Krishna Mukunda Murari: నీ మనసులో నేను ఉన్నాను. నాకు ఆ బాధ తెలీదా అని ముకుంద మురారిను నిలదీస్తుంది.. నేను ఎవరిని బాధ పెట్టడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అని మురారి అంటాడు. అవునా అయితే అదే విషయాన్ని నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పమని ముకుందా అడుగుతుంది. ముకుందా నా జీవితంలో నీకు తప్ప మరో అమ్మాయికి స్థానం లేదు.. ఇక నా లైఫ్ లోకి ఎవ్వరూ రారు అని నేను నీకు మాట ఇస్తున్నాను అని మురారి మాట ఇస్తాడు.
అలాగే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు ముకుందా.. ఆదర్శ్ ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వమని అడుగుతాడు. ముకుందా ఏడుస్తూ .. మురారి కి మాట ఇస్తుంది. అంతలో ఆదర్శ్ అక్కడికి వస్తాడు. అది గమనించిన ముకుంద ఫ్రెండ్ తను వచ్చి ముకుంద పక్కన నిలబడుతుంది. మురారి పకక్కు వెళ్ళిపోతాడు. ముకుంద ఏం లేదు అంటూ తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడుతుండగా ఆ తాళిబొట్టు కింద పడిపోతుండగా.. ఆ తాళిబొట్టును మురారి గట్టిగా పట్టుకుంటాడు. నన్ను పడిపోకుండా పట్టుకుంటావు ఈసారి కూడా అలాగే కాపాడవు అని ఆదర్శ్ అంటాడు. మురారి చేతిలో ఉన్న తాళిబొట్టును ఆదర్శ్ కి ఇచ్చి ముకుందా మెడలో తాళి కట్టమని మురారి చెబుతాడు. మురారి చూస్తుండగానే ఆదర్శ్ ముకుందా మెడలో తాళి కడతాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ ముకుందా ఇద్దరు జంటగా ఇంట్లోకి వస్తుండగా.. బియ్యం ను కుడికాలితో తన్ని లోపలికి రమ్మని చెబుతుంది భవాని.. ముకుందా ఎదురుగా మురారి ఫోటో చూసి ముకుందా బ్యాలన్స్ తప్పీ ఎడమ కాలితో ఆ బియ్యం ను తన్నుతుంది. అయ్యి షూట్ లెఫ్ట్ లెగ్ అని అంటుంది పక్కన ఉన్న ఆమె. ఇక భవని ఎలా రీయాక్ట్ అవుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.