Krishna Mukunda Murari: కృష్ణ కు మురారి విఆర్ఎస్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తాడు. మా నాన్నకి మీరు విఆర్ఎస్ ఇస్తానన్నారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు ఊరు వస్తున్నాను అని చెబుతుంది. నేను విఆర్ఎస్ ఇవ్వను అది గవర్నమెంట్ చూసుకుంటుంది అని మురారి కృష్ణతో చెబుతాడు. ఇక కృష్ణ అక్కడ నుంచి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్ కూడా పెళ్లికి నేను తర్వాత వస్తాను అని చెబుతాడు. మురారి కారులో ఇంటికి బయలుదేరుతాడు.

ముకుందా ను పెళ్లి కూతురు చేస్తారు. ముకుందా ముఖంలో నవ్వు సంతోషమే కనిపించదు. ఇక అక్కడికి వచ్చిన అందరూ అదే విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు. భవాని కుటుంబం కూడా ముకుందా దగ్గరకు వస్తుంది. వాళ్లు కూడా అదే విషయాన్ని మాట్లాడుకోవడం భవాని వింటుంది. ఇక ముకుందని భవాని నేరుగా నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడుగుతుంది. ముకుందా వాళ్ళ అమ్మానాన్నల వైపు చూస్తుంది. చెప్పద్దు అన్నట్టుగా సైగ చేస్తారు. ఈ పెళ్లి నాకు ఇష్టమే మా అమ్మానాన్నల బలవంతం ఏమీ లేదు అని చెబుతుంది. పెద్దవారు ఈ సమయంలో నేను ఇలా ఎందుకు ఉంటాను మీకు చెప్పక్కర్లేదు అని ముకుందా అంటుంది. నేను నీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చెప్పాను. నువ్వు మీ పుట్టింటి నుంచి మరో పుట్టింటికి వచ్చినట్లే అని భవాని భరోసా ఇస్తుంది.

ముకుందా తన ఫ్రెండుతో తన బాధను చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. ముకుంద నువ్వు బాధపడకు నీకు ఇచ్చిన మాట ప్రకారం అతను తిరిగి వస్తే పెళ్లి చేస్తాం అని చెప్పాం.. అతను తిరిగి రాలేదు అని ముకుంద వాళ్ళ అమ్మ గుర్తు చేస్తుంది చూడమ్మా రెండు పడాల మీద ప్రయాణం ఎంత ప్రమాదకరమో మనసులో ఇద్దరినీ ఊహించుకోవడం కూడా అంతే తప్పు అని వాళ్ళ నాన్న చెప్తాడు. నిన్ను వద్దనుకుని వెళ్లిన వాళ్ళ గురించి ఆలోచించకు అని చెబుతారు. ఇప్పటి నుంచి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడకు ఎంతగా ఆలోచిస్తే అంతగా బాధపడాల్సి వస్తుంది. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు అమ్మడు అని ముకుందా వాళ్ళ అమ్మ చెప్పింది. ఇక ఈ పెళ్లి నువ్వు చేసుకోక తప్పదు అని వాళ్ళ నాన్న అంటాడు.

చంద్రశేఖర్ రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కు వెళుతూ ఉండగా నాన్న సాయంత్రం వెళ్ళి ఇంటికి వస్తారు చపాతీలోకి బంగాళదుంప కర్రీ చేయనా అని కృష్ణ అడుగుతుంది కృష్ణ అప్పుడే నేను టిఆర్ఎస్ తీసుకొను అని అంటాడు వాళ్ళ నాన్న నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాన్న మీరు ఈ రోజే మీ జాబ్ కి రిజైన్ చేసి రండి అని కృష్ణ చెబుతుంది నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఇప్పుడప్పుడే నా జాబ్ కి రిజైన్ చేయను నీకు అర్థం అవుతుందా అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ నాన్న.
మరోవైపు ఆదర్శ్ ముకుందా వాళ్ళ పెళ్ళి ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి. పెళ్లికి వెళ్లిన మురారి ఆదర్శ్ ఇద్దరు కలిసి డాన్సులు వేస్తారు ఇక అప్పుడే మురారి ముకుందను చూసినట్లుగా చూపిస్తారు. ఇక అప్పుడైనా మురారి ముకుందను చూస్తాడా చూడడా అనేది చూడాలి..