25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి జోలికి వస్తె ఊరుకోనని ముకుంద కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భవాని.. రేవతి పై ఫైర్..

Krishna Mukunda Murari serial
Share

Krishna Mukunda Murari:కృష్ణని అలేఖ్య , అవంతిక ఇద్దరూ రౌండప్ చేసి ఇంట్లో వాళ్లందరి గురించి నువ్వు ఏం అబ్సర్వ్ చేసావో వాళ్ల గురించి చెప్పమని అడుగుతారు. ముందు మొదటిగా రేవతి గురించి అడగగా మా అత్తయ్య చాలా మంచిదని తను చూడటానికి అమాయకంగా కనిపిస్తుంది. కానీ తనకి అన్ని విషయాలు తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తను అందరి విషయాలు తెలుసుకుని పెద్దవిడి దగ్గరకు వెళ్లి పుల్లలు పెడుతూ ఉంటుంది అని చెబుతుంది.

Krishna Mukunda Murari serial 31 December 2022  today 42 episode Highlights
Krishna Mukunda Murari serial 31 December 2022 today 42 episode Highlights

ఇక అలేఖ్య గురించి చెప్పమనగానే తను పెద్ద డిటెక్టివ్ అని ప్రతి ఒక్కరి గదిలోకి తొంగి చూస్తుందని.. అక్కడ తెలుసుకున్న విషయాలను తన భర్తతో చెప్పినదాకా తన కడుపు ఉబ్బరం ఆగదని చెబుతుంది. ఇక పెద్దావిడ గురించి చెప్పమనగానే పెద్దావిడ పెద్ద పెద్ద అని కృష్ణ అంటుండగా మీకేం పని లేదా అని భవాని పెద్దగా అరుస్తుంది. నేను అనుకున్నంత అమాయకురాలైతే కాదు ఈ అడవి పిల్ల .. చాలా తెలివైనది అని భవాని మనసులో అనుకుంటుంది..

Krishna Mukunda Murari serial
Krishna Mukunda Murari serial

అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా ముకుందా వచ్చి మురారి పక్కన కూర్చుంటుంది. అదేంటమ్మా ముకుందా? మురారి పక్కన కూర్చున్నావు తన భార్య కృష్ణ వచ్చింది కదా అని రేవతి అంటుంది. ముందు నేనే వచ్చాను కదా అత్తయ్య అని తనే పక్కన కూర్చుని టిఫిన్ చేస్తుంది అని ముకుంద అంటుంది. కానీ రేవతికి అదంతా నచ్చదు. కాస్త కోపంగా ఉంటుంది. ముకుందా పై ఎవరి హద్దుల్లో వాళ్లకు ఉంటే మంచిది అని రేవతి అంటుంది. ఇక ఆ విషయం గురించి డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద రచ్చే జరుగుతుంది.

 

మురారి పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించడానికి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తుండగా ముకుందా మురారి కి ఎదురొస్తుంది.. అది చూసిన రేవతి కోపంగా ముకుందా దగ్గరికి వెళ్లి నువ్వు మురారి కి ఎదురు రావడం ఏంటి.. తన భార్య కృష్ణ ఉంది కదా .. నువ్వు ఎందుకు వచ్చావు అని రేవతి అనగానే.. ముకుంద మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య నేను ఇప్పుడు దాకా బాధపడి బయట నుంచి అలా వచ్చాను అని ముకుందా చెబుతుంది మీకు ఈ ఇంట్లో నేను ఉండటం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇందాక మీరు నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అరిశారు. ఇప్పుడు ఈ విషయంలో అరుస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అతనితో చెబుతాను అంటూ భవాని దగ్గరికి వెళ్తుంది ముకుందా.

అక్కడికి వచ్చిన భవాని ఆ ఏంటి ప్రకాష్ మీ ఆవిడకు ఈ ఇంట్లోకి రావడానికి ఎదురు రావాడానికి తేడా తెలియదా అని అంటుంది.. ప్రకాష్ రేవతిని అరబోతుండగా మీకు మీకు ఏమైనా ఉంటే మీ గదిలోకి వెళ్లి చూసుకోండి. అంతేకానీ ఇక్కడ అరుచుకోబాకండి ముకుందా నువ్వు చెప్పావని రేవతిని నిన్ను తప్పు పట్టడం లేదు ..రేవతి మీ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు అది తన వ్యక్తిత్వం ఇక ఎవరి హద్దుల్లో వారు ఉంటేనే మంచిది అన్నట్టుగా భవాని చెబుతుంది . అయినా మురారి కి ఇప్పుడు పెళ్లయిపోయింది పిచ్చిదో పిచ్చిదో ఆ అడవి పిల్ల వచ్చింది కదా తను మురారి భార్య ఇక మురారికే ఏం చేయాలన్నా కూడా కృష్ణనే చూసుకుంటుంది. మీరు ఎవరు మురారి విషయంలో కల్పించుకోవద్దు అని భవాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ పోలీస్ డ్రెస్ టోపీ పెట్టుకుని వాళ్ళ నాన్నకి సెల్యూట్ చేస్తుంది. అప్పుడే దందా ఊడి పడిపోబోతుండగా పీఠిహెక్కి ఆ దండ సరిచేస్తుంది.  కృష్ణ పడిపోతుండగా .. మురారి వచ్చి తనని పట్టుకుంటాడు దూరం నుంచి అది ముకుందా చూసి కడుపు మంటతో రగిలిపోతుంది..


Share

Related posts

Ram Charan: కళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా..??

sekhar

`మాచర్ల నియోజకవర్గం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్‌తో సంబంధ‌మే లేదు!

kavya N

ఇక వెయిట్ చేయ‌లేను.. బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ పోస్ట్ వైర‌ల్‌!

kavya N