Krishna Mukunda Murari: మురారి కి తన భార్య వచ్చింది అని సుపీరియర్ ఆఫీసర్ చెప్పగానే.. కృష్ణ అని మురారి పిలుస్తాడు.. అక్కడ ముకుందా ఉంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావని మురారి అడుగుతాడు. నీకోసమే వచ్చానని ముకుందా చెబుతుంది. ఇంట్లో చెప్పి వచ్చావా అని మురారి అనగానే.. చెబితే పంపిస్తారా చెప్పకుండా వచ్చానని ముకుందా అంటుంది.. మురారి కి ముకుంద భార్య లాగా దగ్గరుండి సేవలు చేస్తుంది. తనే వడ్డిస్తుంది. ముకుందా ఏంటి ముకుందా ఇది ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని మురారి అడుగుతాడు. నాకు ఇష్టం లేని మీ ఇంట్లో తీసుకువచ్చి నువ్వు పెట్టావు. నా బాధ ఎంత భారంగా ఉందో నీకు ఇప్పుడు అర్థమవుతుందా అని ముకుందా అంటుంది. నువ్వు నా భర్త ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకొని రా అప్పుడు నేను నువ్వు నీ భార్యతో ఎంజాయ్ చేస్తున్నట్లు నేను సంతోషంగా ఉంటాను అని ముకుందా అంటుంది.
ముకుంద ఎక్కడికి వెళ్లిందా అని భవాని కంగారు పడుతూ ఉంటుంది. ఇల్లంతా అందరూ వెతుకుతారు కానీ ముకుందా ఎక్కడా కనిపించదు. ముకుందని ఎవరైనా ఏమన్నారా అని భవాని అడుగుతుంది. అక్క ఎందుకు ఎప్పుడు లెంది ఈరోజు ఎంత కంగారుగా ఉంది అని మనసులో అనుకుంటుంది రేవతి. ఈ సమస్య అంతా ఇదిగో ఈ పిల్ల వచ్చింది అంటూ కృష్ణను అరుస్తుంది భవాని నువ్వు ఇంట్లో నుంచి వెళ్లడం ఆ అలవాటయింది. నిన్ను చూసి ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్తున్నారు. అయినా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పమని వెళ్ళాం కదా అని భవాని అరుస్తూ ఉండగా కాసేపటికి ముకుందా వస్తుంది. తన వెనకమాలే మురారి కూడా వస్తాడు.
ముకుందా మురారి ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తారు. ముకుందా నువ్వేంటి మురారితో కలిసి వచ్చావు అని అందరూ అడుగుతారు. చెప్పు మురళి అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వే కదా ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పావు ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పవేంటి చెప్పు అని ముకుందా అడ్డంగా మురారిని అందరి ముందు బుక్ చేస్తుంది. ఇక మురారి కూడా ముకుందా మాటలకు తలగి నేనే క్యారేజ్ తీసుకురమ్మని ముకుందా కి ఫోన్ చేశానని ఇంట్లో ఎవరి ఫోన్లో కలవలేదని చెప్పి కవర్ చేసుకుంటాడు. మురారి అబద్ధం చెబుతున్నాడని రేవతికి డైరెక్ట్ గా అర్థమవుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద బెడ్ కింద మురారి ఫోటో కనిపిస్తుంది. అమ్మ కృష్ణ మురారి ఎక్కడ అని రేవతి అడుగుతుంది. మురారి నీ పద్ధతి ఏమీ బాగోలేదు అని రేవతి అంటుంది. ఏమైందమ్మా అని మురారి అడగగానే ఒకసారి ముకుందా రూమ్ లోకి వెళ్దాం రమ్మని రేవతి తీసుకెళ్తుంది. ముకుందా నీ బెడ్ కింద మురారి ఫోటో ఎందుకు ఉంది అని రేవతి అడుగుతుంది. నా భర్త ఫోటో నేను దిండు కింద పెట్టుకోకూడదా అత్తయ్య అని ముకుందా అడుగుతుంది . ఆ మాటకు రేవతి షాక్ అవుతుంది ఇక ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం.
Premikudu re release: రీ రిలీజ్ కి రెడీ అయిన ప్రభుదేవా ” ప్రేమికుడు ” మూవీ.. రిలీజ్ డీటెయిల్స్ ఇవే..!