Krishna Mukunda Murari: ఆదర్శ్ ముకుందా వాళ్ళ పెళ్ళి ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి. ఆదర్శ్ పెళ్లి కొడుకును చేసిన తర్వాత సంబరాలు జరుగుతాయి. అప్పుడే ఆదర్శ్ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అంటాడు. ఏమైంది అని అంటే మురారి రాకుండా నా పెళ్లి ఎలా చేస్తారు. వాడేమో రేపు వస్తాడంట వాడు వచ్చేవరకు సంబరాలు నాకొద్దు అని ఆదర్శ్ అంటాడు. అప్పుడే సన్నాయి వాయిస్తూ మురారి అక్కడికి వస్తాడు.. ఇక మురారి ఆదర్శ్ ఇద్దరు కలిసి డాన్సులు వేస్తారు..

ఇక ఆ సంబరాలు ముగిసిన తర్వాత ఆదర్శ్ మురారిని తనకు కాబోయే భార్యను చూసి అంటే ఎలా ఉందో చెప్పమని చెబుతాడు. నువ్వు చూసి చెప్పే వరకు నేను ఈ పెళ్లి చేసుకొని కాక చేసుకోను అని అంటాడు. ఇక మురారి పెళ్ళికూతురుని చూడటానికి వెళుతుండగా తన ఫ్రెండ్ గోపి వచ్చి నీ జహాపనా నెంబర్ ఇచ్చాను నువ్వు తనకి ఫోన్ చేసావా లేదా అని అడుగుతాడు. తనకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. బహుశా నా నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందేమో అని అంటాడు మురారి ఇంకోసారి ప్రయత్నించి చూడండి మురారి ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది. కానీ తను మాత్రం ఎత్తడం లేదు అని అంటాడు.

అంతలో ఆదర్శ్ అక్కడికి వచ్చి రేయ్ మురారి నేను చెప్పింది ఏం చేసావ్.. త్వరగా వెళ్లి పెళ్లి కూతుర్ని చూసి రా పో అని అంటాడు. ఇక మురారి పెళ్లి కూతుర్ని చూడడం కోసం వెళ్తాడు. అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఎక్కడికి మురారి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆదర్శ్ పెళ్లికూతురుని చూసి రమ్మని చంపేస్తున్నాడు అమ్మ. ఒకసారి చూసి తను ఎలా ఉందో చెప్తే నాకు ఒక పని అయిపోతుంది అని మురారి అంటాడు. ఇప్పుడు కింద మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే తను సిగ్గుపడుతుంది కదా.. తర్వాత నగలు ఇవ్వడానికి మన కుటుంబం అంతా కలిసి వెళ్లాలి అప్పుడు తనని చూడొచ్చు కదా అని అంటూ మురారిని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ.. మురారి గొంతు విన్న ముకుందా ఖచ్చితంగా తను ఎక్కడికి వచ్చాడని మెహందీ మధ్యలో నుంచి లేచి తనని వెతకడం కోసం వెళ్తుంది. ముకుంద ఎంత వెతికినా కానీ మురారి కనిపించడు బహుశా తను వచ్చాడన్న ఆలోచనలో ఉండి నేను భ్రమ పడ్డాను ఏమో అని తను అనుకుంటుంది.
ఆదర్శ్ పెళ్లి సందర్భంగా భవాని తో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో పూజ దగ్గర నిలబడి ఉంటారు మురారి వాళ్ళ అమ్మను పెళ్లికూతురికి ఈ నగలు ఇవ్వమని భవాని చెబుతుంది అప్పుడే ఆదర్శ్ వచ్చి అమ్మ ఈ నగలను పెళ్లికూతురికి మురారి చేత ఇప్పించవా అది నా కోరిక అని అంటాడు ఇంత చిన్న కోరిక చెప్పడానికి ఇంత సేపు ఆలోచించాలి ఆదర్శ్ మీ కోరిక ప్రకారం మురారి చేత పెళ్లికూతురికి నగలు ఇప్పిస్తాను అని భవాని అంటుంది మురారి ఈ నగలను జాగ్రత్తగా తీసుకెళ్లి పెళ్లికూతురుకి ఇవ్వమని చెబుతోంది ఈ అమ్మాయి పెళ్లికూతురు ముకుంద ఇతను ఆదర్శ్ వాళ్ళ అన్నయ్య మురారి అని పరిచయం చేస్తాడు మురారిని అక్కడ చూసి ముకుంద ఎమోషనల్ అవుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు మనిద్దరం ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందామని మీ పెద్దలతో చెబుతాము ఇదే ముహూర్తానికి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ముకుందా అంటున్న మాటలను భవాని వింటుంది ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.