Krishna Mukunda Murari: నిజంగా మీరు చెప్పిన మాటలను నిజమేనా అని కృష్ణ అడుగుతుంది. గురువుగారి ఎదుట నిలబడి అబద్ధాలు నేను చెప్పను అని మురారి అంటాడు.. అయితే నేను నిన్ను మర్డర్ చేయను అని కృష్ణ అంటుంది.. కృష్ణ యాపిల్ తింటూ పక్కనే బల్ల మీద బల్లిని చూసి యవ్ అని అరిచి వచ్చి మురారి మీద పడుతుంది.. కృష్ణ మురారి దగ్గర అవుతుండగా.. ముకుంద వచ్చి తలుపు కొడుతుంది..

ముకుంద దగ్గరికి వెళ్లిన మురారిని మొదటి రాత్రి నీకు బాగానే జరిగినట్టుంది. బాగా తన్మయత్వం పొందినట్టున్నావు నాకు మాత్రం ఇది కాలరాత్రిగా మిగిలిపోయింది. ఇకనుంచి నీకు నాకు మధ్య ప్రేమ యుద్ధం మొదలవుతుంది. కాచుకో అని మురారి కి ముకుంద సవాల్ విసురుతుంది.
Krishna Mukunda Murari: ముకుంద స్టార్ట్ చేసిన ప్రేమ యుద్దాన్ని మురారి కృష్ణ ఎదుర్కొంటారా.!?
ఇక ఉదయం మురారి నిద్ర లేవగానే ముకుంద గదికి వెళ్తాడు.. మురారి ని చూడగానే ముకుంద కోపంగా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట తప్పావు.. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకోనని మాట ఇచ్చి మళ్లీ మాట తప్పావు.. అలాంటప్పుడు నేను మాట తప్పితే తప్పేముంది నేను మాట తప్పుతాను.. ముకుంద నేను చెప్పేది విని అని మురారి అంటుండగా.. ఇంకా ఆపు ఇప్పటినుంచి నేను చెప్పిందే నువ్వు వినాలి. నువ్వు చెప్పింది నేను వినను అని ముకుందా తెగేసి మురారితో చెబుతుంది. ప్రేమను బ్రతికించుకునేదాకా నా సమరం ఇలాగే సాగుతూ ఉంటుంది. మిస్టర్ మురారి నీ శోభనం సాక్షిగా నేను మాట తప్పుతున్నాను అని ముకుందా అంటుంది. ఇక చేసేది ఏమీ లేక మురారి నిస్సహాయంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు.
Krishna Mukunda Murari: ఒక్కటవుతున్న కృష్ణ మురారిని చూసి ముకుందా తట్టుకోలేక ఏం చేస్తుందంటే.!?
రేవతి వీళ్లేంటి ఇంకా రాలేదు అని అనగానే.. ఆ వీఐపీ అడవిలో నుంచి రావాలి కదా అని భవాని అంటుంది. అప్పుడే కృష్ణ పరిగెత్తుకుంటూ గబగబా వచ్చేస్తుంది. ఈ అడవి పిల్లలకి చీర కట్టుకోవడం కూడా సరిగ్గా రాదా.. వెళ్లి చీర నీటుగా కట్టించుకుని తీసుకురండి అని భవాని అనగానే.. మురారి కృష్ణ చేతిని పట్టుకొని పైకి తీసుకువెళ్లి కృష్ణకి తనే చీర కట్టడం నేర్పిస్తాడు. ఇక అది చూసిన ముకుందా కోపంతో రగిలిపోతుంది..