Krishna Mukunda Murari: ముకుందా ఇంటికి రాగానే పెళ్లి సంబంధం ఫిక్స్ చేసిన సంగతి ఇంట్లో తన పేరెంట్స్ చెప్పగానే ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ముకుంద వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది ముకుందా.. నీ మనసులో ఉన్న బాధ ఏంటో ఈ అమ్మతో షేర్ చేసుకోమని అడుగుతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడుగుతుంది. నేను ఒక అతన్ని చూసాను. మా ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలిసాయి. అతని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ముకుందా వాళ్ళ అమ్మతో చెబుతుంది.

అయితే అతను ఎలా ఉంటాడు.. ఎవరు ఏం చేస్తాడు.. ఎక్కడుంటాడు.. అని అడుగుతుంది. అవేమీ నాకు తెలియదు అని ముకుందా చెబుతుంది. అలా అయితే ఎలా తనని కలుసుకుంటావు అని వైశాలి అడుగుతుంది. నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ముకుంద. ఈలోపు అతను నిన్ను కలిసి మీరు మాట్లాడుకొని ఓడిసిషన్ కి రండి. లేదు అంటే నేను చెప్పిన అబ్బాయితో నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ముకుంద కి డెడ్ లైన్ పెడుతుంది వాళ్ళ అమ్మ..

ముకుందా ఆచూకీ తెలుసుకోవడం కోసం మురారి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకొని.. కచ్చితంగా తన ఫోన్ నెంబర్ నాకు పది నిమిషాల్లో చెప్పాలి అని ఆర్డర్ వేస్తాడు. ఇక తను రిసార్ట్ కి కాల్ చేస్తే నెంబర్ ఇవ్వడం కుదరదని చెబుతారు.

మురారి కోసం ముకుందా ఎదురు చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండుతో కచ్చితంగా మురారి నాకోసం ఫోన్ చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది మా ప్రేమ ఏంటో అని అంటుంది. తను ఫోన్ చేసావు గాక నువ్వు ఎందుకు ఎదురు చూడటం నువ్వే ఫోన్ చేయొచ్చు కదా అని తన ఫ్రెండ్ సలహా ఇస్తుంది. న ప్రేమను ఒక లెటర్ లో రాసి నేనే ముందు చెప్పను. అలాంటప్పుడు ఫోన్ చేయాల్సిన బాధ్యత తనకే కదా ఉంది అని ముకుందా అంటుంది. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ జీవితాన్ని రిస్క్ లో పడేసుకోవద్దు అని సలహా ఇస్తుంది. మరోవైపు ముకుందా మురారిని గుర్తు తెచ్చుకొని తన ఫోటోలు డ్రాయింగ్ వేస్తుంది. తన మీద ఉన్న ప్రేమని ఆ పెయింటింగ్లో అద్భుతంగా చూపిస్తుంది ముకుందా.

మురారి దగ్గరకు ఒక కానిస్టేబుల్ వెళ్లి సార్ మీరు సిఐ చంద్రశేఖర్ గారిని తప్పుగా అపార్థం చేసుకున్నారు అని చెబుతారు. ఆయన నాకు అంటే ఎప్పటికీ గౌరవమే ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను అని మురారి చెబుతాడు. కానీ పోలీసుల మీదకు అటాక్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు కదా అని మురారి అంటాడు. సార్ మీరు ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

సీఐ గారి అమ్మాయిని శివన్న చాలా టార్చర్ పెట్టాడు సార్. శివన్నవల్ల సిఐ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ జరిగింది మొత్తం ఆ కానిస్టేబుల్ మురారి కి అర్థమయ్యేలాగా వివరించి చెబుతాడు. అంతలో చంద్రశేఖర్ కన్నీళ్లు పెట్టుకొని కనిపిస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్లో శివన్న కృష్ణను ఆపి మన పెళ్ళికి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది అని అంటాడు. అంతలో మురారి తన జీప్ లో వస్తారు. ఇంకోసారి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్తారు. అంతలో శివన్న మురారి మీదకి కోపంగా వస్తాడు. శివన్న తలకి గన్ గురి పెడతాడు మురారి మరోవైపు ముకుందాన్ని చూసుకోవడానికి ఆదర్శాల కుటుంబం వస్తుంది మీ అమ్మాయి మాకు నచ్చింది అని చెబుతారు.
