Krishna Mukunda Murari: కృష్ణ చీర కట్టుకొని రెడీ అయ్యి బయటకు రాగానే కృష్ణ నువ్వు సూపర్ గా చీర కట్టుకున్నావు.. నీ పట్టుదల గురించి మా పెద్దమ్మకు తెలియదు కానీ.. ఒక్కొక్కసారి పెద్దవాళ్లు మనల్ని తప్పుగా అన్నా కూడా మనం పట్టించుకోకూడదు. వాళ్లని ఎదురించి మాట్లాడకూడదు అని మురారి ప్రవచనాలు చెబుతాడు.. ఇక కిందకి రాగానే అంతా కృష్ణ ను చూసి ఆశ్చర్యపోతారు. దీపం వెలిగించమని అడగగానే.. ఏ సి పి సార్ అగ్గి పెట్టి లేకుండా దీపం వెలిగించడం నాకు రాదు అని కృష్ణ జోక్ వేస్తుంది..

భవాని అగ్గిపెట్టెను కృష్ణ చేతికి ఇవ్వకుండా పక్కన పెడుతుంది. కృష్ణ అగ్గిపెట్టి తీసుకొని దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది.. కృష్ణ బయటకు దీపానికి అంటుకుంటున్నట్టు ఉంటుంది. కృష్ణ జాగ్రత్త చూసుకో అని భవాని పెద్దగా అరుస్తుంది. తన పేరు భవాని నోటి నుంచి వినగానే కృష్ణ ఆనందంతో పొంగిపోతుంది.. మురారి కాళ్ళకు దండం పెట్టమని చెబుతారు. బలవంతం మేరకు కృష్ణ మురారి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది.
మురారి ఇంట్లో వాళ్ళందరూ తో మాట్లాడుతూ ఉండగా.. కృష్ణ మురారితో మాట్లాడా లని బంతి పువ్వు ని తీసి విసురుతుంది. ఆ బంతి పువ్వు వెళ్లి భవాని దగ్గర పడుతుంది. ఆ పువ్వు మీకోసం కాదని మురారి కోసం వేసారని అంటుంది. ఇక ఫైనల్ గా మురారి మీదకు మరోసారి బంతి పువ్వులు విసురుతుంది. అందరూ చూసి వీరి మధ్య ఏదో ఉందని మురారిని ఆట పట్టిస్తారు. ఏ సిటీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పండి. నేను వాళ్లకి తగ్గట్టుగా మారుతాను అనగానే.. మురారి ఇంట్లో వాళ్ళందరూ గురించి బోర్డ్ మీద రాస్తూ చెబుతాడు. భవాని పెద్దమ్మ డిస్ప్లే నాన్న క్రేజీ అమ్మ హౌస్ వైఫ్ అంటూ అందరి గురించి బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను మారను అంటూ కృష్ణ నేను నేను లాగానే ఉంటానని చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించడానికి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తుండగా ముకుందా మురారి కి ఎదురొస్తుంది.. అది చూసిన రేవతి కోపంగా ముకుందా దగ్గరికి వెళ్లి నువ్వు మురారి కి ఎదురు రావడం ఏంటి.. తన భార్య కృష్ణ ఉంది కదా .. నువ్వు ఎందుకు వచ్చావు అని రేవతి అనగానే.. అక్కడికి వచ్చిన భవాని ఆ అడవి పిల్లకి ఇంట్లోకి రావడమే కానీ భర్త వెళ్తుంటే ఎదురు రావాలని తెలియదా అని అంటుంది.. ముకుందా వెంటనే నేనే కావాలని ఎదురొచ్చాను అని అనగానే భవాని షాక్ అవుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.