Krishna Mukunda Murari: మురారి, జరిగినదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ముకుంద అన్న మాటలు కృష్ణ అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు కృష్ణ ఎందుకు అలా మాట్లాడావు అని అంటాడు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు నిన్న మొన్నటిదాకా ఓపెన్ చేసిన పుస్తకంలా ఉండే దానివి ఇప్పుడు మూసేసిన పుస్తకం లా కనిపిస్తున్నావు.. నీ మాటలు అర్థం నాకు అర్థం కావట్లేదు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నన్నువదిలి వెళ్ళిపోగలవా నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.. రేవతి,ముకుందా అన్న మాటలే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు మురారి కావాలి అని ముకుంద ఇండైరెక్టుగా రేవతిని అడిగినవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి ఏంట అత్తయ్యా ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా అని అంటుంది రేవతి. అత్త ఎందుకు అలా ఉంది అని మనసులో అనుకుంటుంది కృష్ణ. మురారి బాధపడుతూ, సాంగ్ వేసుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న రేవతి..బాధపడిన మురారి.. ముకుంద ఏం చేయనుంది…
కృష్ణ తనకి ప్రపోజ్ చేసిన విషయం తనతో వానిలో తడిచి మాట్లాడిన విషయం, అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు మురారి. కృష్ణ కూడా, ఏసిపి సార్ మనసులో నేనే ఉన్నాను అనుకున్నాను కానీ, ఇప్పుడు ఆయన మనసులో ఎవరో ఉన్నారని తెలిసింది. నా ప్రేమ నాలోని సమాధి చేసుకోవాల్సి వచ్చింది. గడువు పూర్తి కాగానే ఎసిపి సార్ నన్ను పంపించేస్తారా.. అసలు నేను ఇప్పుడు ఈయనతో ఎలా ఉండాలి అని అనుకుంటూ మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. మరి ఇద్దరూ బాధపడుతూ, ఒకరికొకరు ఎదురవుతారు. ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది అనిఅడుగుతాడు మురారి. సర్జరీ ఉందని చెప్పాను కదా అంటుంది కృష్ణ. అయినా అత్తయ్య ఏంటి ఎలా ఉంది అని అడుగుతుంది. మురారి ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు కృష్ణ అని అంటాడు. అవునవును, ఉదయం నేను ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయితో చెప్పింది కరెక్టేనా, మరి నేను చెప్పింది కూడా కరెక్టేనా అని అంటాడు. నీకు కరెక్ట్ అయింది ఇంకొకరికి రాంగ్ అవ్వచ్చు కదా అంటుంది కృష్ణ. మీరు అడిగిన దానికి జవాబు చెప్పకుండా నిలబడతారేంటి అంటుంది. నాకు రాంగ్ అనిపించింది ఇంకొకరు కరెక్ట్ అయి ఉండొచ్చు కదా అంటాడు మురారి. ఆ మాటలకు కృష్ణ ఆలోచనలో పడుతుంది.

నాకు అంతా తెలుసు ఏసిపి సార్..
ఉదయం నిద్ర లేచిన వెంటనే మురారి కృష్ణను లేపుతాడు కృష్ణ ఈరోజు సండే కదా మురళి అంటాడు నిన్న శనివారం అయినప్పుడు ఈ రోజు సండే నే కదా అని కృష్ణ అంటుంది త్వరగా రెడీ అవ్వవు మనిద్దరం రెస్టారెంట్ కి వెళ్దాం అని మురారి అంటాడు అవునా ఇప్పుడు ఎందుకు ఏ సి పి సార్ అని కృష్ణ అంటుంది. కృష్ణ నీ డ్రెస్ సెలెక్ట్ చేయమని మురారి అడుగుతాడు. డ్రెస్ కోసం కబోర్డ్ తీస్తుంది కృష్ణ. మురారి చూసి కంగారుపడి అయ్యో డైరీ అందులోనే ఉంది అనవసరంగా కృష్ణ డ్రస్సులు చేయమని అనుకోని కృష్ణ దగ్గరికి వెళ్లి, ఏదో ఒకటి వేసుకుంటానులే అని అంటాడు. నన్ను సెలెక్ట్ చేయమని మళ్లీ ఏంటి సార్ మీరు నేను ఇస్తాను ఉండండి అని ఒక్కొక్కటి డ్రెస్సులు తీస్తూ ఉంటుంది. కృష్ణ మనసులో ఎక్కడ నేను ఆ డైరీ చూసేస్తాను అందులో ఉన్న విషయాలు నాకు తెలిసి పోతాయో అని మీరు కంగారుపడుతున్నారు అని నాకు అర్థమైంది ఏసీబీ సార్ కానీ ఆ డైరీలో మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు నీ మనసులో ఓ అమ్మాయి ఉందని కూడా నాకు తెలుసు అయినా కానీ నీతో మౌనంగానే ఉండాలా లేదంటే ఎప్పటిలాగా ఉండాలా నా ప్రేమకు ఇదేం పరీక్ష అని కృష్ణ మనసులో అనుకుంటుంది మొత్తానికి ఓ డ్రెస్ సెలెక్ట్ చేసి మురారికేస్తుంది కృష్ణ.

