Krishna Mukunda Murari: మురారి కృష్ణ ను ఇంట్లోకి తీసుకురావడం చూసి ముకుందా కోపంతో తన రూమ్ లోకి వెళ్లి భర్త లేడు.. ప్రేమించిన ప్రియుడు నన్ను కాదని వెళ్ళిపోయాడు. ఈ తాళిబొట్టు నాకు ప్రశ్న జవాబు అని తన తాళిబొట్టును పట్టుకొని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది.ముకుంద అన్ని ఆలోచించిన తర్వాత డాబా పైన నుంచి కిందకు దూకేయాలని ప్రయత్నిస్తుంది. అది చూసిన మురారి పరిగెత్తుకుంటూ ముకుందా అని తనని కాపాడతాడు.

భవాని కోపంగా ఉందని తెలిసి తన దగ్గరికి మురారి వాళ్ళ నాన్న ప్రతాప్ వెళ్తాడు. వదిన నేను చెప్పేది విను అని ఆమె కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. కొడుకు చేసిన గేంజు తగ్గించడానికి తండ్రి వచ్చాడా అని భవాని అంటుంది. నీకు ఒక విషయం చెప్పనా ప్రతాప్ మీ అందరి కంటే ఎక్కువగా వాడిని గారాభం చేసి పెంచింది. నేనే వాడి మీద నేనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అని భవాని చెబుతుంది. ఇక అదే విషయాన్ని రేవతికి చెప్పాలని ప్రయత్నిస్తాడు ప్రతాప్ కానీ రేవతి ప్రతాప్ మాటలను వినకుండా సానుకూలంగా సమాధానం చెబుతుంది.

ఏం చేస్తున్నావ్ ముకుందా అని మురారి ముకుందను అరుస్తాడు. ముకుందా కోపంగా.. నా గదిలో నాకు తాళి కట్టిన వాడి గుర్తులు.. నీ గదిలో నీ భార్య.. నీ మనసులో ఎవరికీ చోటు లేదు అన్నావు. ఇప్పుడు నీ గదిలోనే ఒకరికి చోటు ఇచ్చావు. పక్క గదిలో పాత ప్రియురాలు.. నీ గదిలో కొత్త పెళ్ళాం.. అది కాదు ముకుంద నేను చెప్పేది విను అని మురారి అంటుండగా వద్దు నువ్వేం చెప్పదు నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను నా మనసు చంపుకొని నేను బ్రతకలేను అని ముకుందా అంటుంది. నా జ్ఞాపకాలను చంపేసావు. నా ప్రేమను చంపేసావ్. నన్ను పరాయి వాడి భార్యని చేసావ్. ఆ పరాయి వాడు దూరమై ఒంటరిగా మిగిలిపోతే నీ స్వార్థం నువ్వు చూసుకున్నా నీ పెళ్లి నువ్వు చేసుకున్నావ్.. నీ పెళ్లి నువ్వే చేసుకుని తిరిగి వచ్చావు అని ముకుందా అన్న మాటలు కృష్ణ వింటుంది.. నా ప్రేమ నీకు అనవసరం. నా దుఃఖం నీకు అనవసరం. నా బ్రతుకు నీకు అనవసరం . నేనే ఇప్పుడు నీకు అనవసరం. అని ముకుందా అంటున్న మాటలను కృష్ణ విని షాక్ అవుతుంది.
రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణని తీసుకువచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని చెబుతాడు కృష్ణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భవాని లేచి వెళ్ళిపోతుంది ఇక మురారి భవాని దగ్గరకు వెళ్లి ఇంతకుముందు నేనెప్పుడైనా తప్పు చేశానా పెద్దమ్మ ఇప్పుడు ఎందుకు చేసానో అర్థం చేసుకోమని చెబుతాడు. ఇప్పుడు నావల్ల తప్పు జరిగిందంటే దానికి కారణం నువ్వే అంటాడు..