Krishna Mukunda Murari: మనం చాలా తప్పు చేసాం మనం మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అందరికీ చెప్పి ఉండాల్సిందే. చాలా పెద్ద తప్పు చేసావ్ నాకు ఇలా వెళ్ళిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉంది. మీకే మీరు మీ వాళ్ళతో ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ, నాకు అలా కాదు తర్వాత ఎప్పటికైనా మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా.. అప్పుడు వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు కదా అని కృష్ణ బాధపడుతుంది. నా అవసరం కోసం నేను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని వాడుకున్నాను అని నా గురించి తప్పుగా అనుకుంటారు కదా ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది.

మరోవైపు నందిని కృష్ణ ఎప్పుడెప్పుడు తన వాయిస్ మెసేజ్ వింటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ కృష్ణ తన మెసేజ్ చూసినట్టుగా కనిపిస్తుంది. కానీ తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. సరే అని గౌతమ్ చెప్పినట్టు తనకి ఫోన్ చేస్తుంది నందిని. కానీ తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అంటే ఏంటి గౌతమ్ నిజంగా మురారి చెప్పింది నిజమేనా, మురారినే కృష్ణని ప్రేమిస్తున్నాడా కృష్ణ మురారిని ప్రేమించడం లేదా.. అలా ఎలా ఉంటారు గౌతమ్, మనం కూడా తన మీద చాలా ప్రేమ చూపించాం కదా.. ఇదంతా కేవలం అక్కడి వరకేనా కృష్ణకి మన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అన్నయ్యను ప్రేమించడం లేదా అని నందిని బాధపడుతూ ఉంటుంది. అన్నయ్యను మిస్ చేసినందుకు తనే బాధపడుతుంది. ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని నందిని గౌతమ్ కృష్ణ మీద కోపంతో ఇంటికి బయలుదేరుతారు.

మురారి కృష్ణను మెడికల్ క్యాంపు దగ్గర వరకు తీసుకువస్తాడు. ఏసీబీ సార్ మీరు నన్ను మర్చిపోరు కదా అని కృష్ణ అడుగుతుంది. అంతలోనే నా లగేజ్ చాలా ఎక్కువైందని ఇంకో బ్యాగ్ కూడా తీసుకువచ్చి అందులో నా లగేజ్ పెట్టుకున్నాను అది కారులోనే ఉందని చెప్పి కృష్ణ ఆల్ లగేజ్ బ్యాగ్ ని కూడా తీసుకుంటుంది. అంటే కృష్ణ బలంగా ఫిక్స్ అయింది నా నుంచి దూరం అవ్వాలని ఇప్పుడు నా ప్రేమను చెప్పిన ఉపయోగం ఉండదు అని మురారి బయలుదేరుతాడు. కృష్ణ కూడా ముందుకు నడుస్తుంది. కృష్ణ పిలిచావా అని మురారి మరోసారి వెనక్కి తిరిగి అడుగుతాడు లేదు అని కృష్ణ అంటుంది.

భవాని గదిలోకి రావడంతోనే ఎదురుగా కృష్ణ తనలాగా డ్రెస్ చేసుకున్న ఫోటో తన ఫోటో కలిపి ఉన్న ఫోటో ఫ్రేమ్ కింద ఓ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చూడగానే భవానికి అనుమానం వస్తుంది సరే ఆ లెటర్ ఏంటి అని ఓపెన్ చేసి చదవగా అందులో.. పెద్ద అత్తయ్య మన జీవితంలో తల్లిదండ్రి గురువు నే కదా ప్రత్యక్ష దైవాలు అంటారు. అలా నా జీవితంలో మీరే నాకు ప్రత్యక్ష దైవం అత్తయ్య. మీరంటే నాకు అభిమానం, అభిమానంతో కూడిన భక్తి. అందుకే మీరు నాకు ప్రత్యక్ష దైవం. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ నాతోనే ఉండాలి ప్రేమతో మీ తింగరి. ఆ లెటర్ చూసి భవాని తింగరి పిల్ల అని నవ్వుతూ ఉంటుంది. పైకి తింగరి పిల్లలా ఉంటావు కానీ చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ అని మనసులో అనుకుంటుంది భవాని. ఇక తను భవానీ దేవి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూసి నవ్వుకుంటుంది భవాని.

ముకుంద బయటి నుంచి ఇంట్లోకి వస్తుండగా.. మొదటిసారి ఈ గుమ్మంలో ఆదర్శ్ తో కలిసి కుడి కాలు పెట్టాను ఇప్పుడు మురారి భార్యగా ఈ ఇంట్లో కుడికాలు పెడతాను అని ఆలోచిస్తూ ఉంటుంది. మురారితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది ముకుంద. తను అలా ఊహల్లో తెలుపుతూ ఉండగా కృష్ణ అక్కడ పెట్టిన రెండు లెటర్స్ కనిపిస్తాయి. అవి చూసి ముకుందా అప్సెట్ అవుతుంది. ప్రేమ కంటే పెళ్లి ముఖ్యమని అందులో రాసి ఉంటుంది. ముకుంద నీకు అన్ని తెలుసు అయినా కూడా నీకు ఒక విషయం చెప్పాలి. ప్రేమ గురించి మర్చిపోయి పెళ్లి జీవితంలో సంతోషంగా ఉండు. కోటి రాగాలు పలికించే వీణ కూడా ఒక్కోసారి ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది. కాబట్టి నీ టాలెంట్ ని నీలోనే దాచుకోకుండా ఈ ప్రపంచానికి పరిచయం చేయి ముకుందా. నీ పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు జరగనివ్వకు.. నా ప్రేమ నాకు దక్కదేమో అని భయం అంతకుమించి నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. నాకు ఇప్పుడు నీ మీద ప్రేమ కలిగింది కృష్ణ థాంక్యూ కృష్ణ అనుకుంటుంది.

కృష్ణ ఫ్యామిలీ ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరిన్ని తలచుకుని బాధపడుతుంది. అప్పుడే కృష్ణ మీరు ఇలా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని బాధ పడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణ నేను ఇలా తలుచుకోగానే మీరు వచ్చేసారా ఏసిపి సార్ అని గబగబా బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ మురారి కూడా కృష్ణకు కనిపిస్తాడు. అది నిజమా లేదంటే కల అనేది తరువాయి భాగంలో చూద్దాం.