32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణతో కలిసి ఇంట్లోకి వచ్చిన మురారిని చూసి ముకుంద ఏం చేసిందంటే.!?

Krishna Mukunda Murari serial
Share

Krishna Mukunda Murari: మురారి కృష్ణ దగ్గరికి వచ్చి నేను నీతో మాట్లాడాలి అని మురారి అనగానే.. అక్కడి నుంచి లేచి కృష్ణ వెళ్ళిపోబోతుండగా.. కృష్ణ ఆగు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెబుతాడు. వెంటనే సుందరి అదేంటి అని అడగగానే.. ఈ కేసు నేను సరిగ్గా డీల్ చేయలేదని నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని మురారి చెప్తాడు. ఆ మాటకు కృష్ణ మా నాన్న ను చంపిన నీకు మా ఉసురు తగలకుండా ఉండదు. ఇది ఆరంభం మాత్రమేనని కృష్ణ శాపనార్థాలు పెడుతుంది మురారి కి.. కృష్ణ నేను మీ నాన్నను చంపలేదు దయచేసి నేను చెప్పేది విను.. మీ నాన్న చనిపోయినందుకు నువ్వు ఎంత బాధ పడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నాను..

Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights
Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights

గురువుగారు అంటే నాకు ఎంతో అభిమానం .పోలీస్ ట్రైనింగ్ లో ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు.. క్రిమినల్స్ ని ట్రీట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు సైగలు తో మాట్లాడుకోవాల్సి వస్తుంది. గురువుగారు నాకు అలాగే సైగలు చేశారు. కానీ అనుకోకుండా గురువుగారు చనిపోయారు. నేను మాత్రం గురువుగారిని చంపలేదు. ఇక గురువుగారు చెప్పినట్లు నువ్వు నా బాధ్యత. చివరి నిమిషంలో ఆయన చెప్పిన మాటలు నీకు గుర్తు లేవేమో నాకు ఇంకా గుర్తున్నాయి. నిన్ను ఆయన చెప్పినట్టు డాక్టర్ ని చదివించే బాధ్యత నాది అని నాకు చెప్పారు. నువ్వు డాక్టర్ అయ్యేవరకు నీ రెస్పాన్సిబులిటీ నాది. అప్పటివరకు నువ్వు నాతోనే ఉండాలి. ఆ తరువాత నువ్వు నాతో ఉండటం ఉండకపోవడం అనేది అది నీ ఇష్టం.

Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights
Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights

నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి మా ఇంట్లో వాళ్ళందరూ కుటుంబానికి పరువు ప్రతిష్టలకు విలువ ఇస్తారు. నువ్వు నాతో ఎలా నడుచుకున్నా పర్వాలేదు. మా ఇంట్లో వాళ్లతో మాత్రం పద్ధతిగా ఉండాలి అని మురారి చెబుతాడు. ఇక ఆ ఇంట్లో మన ఇద్దరం భార్యాభర్తలు మాత్రమే. మన ఇద్దరికీ శారీరకంగా, మానసికంగా మాత్రం ఎలాంటి రిలేషన్ ఉండదు అని మురారి అంటాడు. నేను కూడా నీతో ఆ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను అని కృష్ణ అంటుంది. మురారి కృష్ణను తీసుకొని తన ఇంటికి బయలుదేరుతాడు.

Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights
Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights

భవాని మురారి కి ఫోన్ చేస్తుంది. చాలా రోజులు అయింది నాన్న నిన్ను చూసి ఇంటికి రావచ్చు కదా అని అంటుంది . ఏమైంది పెద్దమ్మ అలా ఉన్నావు అని మురారి అడుగుతాడు. ఆదర్శ్ పెళ్లి మధ్యలో నుంచి డ్యూటీ అని నువ్వు వెళ్ళిపోవటం నాకు గౌరవాన్ని అందించింది కానీ ఆ సమయంలో నువ్వు లేకపోవడం నాకు బాధగా ఉంది. నీతో కలిసి భోజనం కూడా చేయలేదు వీలుంటే ఒకసారి రమ్మని చెబుతుంది. నేనే కృష్ణని తీసుకొని ఇంటికి వస్తున్నాను పెద్దమ్మ అని మురారి మనసులో అనుకుంటాడు . తప్పకుండా పెద్దమ్మ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తాను అని మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights
Krishna Mukunda Murari 15 December 2022 Today 28 Episode Highlights

రియోధ్యా అత్తయ్య గారు మురారి వచ్చాడు అని చెబుతుంది కోడలు. మురారి ఇంటికి వచ్చాడని ఇంట్లో అందరూ సంబరపడిపోతుండగా తన పక్కనే కృష్ణ నిలబడి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు నాన్న అని భవాని అడుగుతుంది. తను నా భార్య కృష్ణ అని మురారి పరిచయం చేస్తాడు. మురారి వచ్చాడు అన్న పిలుపు వినగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ముకుందా కళ్ళల్లో ఆనందం కేవలం కొన్ని క్షణాల్లో కూడా నిలవలేదు.

Krishna Mukunda Murari serial mukunda
Krishna Mukunda Murari serial mukunda

ఇక మురారి వాళ్ళ అమ్మ మురారి కృష్ణకు హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టి రమ్మని పిలుస్తుంది. కృష్ణ మురారి ఇద్దరూ ఆ ఇంటి లోపలికి వస్తారు. ఇక ముకుందా కోపంతో తన రూమ్ లోకి వెళ్లి భర్త లేడు ప్రేమించిన ప్రియుడు నన్ను కాదని వెళ్ళిపోయాడు. ఈ తాళిబొట్టు నాకు ప్రశ్న జవాబు అని తన తాళిబొట్టును పట్టుకొని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

దీప గొంతు గుర్తుపట్టిన సౌర్య.. ఆనంద్ ను తీసుకుని రావడానికి రంగం సిద్ధం చేసిన మోనిత..!

Ram

Intinti Gruhalakshmi: తులసి ఇచ్చిన పార్టీలో అపశృతి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella

బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డ్డ `కోబ్రా`.. 2వ రోజు ఎంత రాబ‌ట్టింది?

kavya N