Krishna Mukunda Murari : కృష్ణ మురారి కి ఒకరికొకరు దగ్గర అయ్యారు. ఇక ముకుందా ప్రేమ దూరమైనట్లేనా….. కృష్ణకి మురారీ మీద ఫీలింగ్స్ మొదలుకావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కృష్ణ తన మనసులో మాటను మురారి కి చెప్తుంది. మురారి చాలా సంతోషంగా కృష్ణను దగ్గరికి తీసుకుంటాడు..ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వీడియో చూసి మురిసిపోయినఫ్యామిలీ
కృష్ణా చేసినా పర్ఫామెన్స్ కి ఆ వీడియో చాలా బాగా వచ్చిందని మధుకర్ ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో, అందరూ కృష్ణుని పొగిడే పని పెట్టుకుంటారు. కృష్ణ చాలా సిగ్గుపడుతూదూరం నుంచి ముకుంద చూస్తూ ఉంటుంది.కృష్ణ రోజు రోజుకి మురారి కి దగ్గర అయిపోతుందని ముకుంద చాలా కోపం పెంచుకుంటుంది. ఇక కృష్ణుని మురారి నుండి ఎలా అయినా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం మనసులో మురారి మీద చాలా ప్రేమని పెంచుకుంటుంది. ఏ సి పి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

తన తండ్రి తో ఎమోషనల్ గా మాట్లాడిన కృష్ణ
తన తండ్రి ఫోటో ముందు నిలబడి నేను నా భర్తతో ప్రేమలో పడ్డాను నాన్న అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మొదటినుంచి కృష్ణ తో జరిగిన అన్ని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి, నేను ఏసీబీ సార్ కి ఎలా అయినా నా మనసులో మాట చెప్పేశాను అది తను ఎలా అర్థం చేసుకున్నాడో ఏమో, తనకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్పైనా నా ప్రేమని తెలియజేస్తాను. మురారి నీ కోసమే నా తపన నీలా నేను మారిపోతున్న నా జీవితం ఇక నీకే అంకితం అవ్వాలని ఉంది.అని వాళ్ళ నాన్న ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణ, ఎసిపి సార్ మీరు చాలా మంచివారు మీతో నేను ఇలా ప్రేమలో పడటం చాలా బాగుందిఅని అనుకుంటూ ఉంటుంది. ముకుంద దూరం నుండి కృష్ణను చూస్తూ ఉంటుంది.వీళ్లది నిజంగా అగ్రిమెంట్ పెళ్ళైన లేదంటే కృష్ణ నిజంగానే మురారిని ఇష్టపడుతుందా అని, ఎలా అయినా కృష్ణుని మనసులు మురారి మీద ప్రేమని పోగొట్టాలి అని అనుకుంటునంది.

మురారి తో కలిసి డాన్స్ వేసిన కృష్ణ
కృష్ణ మాత్రం మురారితో ఎలా ఎలా అనే పాటని పాడుకుంటూ డాన్స్ వేస్తూ ఉంటుంది. మురారి ఏంటి కృష్ణ ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు ఏసీపి సార్ అని చెప్తుంది. మురారి నాకు తెలుసు కృష్ణ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, కానీ ఆ మాట బయటకు ఎప్పుడు చెప్తావు అని ఎదురు చూస్తున్నాను. అని అనుకుంటూ ఉంటాడు. అలేఖ్య ముకుంద ఇద్దరూ కృష్ణ వాళ్ళు నిజంగా ప్రేమలో పడినట్టు ఉన్నారు ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది అని అలేఖ్య ముకుంద తో అంటూ ఉంటుంది. ఆ వీడియో చూసి ముకుంద చాలా కోపంతో రగిలిపోతూ, నేనుండంగా మీ ఇద్దరినీ ఎలా కలిగిస్తానో మురారి ఎప్పటికీ నాకే సొంతంఅని మనసులో మాట్లాడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో
ఒక మాస్టర్ ప్లాన్ వేసి ముకుంద, మురారినితన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.చూడాలి ముకుంద ప్లాను, వర్క్ అవుట్ అవుతుందా లేదా కృష్ణ ముందు ముకుంద మళ్ళీ ఓడిపోతుంద….