Brahmamudi june 2nd Episode : రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం సిద్ధం చేసిన కుటుంబ సభ్యులు
రేవతి ముందు తలదించుకున్న మురారి..
కృష్ణ మురారి రెడీ అయ్యి కిందకు వస్తారు. రేవతి అత్తయ్యకు చెప్పేసి వస్తాను అంటూ కృష్ణ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళగా.. మురారి కూడా కృష్ణ పక్కనే నిలబడి రేవతి ని చూస్తూ ఉంటాడు. అత్తయ్య మేం టిఫిన్ చేయము మీ అబ్బాయి రెస్టారెంట్ కి తీసుకు వెళ్తున్నాడు. సారీ అత్తయ్య లేటుగా చెప్పాను అని ప్రశ్న అంటుంది . నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి సంతోషంగా బయటికి వెళుతుంటే నేనెందుకు అడ్డు చెబుతాను వెళ్ళిరండి అని రేవతి అంటుంది. కృష్ణ వెళ్తున్నాను అని చెప్పగానే మురారి వాళ్ళ అమ్మని చూసి తలదించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రేవతి మనసులో ఎందుకు వీడు ఏదో తప్పు చేసినట్లు నా ముందు తలకాయ తెంచుకొని వెళ్ళిపోతున్నాడు అని మనసులో అనుకుంటుంది. ముకుంద ఎక్కడ వాళ్ళిద్దరి ప్రేమ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పేసిందేమోనని భయపడుతూ ఉంటాడు మురారి. ఇక కృష్ణ ఏమైంది చెప్పకుండా మొదటిసారి ఇలా మీరు బయటకు వచ్చేసారు అని కృష్ణ అడుగుతుంది. నువ్వు చెప్పావుగా కృష్ణ పదా అని మురారి అంటాడు.

ఓకే రెస్టారెంట్ లో కృష్ణ ముకుందా మురారి..
ముకుంద తన ఫ్రెండ్ మనోజాన్ని తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది ఇక వాళ్ళిద్దరూ మురారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అని మనోజ ముకుందని అడగగానే ఇంట్లో ఉండి ఉంటారు అని అనగానే కాదు ఒకసారి తల పక్కకు తిప్పు మన ఎదురుగా ఉంటారు అని తను అంటుంది ఇక తీయరా కృష్ణ ముకుంద దగ్గరకు వచ్చి పలకరిస్తుంది మనోజ లేచి మురారిని విష్ చేసి మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నాము అని చెబుతోంది. ఇక ఎవరి ప్లేస్ లో వాళ్లు వెళ్లి కూర్చుంటారు ముకుందా కృష్ణను తీసుకొని రావడం చూసి లవ్లోపల రగిలిపోతూ ఉంటుంది . కృష్ణ ఎలాగైనా సరే మనోజాతో మాట్లాడి ఏసీబీ సార్ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

బాంబు బ్లాస్ట్ చేసిన ముకుందా..
ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుందా తన పుస్తకంలో ఐ లవ్ యు మురారి అని రాసుకొని ఉన్న ముగ్గుని రేవతి చూస్తుంది నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావు.. పెళ్లి అయినా భర్త గురించి తప్ప మరి ఇంకెవరి గురించి ఆలోచించకూడదు అని రేవతి తిడుతుంది . చక్కగా కాపురం చేసుకుంటున్న కృష్ణ మురారి లా జీవితంలో నువ్వు ఎందుకు నిప్పులు పోయాలనుకుంటున్నావు అని రేవతి సూటుగా ముకుందని నిలదీస్తుంది . అయ్యో అత్తయ్య నాకు వాళ్ళిద్దరూ గురించి ఓ నిజం తెలుసు అన్నట్లుగా ముకుందా మాట్లాడేసరికి ఏంటి మాకు ఎవరికీ తెలియని నిజం మీకు తెలిసిన నిజం ఏంటో చెప్పమని రేవతి ముకుందని నిలదీస్తుంది . మురారి కృష్ణా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని కొన్ని రోజులు అయితే తను వెళ్ళిపోతుందని బాంబు బ్లాస్ట్ చేస్తుంది ముకుందా ఇక ఏం జరుగుతుందో చూడాలి.