Krishna Mukunda Murari: మురారి కృష్ణ రెడీ అవ్వడం లేదు అని వాళ్ళ అమ్మతో చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ.. రేవతి సత్యనారాయణ స్వామి నోము పనుల్లో పడి ఆ విషయాన్ని పట్టించుకోదు. అమ్మా ప్లీజ్ నేను చెప్పేది విను అని మురారి రేవతి తో కృష్ణ అని నసుకుతూ ఉండగా. అప్పుడే భవాని ఏంటి రేవతి నీ కొడుకు నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అని అంటుంది. అది కృష్ణ అని అనేలోపు అంతలో కృష్ణ రెడీ అయ్యి నోము దగ్గరకు వస్తుంది. కృష్ణ రావడం చూసి మురారి షాక్ అవుతాడు. ఇక ఇద్దరూ పూజ చేస్తారు. భవాని మురారి వాళ్లు పూజ చేయటానికి వచ్చారని.. వాళ్ళు పూజ చేసేది ఆదర్శ్ కోసం కాబట్టి ముకుందా కూడా ఇక్కడ ఉండాలి అని అలేఖ్యతో ముకుందను కిందకి రమ్మని కబురు పంపిస్తుంది..
అలేఖ్య ముకుందా దగ్గరకు వెళ్లి కృష్ణ వ్రతం చేయడానికి వచ్చి కూర్చుంది. అని చెప్పగానే మురారి వైపు ముకుందా కోపంగా చూస్తుంది. ఇక పరుగు పరుగున కిందకు వస్తుంది. మురారి వైపు ఈ పెళ్లి నీకు ఇష్టమే అన్నట్టుగా కోపంగా చూస్తుంది ఇక చేసేది ఏమీ లేక మురారి మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు కృష్ణ కూడా ఏసీపీ సార్ ఇదంతా మీరు ప్లాన్ చేశారా అని అడుగుతుంది.
అక్క ఈ నల్లపూసల దండ మురారి చేత కృష్ణకు వేయించాలి అని అనుకుంటున్నాను అని భవానీతో చెబుతుంది. ఏంటి ప్రతాప్ ఈ ఇంట్లో అందరికీ నేను ఓ శత్రువులా కనిపిస్తున్నానా అని అంటుంది. మురారి పెళ్లి చూడాలని నాకు కూడా ఉంది. కానీ అలా కాకుండా చేశాడు కదా నీ సుపుత్రుడు అని భవాని అంటుంది. ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు కూడా ఉన్నాయి అక్క అవి కూడా తీర్చుకుంటాను అని రేవతి అనగానే. సరే మీ ఇష్టం కానివ్వండి అని భవాని అంగీకారం ఇస్తుంది.
మురారి కృష్ణ మెడలో నల్లపూసల దండ వేస్తాడు ఇలా మరోసారి నీ మెడలో వేయడం కారణంగా నీకు ఇష్టం ఉన్నా లేకుండా ఈ మూడుముళ్ల బంధానికి ఎంతో విలువ ఉందని పంతులుగారు చెబుతారు. ఇది శాశ్వతమైన బంధం అని చెబుతారు. దండలు కూడా తీసుకువచ్చి కృష్ణ మురారి చేత వేయిస్తారు. కృష్ణ మురారి కి దండ వేయపోతుండగా చాలాసార్లు ఆటపట్టించి చివరిలో వేయిస్తారు.ఇక తలంబ్రాలు కూడా పోయిస్తారు . వాటన్నింటినీ చూస్తున్న ముకుందా మనసులో కోపంతో రగిలిపోతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లను చేస్తారు .అప్పుడే మురారిని ముకుందా తన రూమ్ లోకి తీసుకువెళ్లి బంధిస్తుంది. నాకు దక్కని సంతోషం నీకు దక్కడానికి వీల్లేదు ఈరోజు రాత్రంతా నువ్వు నా రూమ్ లో నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు అని ముకుందా అంటుంది ఏం చేస్తాడో చూడాలి.