Krishna Mukunda Murari: కృష్ణ మురారి ఇద్దరూ రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేసరికి రేవతి ఎదురుగా కనిపిస్తుంది. అత్తయ్య నేను మీతో విషయం చెప్పాలని కృష్ణ అంటుండగా.. రెస్టారెంట్ లో జరిగినవి ఏవి చెప్పద్దు అని మురారి అడ్డుపడుతూ ఉంటాడు. లేదు అత్తయ్య మీకు చెప్పాలి అని కృష్ణ అంటుంది. ప్లీజ్ కృష్ణ వద్దు అని మురారి అంటాడు. లేదు నేను చెప్తాను అని కృష్ణ మారం చేస్తూ ఉంటుంది. సరే చెప్పనులే అని అంటూనే.. మీ అబ్బాయి నన్ను రెస్టారెంట్ కి తీసుకువెళ్లారు. ఆ రెస్టారెంట్లో డబల్ కా మీటా అనే స్వీట్ ఉంది. ఆ స్వీట్ కపుల్స్ ఒకరికొకరు తినిపించుకోవాలి అలా మీ అబ్బాయి నేను ఒకరికి ఒకరం తినిపించేసుకున్నాము అని ఫ్లోలో చెప్పేస్తుంది. హాయ్యో చెప్పేసానా అని నాలిక కోరుకుంటుంది. ఈ బండోడు నీకు స్వీట్ కూడా తినిపించాడా, అలాంటప్పుడు ఫోటో తీయాల్సింది బంగారం అని రేవతి అంటుంది కృష్ణని. ఈసారి తినిపించేటప్పుడు తప్పకుండా తీస్తాను అత్తయ్య అని అంటుంది. నేను ఒకసారి నందిని దగ్గరకు వెళ్ళొస్తాను అని కృష్ణ అంటుండగా.. మురారి తన చేతిని గిల్లుతాడు, సరే సరే అంటూ రేవతి వంటగదిలోకి వెళ్తుంది.

కృష్ణ నందిని నందిని అని అరుస్తూ కిందకు దిగుతుంది. మన నందిని ఎక్కడ అత్తయ్య అని కోపంగా కృష్ణ అడుగుతుంది. అది నా కూతురు అని భవాని అనగానే అందుకే పేషెంట్ అయింది అని కృష్ణ అంటుంది. మీ కూతురు అయింది కాబట్టే తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంది. ఇల్లు దాటించారా లేక దేశమే దాటించారా అని కృష్ణ అడుగుతుంది, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా కృష్ణ అని ఈశ్వర్ అంటాడు నన్ను తీసి అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని భవాని కృష్ణని నిలదీస్తుంది. నాకు ఈ హక్కు ఎవరిచ్చారు అంటే ఈ ఇంటి వారసుడైన మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టాడు. ఆ విధంగా నాకు హక్కు వచ్చింది అని కృష్ణ అంటుంది మురారి నీ భార్య అన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోతావేంటి అని అంటాడు. ఇక వెంటనే మురారి కూడా నందిని ఎక్కడికి వెళ్లిందో చెప్పు పెద్దమ్మ అని అడుగుతాడు ఇప్పటివరకు నీ భార్య అడిగింది ఇప్పుడు నువ్వు తయారయ్యావా అని భవాని అంటుంది.

ఈ ఇంట్లో జరిగేవి ఏవి ఏసిపి సార్ కి తెలియదు దయచేసి నందినిని ఏం చేయదు మీ పరువు హత్యల మూలంగా నందిని ప్రాణాలను తీయొద్దు అంటూ కృష్ణ దీనంగా వేడుకుంటుంది. చూసావా కృష్ణ ఎలా మాట్లాడుతుందో అని అందరూ అంటుండగా.. మర్యాదగా ఇక్కడి నుంచి తనని తీసుకువెళ్లు మురారి లేకపోతే తనని కట్టు బట్టలతో బయటకు పంపించేస్తాను అని భవాని మురారి కి వార్నింగ్ ఇస్తుంది. కృష్ణరా లోపలికి వెళ్దామని మురారి అడగగా.. రాను అని అంటుంది కృష్ణ. హేయ్ రా అని తన మీదకి చేయి లేపుతాడు మురారి.
Nuvvu nenu prema: విక్కీకి కృష్ణ గురించి నిజం తెలిసిపోతుందా? పద్మావతి ప్రేమను బయటపెడుతుందా?

వెంటనే వాళ్ళ పెద్దమ్మ మురారి అని పెద్దగా అరుస్తుంది మా పెద్దమ్మను ఎదిరించి మాట్లాడితే నేను తట్టుకోలేను అని మురారి అంటాడు. పరువు కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు నందిని ప్రాణాలకు ఎలాంటి ఆపద లేకుండా చూడండి. తనని సంతోషంగా ఉంచమని దీనంగా వేడుకుంటుంది. కృష్ణ ఇక మురారి వైపు నీచంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇక ముకుందా భవాని చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ణ లో చాలా నిజాయితీ ఉంది అది భవాని అత్తయ్యలో కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రేవతి తన కోడల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడడం చూసి బాధపడుతూ ఉంటుంది. తనకి సపోర్ట్ గా నేను ఉంటాను అని అనుకుంటూ ఇంట్లో సామాన్లు అన్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే తనకి నందిని పెళ్లి కి రాయించిన శుభలేఖ చూసి ఆశ్చర్య పోతుంది. ఇక తను వెంటనే ఆ విషయాన్ని కృష్ణకు చెబుతుందో లేదో చూడాలి.
Brahmamudi: స్వప్నను చూసిన రాజ్ వాళ్ళ అమ్మ.. రేపటికి సూపర్ ట్విస్ట్
రేపటి ఎపిసోడ్ లో ఇక ఎంత కాలమని నేను కృష్ణ కోసం పోరాడాలి అని కృష్ణ అంటుంది. గురించి అని మురారి అడగగా అది జరిగేలా లేదు అని కృష్ణ అంటుంది. నేను మాట ఇచ్చాను కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ పెళ్లి చేస్తాను అని మురారి అనగానే.. మీ పెద్దమ్మని ఎదిరిస్తారా అని కృష్ణ ప్రశ్నిస్తుంది. గౌతమ్ సర్ ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మన నందిని నే.. అనగానే మురారి ఉన్నచోటే కుప్పకూలిపోతాడు ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.