప్రేమ్:

ఇక ప్రేమ్ ఒంటరిగా రోడ్డు మీద బైక్ ఆపి దాని మీద కూర్చుని ఆలోచిస్తూ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ‘హిమని చూస్తే బాధగా కనిపిస్తోంది.పైగా త్వరలో పెళ్లి అంటున్నారు.. అసలు హిమ మనసులో ఏముంది? నేను తెలుసుకోకుండా తప్పు చేశానా? ఒకసారి హిమని కలిసి తెలుసుకోవాలి’ అని అనుకుంటాడు ప్రేమ్.ఇక నిరుపమ్‌కి భోజనం వడ్డిస్తుంది. తిన్నంతసేపునిరూపమ్ హిమతో పెళ్లి గురించి కబుర్లు చెబుతూ ఉంటాడు నిరుపమ్. ‘రేయ్ ఆపరా.. హిమకు నువ్వంటే ఇష్టం లేదని ముఖం మీదే చెప్పి పీటల మీద నుంచి వెళ్లిపోయినా నీకు అర్థం కావట్లేదా?’ అంటుంది స్వప్న. హిమకు క్యాన్సర్ లేదనే విషయం నిరుపమ్ కు చెప్పకూడదని మనసులో అనుకుంటుంది.లేదు మమ్మీ ‘హిమకి నేనంటే చాలా ఇష్టం జ్వాల కోసం త్యాగం చెయ్యాలని అనుకుంది అంతే.తను ఇలానే నన్ను దూరం పెడితే.. ముహూర్తాని కంటే ముందు వెళ్లి తాళి కట్టేస్తా అంతే’ అంటాడు నిరుపమ్.

జ్వాలే సౌర్య అనే నిజాన్ని నిరూపమ్ కి చెప్పిన స్వప్న :

స్వప్న షాక్ అయ్యి అంతపని మాత్రం చేయకురా అని జ్వాలనే సౌర్య అనే విషయం చెపుతుంది.నిరుపమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మమ్మీ ఏం చెబుతున్నావ్?’ అంటాడు నిరుపమ్ అయోమయంగా. ‘అవునురా ఇదే నిజం ఆ జ్వాలే సౌర్య’ అంటుంది స్వప్న కోపంగా.‘మై గాడ్ అంతా కలిసి ఇంత చేశారా? అయినా సౌర్య, జ్వాల అయినా, జ్వాల సౌర్య అయినా నాకు ఏంటి మమ్మీ.నాకు హిమ అంటే ప్రేమ అంతే అనేసి కంచంలో చేయి కడిగేసుకుని వెళ్లిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Devatha 4 August 616 Episode: రాధను మా నాయన కథ చెప్పమన్న దేవి.. ఆ కోరిక తీర్చమని దోసిడ పట్టి అర్ధించిన దేవుడమ్మ.!

bharani jella

Devatha Serial: దేవుడమ్మ వాయినం అందుకున్న రుక్మిణీ.. సత్యకు పిల్లలు పుడతారు..

bharani jella

Intinti Gruhalakshmi: తులసికి వార్నింగ్.. నందు, లాస్య లను ఆఫీస్ రావద్దన్న సామ్రాట్..! 

bharani jella