Krishna Mukunda Murari: ఆదర్శ్ ముకుందా కి మీ అమాయకత్వం నాకు నచ్చింది. మీరు లైఫ్ లో ఎప్పటికీ నా కుటుంబా న్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని అంటాడు. అలాగే నా జాన్ జిగ్రీ ఒకడు ఉన్నాడు వాడి గురించి చెప్పడానికి చాలా ఉంది అని ఆదర్శ్ చెబుతాడు. ఇక వీళ్లిద్దరూ మాట్లాడుకుని కిందకు రాగానే పెళ్లి సంబంధం కాయం అని భవాని చెబుతుంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

ముకుందా పెళ్లి సంబంధం ఫిక్స్ అవ్వడంతో కన్నీరు మున్నీరవుతుంది తన ఫ్రెండ్ తో ఈ విషయాలను చెబుతూ ఏడుస్తుంది.. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నువ్వు అతనికి అంతలా ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయట్లేదు అంటే అతను ఎలాంటి వాడో నీకు ఎప్పటికైనా అర్థం కాలేదా? అయినా కానీ నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను.. నువ్వు తన ఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూనే ఉండు.. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే.. అతనికి కాల్ చేయి.. నువ్వు అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజమని నిరూపించమని ముకుందా అని వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు నిజమని నిరూపిస్తే నువ్వు ప్రేమించిన అతనితో పెళ్లి కూడా చేస్తాను అని ముకుంద కి ఒక అవకాశాన్ని ఇస్తాడు వాళ్ళ నాన్న.

ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది.. మురారి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పటివరకు శివన్న గురించి మురారి కి ఫోన్స్ రావడంతో ఈ కాల్ కూడా అలాంటి వాళ్ళే అయి ఉంటారు అని.. హలో అని ముకుందా మాట్లాడుతుండగా.. నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది విను నువ్వు ఎవరో ఎందుకోసం ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు.. నీ నెంబర్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్న నేను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే నీకు అర్థం కావడం లేదా.. నాకు నీతో మాట్లాడడానికి చిరాకు, కోపం, అసహ్యం అని. అయినా ఎందుకు ఫోన్ చేస్తున్నావు.

నువ్వు చెప్పబోయే విషయం ఏంటో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఏమీ జరగదు ఇంకొకసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు పెట్టేయ్ అని చిరాగ్గా మురారి అంటాడు. కానీ తనకి ముకుందా ఫోన్ చేసింది అని అనుకోడు. ఎవరో శివన్న గురించి బెదిరించడానికి కాల్ చేశారు అని అనుకుంటాడు. ఈ విషయాలు ఏమీ తెలియని ముకుందా అతని చేతిలో మోసపోయానని బాధపడుతుంది.

చూసావా ముకుందా ఇప్పటికైనా నీకు అర్థమైందా అని వాళ్ళ నాన్న అంటాడు. అవును నాన్న నేను చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటాను. నాకు ఇప్పుడే అర్థమైంది. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో. మీరు చెప్పిన అతన్నే పెళ్లి చేసుకుంటాను అని ముకుందా అంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంతే ముకుందా టైం పాస్ చేస్తారు నువ్వు ఆ విషయాలు తెలియక నిజమని అనుకున్నావు పేరెంట్స్ గా మీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలని అనుకుంటాము.

నిన్ను కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకునే వాళ్ళింటికి పంపించాలని ఆశ పడటం కానీ మీరు ఆ విషయాలు ఏమీ అర్థం చేసుకోకుండా ప్రేమించిన వాళ్ళని వద్దు అని అంటున్నారు అని మాత్రమే అనుకుంటారు అని ముకుందా వాళ్ళ నాన్న తనకు అర్థం అయ్యేలా చెబుతాడు. ముకుందా వాళ్ళ నాన్నను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది.

శివన్న అటుగా వెళుతున్న కృష్ణను ఆపి మన పెళ్ళికి ఇంకా నాలుగు రోజులే టైం ఉంది అని అంటాడు. పదా మన పెళ్ళికి కావలసిన షాపింగ్ చేసుకుందాం అని అంటాడు. ఇక కృష్ణ చేతిలో ఉన్న సైకిల్ తీసి తన పక్కనే ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళిపోమంటాడు. కృష్ణ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోబోతుండగా మీ మెడలో తాళి కట్టేది నేనే నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఎవరు వచ్చి కాపాడతారు అని శివన్నా అంటాడు. అంతలో మురారి తన జీప్ లో వస్తారు ఇంకోసారి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్తారు. అంతలో శివన్న మురారి మీదకి కోపంగా వస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో చంద్రశేఖర్ వాళ్ళ ఇంటికి మురారి వస్తాడు. గురువుగారు అని పలకరిస్తాడు. రండి సార్ అని మురారిని లోపలికి తీసుకు వెళ్తాడు. చంద్రశేఖర్ మురారి మీద ఉన్న కోపంతో కృష్ణ ఒంటరిలో కావాలని కారం ఎక్కువగా వేస్తుంది. ఈ కారంతో అతనికి బాగా టార్చర్ పెట్టాలి మొన్న మా నాన్నకు VRS ఇవ్వమంటే ఇవ్వలేదు కదా. నా కోపం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తాను అని కృష్ణ అంటుంది.

మురారి ఆదర్శ కి ఫోన్ చేసి ఇప్పటికైనా నీ భార్య ఎలా ఉంటుందో నాకు చూపించరా అని మురారి అంటాడు ఇప్పుడే చూపిస్తున్నాను నువ్వు చూసి నీకు నచ్చలేదు అని చెబితే ఈ పెళ్లి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఆపేస్తాను అని ఆదర్శం అంటాడు తన ఫ్రెండుతో మాట్లాడమని ముకుందా కి ఆదర్శ ఫోన్ ఇస్తాడు ఇక ఎప్పుడైనా మురారిని ముకుందా చూస్తుందా లేదా అనేది చూడాలి.
