Krishna Mukunda Murari: సాక్షిగా నేను మాట తప్పుతున్నాను అని ముకుందా అంటుంది. ఇక చేసేది ఏమీ లేక మురారి నిస్సహాయంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. మురారి ముకుంద రూము నుంచి రావడం చూసిన రేవతి ఏంటి మురారి నువ్వు ముకుందా రూమ్ నుంచి వస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అదేమీ లేదమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. త్వరగా మీరిద్దరూ రెడీ అయ్యి వస్తే కింద పూజకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పూజ మీరిద్దరూ చేయాలి. త్వరగా కృష్ణను రెడీ అయి కిందకి తీసుకొని రా అని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: ముకుంద ఇచ్చిన షాక్ లో నుంచి తేరుకుని మురారి ఏం చేశాడంటే.!?
ప్రకాష్ వీళ్లేంటి ఇంకా రాలేదు అని రేవతి అనగానే.. ఆ వీఐపీ అడవిలో నుంచి రావాలి కదా అని భవాని అంటుంది. అప్పుడే కృష్ణ పరిగెత్తుకుంటూ గబగబా వచ్చేస్తుంది. భవాని కృష్ణ ను చూడగానే ఈ అడవి పిల్లలకి చీర కట్టుకోవడం కూడా సరిగ్గా రాదా.. వెళ్లి చీర నీటుగా కట్టించుకుని తీసుకురండి అని భవాని అనగానే.. మురారి కృష్ణ చేతిని పట్టుకొని పైకి తీసుకువెళ్లతాడు.. అలా మురారి కృష్ణ చేయి పట్టుకుని తీసుకుని వెళ్లడం చూసిన ముకుందా.. ఊహలో మురారినే కృష్ణకి చీర కట్టడం నేర్పిస్తాడు అని అనుకుంటుంది..
Krishna Mukunda Murari:కృష్ణతో మురారి తొలిరాత్రి జరగకుండా ముకుంద సూపర్ స్కెచ్..!
కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. కృష్ణ యూట్యూబ్ లో చూసి చీర కట్టుకోవడం నేర్చుకొని గబగబా బయటకు వస్తుంది.. అద్దంలో తలను తను చూసి నేర్చుకుంటుంది ఇక కృష్ణా రెడీ అయ్యి బయటకు రాగానే కృష్ణ నువ్వు సూపర్ గా చీర కట్టుకున్నావు నీ పట్టుదల గురించి మా పెద్దమ్మకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి పెద్దవాళ్లు మనల్ని తప్పుగా అన్నా కూడా మనం పట్టించుకోకూడదు. వాళ్లని ఎదురించి మాట్లాడకూడదు అని మురారి ప్రవచనాలు చెబుతాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించడానికి రెడీ అయ్యి వెళ్తుండగా ముకుందా మురారి కి ఎదురొస్తుంది అది చూసిన రేవతి కోపంగా ముకుందా దగ్గరికి వెళ్లి నువ్వు మురారి కి ఎదురు రావడం ఏంటి తన భార్య కృష్ణ ఉంది కదా నువ్వు ఎందుకు వచ్చావు అని రేవతి అనగానే.. అక్కడికి భవాని వస్తుంది. ముకుందా నేనే కావాలని ఎదురొచ్చాను అని అనగానే భవాని షాక్ అవుతుంది. ఇక ఏం జరుగుతుందో తరువాకంలో చూద్దాం.