Krishna Mukunda Murari: మురారి కృష్ణ ఇద్దరూ భోజనం చేయడానికి చూస్తే ఒక్క దాంట్లో కూడా ఫుడ్ ఉండదు అది చూసి కృష్ణ బాధపడుతుంది. వెంటనే మంచినీళ్లు గ్లాసులో పోసి ఇచ్చి మురారి కి ఇస్తుంది. తాగమని ఆ తరువాత డిన్నర్ చాలా బాగుంది కదా ఏసీబీ సర్ మునక్కాడ పులుసు సాంబారు రసం మజ్జిగ చారు అంటూ కవర్ చేస్తుంది. ఆ మాటలకు మురారి కృష్ణను చూస్తూ ఉండిపోతాడు. వాళ్లు వదిలి వెళ్ళింది కేవలం మంచినీళ్లను మాత్రమే కాదు ప్రశ్న వాళ్ళ కన్నీళ్లను కూడా అని మురారి అంటాడు. మనల్ని ఏడవమని ఈ మంచి లను వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. అవును కృష్ణ నువ్వు అన్నం తినకుండా ఉండలేవు కదా పద నిన్ను బయటకు తీసుకెళ్లి భోజనం పెట్టిస్తాను అని మురారి అంటాడు. వద్దు ఏసిపి సర్ మీ పెద్దమ్మ మనం తినకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలరు. పదండి గదిలోకి వెళ్దామని కృష్ణ అంటుంది. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆకలిని ఎలా తట్టుకోవాలా అని అనుకుంటూ ఏ దేవత అయినా వచ్చి మనకి పైనుంచి ఫ్రూట్స్ విసిరేస్తే బాగుండు అని కృష్ణ అనుకోగానే.. వాళ్ళ రూము తలుపు ఎవరో కొడతారు.

Krishna Mukunda Murari: మురారి, కృష్ణకి తిండి లేకుండా చేసిన భవాని.! రేపటికి సూపర్ ట్విస్ట్..
అమ్మో ఎవరో తలుపు కొడుతున్నారు అని కృష్ణ భయపడుతూ ఉంటుంది ఎవరు వచ్చారో నాకు తెలుసు కృష్ణ ధైర్యంగా నువ్వు వెళ్లి తెలుపుతూమని మురారి అంటాడు అమ్మో నేను వెళ్ళను సార్ అని అనగానే ఇక మురారి వెళ్లి తలుపు తీస్తాడు ఆపిల్ ముక్కలు అరటి పండ్లు పెట్టేసి ఉంటాయి అవి తీసుకొని మురారి గదిలోకి వస్తాడు. నిజంగానే దేవత పెట్టిందా ఏసీబీ సార్ అని అనగానే పెట్టింది. ఈ ఇంటి ఇలవేల్పు మా అమ్మ పెట్టింది అంటూ వాళ్ళ అమ్మ గురించి అద్భుతంగా చెబుతాడు. మురారి మీ అమ్మే వచ్చిందని నాకు తెలుసు ఏసిపి సర్ మీరు ఏమనుకుంటారా అని అడిగాను అని కృష్ణ అంటుంది. బయట దానివి నీకే మా అమ్మ గురించి తెలిస్తే మా అమ్మ గురించి నాకు ఇంకా ఎంత తెలియాలి అని మురారి అంటాడు ఇంకాస్త దగ్గరవుతారు మురారి కృష్ణ.

Nuvvu nenu prema: అరవింద గర్భవతి అవ్వడంతో షాక్ లో కృష్ణ.. విక్కీకి పద్మావతి నిజం చెప్తుందా?
మురారి నిద్రలేచేసరికి కృష్ణ రెడీ అయి తల తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి కృష్ణ ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు అని మురారి అడగగానే.. నేను ఇంకా జడేసుకోలేదు ఏసీబీ సార్. మీరు నాకు జడేస్తారా అంటూ కృష్ణ మురారిని ఆట పట్టిస్తుంది. నేను నీకు ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి మురారి మీద పడుతుంది. దాంతో ఇద్దరూ ఓ డ్యూయెట్ వేసుకుంటారు. ఇక వెంటనే మురారిని రెడీ అవ్వమని కృష్ణ చెబుతుంది.

ఏసిపి సార్ నేను కిందకు వెళ్లి వంట చేస్తాను అని కృష్ణ కిందకి వస్తుంది. ఇక కిందకి వచ్చేసరికి రేవతి పల్లీల పొట్టు తీస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణ వంటగదిలోకి వెళ్లి గబగబా తనకు కావలసినవి కట్ చేసుకుంటూ ఉంటుంది. రేవతి కృష్ణ ఎవ్వరూ చూడకుండా నందిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి గడుసు దానివే. నందిని పెళ్లి మాత్రం చేశావు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని రేవతి అడుగుతుంది. ఈ లోపు ఒకసారి ఈశ్వర్ మరొకసారి ప్రసాద్ కృష్ణ రేవతి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అని గమనిస్తూ ఉంటారు. ఆ తరువాత భవాని వచ్చి పెద్దగా రేవతి అని అరుస్తుంది. నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది. ఏంటి నేను కృష్ణతో మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నేనా అక్క ఎప్పుడు మాట్లాడాను అని రేవతి అంటుంది. ఏ కృష్ణ నేను నీతో మాట్లాడాలని రేవతి అడుగుతుంది. లేదంటే అసలు మాట్లాడలేదని కృష్ణ అంటుంది. మరి ఇప్పుడు చేసింది ఏంటి అని అంటే క్లారిటీ కోసం మాట్లాడాను అక్క అని భవాని ముందు అమాయకంగా యాక్షన్ చేస్తుంది. రేవతి ఇక ఆ వంకతో ముకుందా కూడా కృష్ణతో మాట్లాడుతుంది. పొద్దున నాకు గుడ్ మార్నింగ్ చెప్పావు కదా అని అంటుంది. కృష్ణ తో మాట్లాడటం చూసి భవాని పెద్దగా అరుస్తుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటుంది.
Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…

కృష్ణ గోడ మీద ఉన్న యశోద కన్నయ్య ఫోటో వైపు చూస్తూ భవానిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది. అమ్మ యశోద నువ్వు కన్నయ్యను పెంచావు కానీ ఈరోజు నువ్వే ఆయన్ను బాధపడుతున్నావు. ఓవైపు పెంచిన తల్లి ఓవైపు కన్నతల్లి మధ్యలో నీ కన్నయ్య ఎలా నలిగిపోతున్నాడో చూస్తున్నావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణ భవానీని చూస్తూ మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకైనా భవాని మనసు కరుగుతుందేమో చూడాలి.