Krishna Mukunda Murari: ఆదర్శ్ తిరిగి రావడం కోసం సౌభాగ్యవ్రతం చేయించాలని అనుకుంటున్నానని రేవతి అంటుంది.. రేవతి పంతులుగారిని పిలిపించి సౌభాగ్యవ్రతం ఎలా చేయాలో చెప్పమని అడుగుతుంది కాకపోతే ఆదర్శ్ తిరిగి రావడం కోసం చేస్తున్న ఈ వ్రతం కోసం భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని వ్రతం చేస్తే మంచిదని పంతులుగారు సలహా ఇస్తారు ఎవరైతే సౌభాగ్యవ్రతం చేయాలని అనుకుంటారో ఆ పుణ్యస్త్రీ అమ్మవారికి కట్టిన ఈ చీర కట్టుకొని పూజ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని అమ్మవారి చీరను భవానీకి తాంబూలంగా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పంతులుగారు..

ఆ తరువాత ముకుందా ఎందుకో తన దావిని తెంపేయాలని అనుకుంటుంది. అది అలా చేయడం తప్పని మురారి ముకుందతో వాదిస్తాడు. కానీ ముందుకుందా ఎందుకు తన దాలిని తెలిపేయాలని అనుకుంటుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. మురారి ఏం మాట్లాడినా ముకుందను అందుకు ఒప్పించాడో కూడా సస్పెన్స్ గానే ఉంది.

Krishna Mukunda Murari: ఆదర్శ్ కట్టిన తాళిని తెంపెస్తున్న ముకుంద.. మురారి ముకుంద కలిసున్న ఫోటో అంతా చూసేసారా.!?
ఆదర్శ్ తిరిగి రావడం కోసం సౌభాగ్యం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. అది నేను మురారి గారు కలిసి చేస్తామని కృష్ణ భవాని ముందు అడుగుతుంది. మీ అందరికీ అభ్యంతరం లేదా అని కూడా అడుగుతుంది. కానీ ముకుంద మాత్రం నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు అని అడుగుతుంది ఇందులో రిస్కీముంది నువ్వు బాగుంటే అందరం బాగుంటాం కదా అని కృష్ణ అంటుంది..

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ముకుందా మురారి ముగ్గురు రెడీ అయ్యి కిందకు దిగుతారు . సౌభాగ్యవ్రతం చేయడానికి ఇంట్లో ఏర్పాట్లు అన్నీ ఘనంగా జరుగుతాయి. కృష్ణ పంతులుగారు ఇచ్చిన చీరను కట్టుకోకుండా మామూలు చీర కట్టుకొని వస్తుంది. అప్పుడే పంతులుగారు నేను నిన్న అమ్మవారికి కట్టిన చీర ఇచ్చాను కదా అది కట్టుకొని రమ్మని చెబుతారు. కానీ ఆ చీర ఏమైందో తెలియదు అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. అప్పుడే ముకుందా బాధపడుతూ ఆదర్శ్ తిరిగిరావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది.. నా తలరాత ఇంతే అని ముకుందా అన్న మాటలకు అందరూ షాక్ అవుతా అందరూ తన వైపు చూస్తారు.