Krishna Mukunda Murari: మురారిని సత్యనారాయణ స్వామి నోము కి పెళ్ళికొడుకుల ముస్తాబు చేయమని రేవతి భవాని దగ్గరకు వచ్చి అడుగుతుంది.. లేదు నేను రెడీ చేయను అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. పుణ్యస్త్రీ రెడీ చేస్తేనే చాలా మంచిది. అందుకని రేవతి ని చేయమని చెప్పు ప్రతాప్ అని వాళ్ళ మరిదికి చెబుతుంది. ఇప్పటికే ఈ ఇంట్లో జరిగిన అనర్ధం చాలు. మరో అనర్ధం జరగడానికి నాకు ఇష్టం లేదు. నేను కోపంగా చెప్పడం లేదు నేను చెప్పింది అర్థం చేసుకోమని భవాని చెబుతుంది..

సత్యనారాయణ స్వామి నోముకి జరిగిన ఏర్పాట్లు చూస్తూ మురారి కంగారు పడతాడు. ఒకవైపు కృష్ణ ఈ నోము లో పాల్గొనడానికి ఒప్పుకోదు. మరోవైపు ముకుందా ఈ నోము జరిగితే మీ ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగిందని నేను అనుకుంటాను అన్న మాటలు గుర్తొచ్చి ఇద్దరి మధ్య మురారి నలిగిపోతాడు. మరోవైపు వాళ్ల పెద్దమ్మ కృష్ణకి నగలు ఇవ్వమని హారాన్ని తీసుకువచ్చి మురారికి ఇస్తుంది. థాంక్యూ పెద్దమ్మ అని మురారి భవానీని హత్తుకుంటాడు. నవ్వినట్టే నవ్వి భవాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: మురారిని ఓ ఆట ఆడుకున్న ముకుందా.!? కృష్ణ కి నిజం తెలిసిపోయిందా.!?
మురారిని పెళ్ళికొడుకుల ముస్తాబు చేస్తుంది రేవతి. నీకు నా దిష్టే తగులుతుంది మురారి అని రేవతి అనగానే ప్రతాప్ మీ ఆవిడ దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయింది .. ఊర్లో వాళ్ళు వచ్చి పెడతారని భవాని అంటుంది. వెంటనే తన పక్కనే ఉన్న వాళ్ళ మరిది వదిన నీకు మురారి మీద కోపం తగ్గిపోయిందా అని అనగానే.. హూ హూ అని కాస్త కోపంగా అంటుంది. మురారి కృష్ణ రెడీ అవ్వడం లేదు అని వాళ్ళ అమ్మతో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ రేవతి సత్యనారాయణ స్వామి నోము పనుల్లో పడి ఆ విషయాన్ని పట్టించుకోదు.
రేపటి ఎపిసోడ్ లో సత్యనారాయణ నోము కి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. మురారి కృష్ణ రాదు అని వాళ్ళ అమ్మతో చెప్పబోతుండగా.. అదిగో కృష్ణ వచ్చింది అని అంటుంది. వాళ్ళు వ్రతం చేయడానికి కూర్చుంటారు. ముకుందా దగ్గరకు వెళ్లి కృష్ణ వ్రతం చేయడానికి వచ్చి కూర్చుంది. అని చెప్పగానే మురారి వైపు ముకుందా కోపంగా చూస్తుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.