Krishna Mukunda Murari: రేవతి మురారి అని పిలిచి కృష్ణను సినిమాకు తీసుకెళ్లమని చెబుతుంది. టికెట్స్ లేవు అనగానే.. తనే తీసుకొచ్చి ఇస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ముకుందా కార్ టైర్లో గాలి తీసేస్తుంది. ఇప్పుడు ఎలాగా అని కృష్ణ దిగాలుగా ఉంటే.. మురారి బైక్ తీసుకొని వస్తాడు. బైక్ పై కూర్చొని గేర్ రైస్ చేయగానే కృష్ణ మురారి మీదకు వాలుతుంది. వాళ్లిద్దరూ దగ్గరవడం.. ముకుందా చూటుగా నిలబడి ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari: మురారి, కృష్ణ సినిమాకు వెళ్లకుండా ముకుందా ఏం చేసిందంటే.!?
మురారి బైక్ రైజ్ చేయగానే కృష్ణ మురారిపై వాలుతుంది. అనవసరంగా కార్ టైర్లో గాలి తీసేసాను.. కారులో అయినా కాస్త దూరంగా ఉండే వాళ్ళు బైక్ మీద మరీ హత్తుకొని వెళ్తున్నారు.. వెళ్ళండి వెళ్ళండి వెళ్లి ఎంజాయ్ చేసి రండి అని ముకుందా అనుకుంటుంది.. ఇక తన ఫోన్లో మురారి ఫోటోని చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆ ఫోన్ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే నందిని వచ్చి తన ఫోను తీసుకొని పారిపోతుంది. అది గమనించిన ముకుందా నందిని నా ఫోన్ ఇవ్వు అంటూ ఇల్లంతా పరిగెడుతుంది..

Krishna Mukunda Murari: మురారి ని ఏడిపించిన ముకుంద.. కృష్ణ కి దగ్గరవడానికి రేవతి ప్లాన్
ముకుందా ఇంతలాగా ఆ ఫోన్ కోసం పరిగెడుతుంది అంటే.. కచ్చితంగా ఆ ఫోన్లో ఏదో ఉందని అలేఖ్య అనుమాన పడుతుంది.. ఇక అదే అనుమానం రేవతి కూడా వస్తుంది కచ్చితంగా ఆ ఫోన్లో ఏదో చూడకూడదు ఉండే ఉంటుంది. అప్పుడే భవాని వచ్చి ముకుందా ఫోన్ ని ఇవ్వమని చెబుతుంది. అక్కడితో గండం గట్టెక్కిందని ముకుందా ఊపిరి పీల్చుకుంటుంది.

అప్పుడే మురారి కృష్ణ ఇంటికి వస్తారు. రండి భోజనం చేయండి అని మురారిని వాళ్ళ బాబాయ్ పిలుస్తాడు. అప్పుడే రేవతి ముకుంద గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఆదర్శ్ తిరిగి రావడం కోసం సౌభాగ్యవ్రతం చేయించాలని అనుకుంటున్నానని రేవతి అంటుంది.. అంతలో కృష్ణ కలిపించుకొని ఆదర్శ్ రావడానికి చాలా వర్క్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్మీ పై ప్రెజర్ తీసుకురా వాలి కృష్ణ చెబుతుంది..

రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ తిరిగి రావడం కోసం సౌభాగ్యం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. అది నేను మురారి గారు కలిసి చేస్తామని కృష్ణ భవాని ముందు అడుగుతుంది. మీ అందరికీ అభ్యంతరం లేదా అని కూడా అడుగుతుంది. ఆ తరువాత ముకుందా ఎందుకో తన తాళిని తెంపేయాలని అనుకుంటుంది. అలా చేయడం తప్పని మురారి ముకుందతో వాదిస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.