Krishna Mukunda Murari: శివన్న కృష్ణని పెళ్లి చేసుకోబోతుండగా.. చంద్రశేఖర్ అక్కడికి వెళ్తాడు అమ్మ కృష్ణ నేను వచ్చేసాను ఆ పెళ్లి పీటలు నుంచి లేచి రమ్మని చంద్రశేఖర్ చెబుతాడు. శివన్న చంద్రశేఖర్ ని చంపడానికి దండుపాలెం అనే ఒక అతని సీక్రెట్ ప్లేస్ లో పెట్టి ఉంచుతాడు. ఆ విషయం చెప్పి కృష్ణ ను అక్కడ నుంచి లేవకుండా చేస్తాడు.. శివ ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది నాన్న అని కృష్ణ చెబుతుంది..

ముకుంద మురారి తో మాట్లాడటం చూసిన నందు ముకుందా ఫోన్ తీసుకుంటుంది. అంతేకాదు ముకుంద మురారితో మాట్లాడుతుందని ఇంట్లో వాళ్ళందరూ వీనేలాగా చెబుతుంది. అందులో అక్కడికి భవాని వస్తుంది ఏంటి ఏం జరిగింది అని అడుగుతుంది ముకుందా భర్త మురారి అని నందు ఉంటుంది ఏం మాట్లాడుతున్నావ్ అని పెద్దగా అరుస్తుంది భవాని. ముకుందా మురారితో మాట్లాడుతుంది. తను మురారితో మాట్లాడుతుంది అంటే తన భర్త మురారి అనే కదా అని నందు అంటుంది. ముకుంద నిజంగానే మురారితో మాట్లాడావా అడుగుతుంది. అవును అని చెబుతుంది. అంతలో మురారి వాళ్ళ అమ్మ ఆదర్శ్ బోర్డర్ కి సేఫ్ గా వెళ్లడా లేదా అని అడగడం కోసం మురారి కి ఫోన్ చేసి ఉంటుంది అని కవర్ చేస్తుంది. అవును అదే అన్నట్టుగా ముకుంద తల ఊపుతుంది. ఇంకోసారి నువ్వు ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే నాతో చెప్పు అని భవాని అంటుంది.

మురారి అందర్నీ చంపేస్తూ అక్కడికి వెళ్తాడు. శివన్న చంద్రశేఖర్ తలకి ఎక్కువ పెట్టి మురారిని బెదిరిస్తాడు. అలా కాల్పులు జరుగుతుండగా చంద్రశేఖర్ శివన్న తల కి గన్ గురిపడతాడు వెంటనే శివన్న చంద్రశేఖర్ చేతిలో ఉన్న గన్ తీసుకొని తన తలకి గన్ను ఎక్కుపడతాడు అప్పుడే చంద్రశేఖర్ మురారి కి చేతులతో తనని కాల్చమని సైగ చేస్తాడు నేను మీరు కాల్చేలోపు కిందకి వంగుతానని అప్పుడు శివన్న నువ్వు ఎంటర్ ఎన్కౌంటర్ చేయొచ్చని చెబుతాడు ఇదంతా రిస్క్ వద్దని మురారి చెబుతాడు. పరవాలేదు కాల్చమని చంద్రశేఖర్ చెబుతాడు. కానీ చంద్రశేఖర్ కి బుల్లెట్ తగులుతుంది. ఇక వెంటనే శివన్న అక్కడి నుంచి పారిపోతాడు..
మురారిని గురుదక్షిణగా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. మురారి చంద్రశేఖర్ చూస్తుండగానే కృష్ణ మెడలో తాళి కడతాడు. మురారి ఇంటికి వచ్చాడని ఇంట్లో అందరూ సంబరపడిపోతుండగా తన పక్కనే కృష్ణ నిలబడి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు నాన్న అని భవాని అడుగుతుంది. తను నా భార్య కృష్ణ అని మురారి పరిచయం చేస్తాడు. ఆ మాట వినగానే భవాని చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోతుంది. ఇంకా ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.