Madhuranagarilo November 18 2023 Episode 213: మా వాడికి ఫోన్లు చేసి తెగ బెదిరిస్తుంది ఆ అమ్మాయి మావాడు మొదట చేసుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పాలా లేదంటే రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి నా మొదటి భార్య తిరిగి వచ్చిందని చెప్పాలా అని అలిగిపోతున్నాడు మా వాడు అని సుభాషిని అంటుంది. అంటే మొదటి భార్య వచ్చిన విషయం రెండో భార్యకు మీరు ఇంకా చెప్పలేదా అని రాదా అంటుంది. చెప్తే ఏం జరుగుతుందో అని భయపడి చెప్పలేదమ్మా అని సుభాషిని అంటుంది. అలా చెప్పకపోతే ఒక రకంగా మీ ఇంటిలో వాళ్లు ఆ మొదటి భార్యని మోసం చేసినట్టు అవుతుంది, అలా మీరు రెండో కోడలికి చెప్పకుండా దాస్తే జీవితంలో మిమ్మల్ని క్షమించదు మా ఇంట్లో అయితే అలా చేయరు మా అత్త మామయ్య నాకు వెంటనే చెప్తారు మీరు అలాగే చెప్పండి అని రాదా అంటుంది. చెప్పే వాళ్ళమే అమ్మ కానీ వాళ్ళు ఇద్దరు చుట్టాలు వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిస్తే మా వాడిని వదిలేసి వెళ్ళిపోతే మా వాడు అన్యాయమైపోడా అని సుభాషిని అంటుంది.

సొంత అక్క చెల్లెలు అయిన సరే మీరు చెప్పాల్సిందే వాళ్ళ ముగ్గురు జీవితాలకు సంబంధించిన విషయం వాళ్లే తేల్చుకుంటారు అని రాధా అంటుంది. వదిన నీ మాట కూడా అదేనా అని సుభాషిని అడుగుతుంది. నాదొ ఒక మాట మాత్తదో ఒక మాట ఉండదు నాది మాత్తదీ ఒకటే మాట అని రాదా అంటుంది. సరే వదిన మొదటి భార్య వచ్చినట్టు ఆ రెండో కోడలికి చెప్పేస్తాము అని సుభాషిని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే రుక్మిణి రాధకి వీడియో కాల్ చేసి పండుతో మాట్లాడుతుంది. ఫోన్లో వాళ్ళ అమ్మానాన్న బాధపడుతున్నట్టు కనిపిస్తుంది రాధకి. ఏంటమ్మా అలా బాధగా ఉన్నారు నాన్న బాగానే ఉన్నాడా అని రాధా అంటుంది. ఏమీ లేదమ్మా మీ నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు అని నాగమణి అంటుంది. నేను రావడం వల్లే నాన్న వాళ్ళు డల్లుగా ఉన్నారు అనుకుంటా రాదా అని రుక్మిణి అంటుంది. నీవల్ల వాళ్ళు ఎందుకు బాధపడతారు అక్క అని రాధ అంటుంది. పెద్దమ్మ నాకు స్కూలుకు టైం అవుతుంది బాయ్ అని పండు అంటాడు.

ఇదంతా ఆ ఎమ్మెస్ సుందరం గాడి వల్లే జరుగుతుంది రేపు ఎలాగో కలుస్తున్నాను కదా వాడికి ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్తాను అప్పుడు కొడుకు కోసమైనా నన్ను జీవితంలోకి ఆహ్వానిస్తాడు అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే,అమ్మ నా విషయంలో మాత్రం రాదకి నా మొదటి భార్య గురించి చెప్పొద్దు అని శ్యామ్ అంటాడు. అలా చెప్పకపోతే మోసం చేసినట్టు అవుతుంది కదరా అని మధుర అంటుంది. రాధకి నిజం చెప్తే వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు రాదని వదిలిపెట్టినందుకు వాడు కుమిలిపోతూ ఉంటాడు అని ధనుంజయ్ అంటాడు కట్ చేస్తే ఏంటి అత్తయ్య ముగ్గురు తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు అని రాదా అంటుంది. అదేనమ్మా ఇందాక సుభాషిని వాళ్ళ కోడలు గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటున్నాము అని మధుర అంటుంది. దాని గురించి తీరిగ్గా తర్వాత ఆలోచిద్దురు గాని పండుకి స్కూలు టైం అవుతుంది స్కూల్ దగ్గర దింపేసి రండి అని రాదా అంటుంది.

ఇదేంటి డాడీ మన ఇంటి ముందు కాక అరుస్తుంది అని పండు అంటాడు. కాకి అరిచిందంటే మన ఇంటికి చుట్టాలొస్తున్నట్టు పండు అని రాదా అంటుంది. శ్యామ్ పండు ని తీసుకొని స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య మళ్ళీ మీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నారా అని రాదా అంటుంది. లేదమ్మా చుట్టాలు అన్నావు కదా ఎవరు వస్తారా అని ఆలోచిస్తున్నాము అని మధుర అంటుంది. కట్ చేస్తే ఈరోజు ఎలాగైనా వడ్డీతో సహా వసూలు చేసుకుని వెళ్దాం రా అని వాళ్లు చలపతి గారు చలపతి గారు అని పిలుస్తారు, డోరు తీయట్లేదని తలుపు బద్దలు కొడతారు డోరు ఊడిపోయి చలపతిరావు కాళ్ళ మీద పడతారు. డోర్ దగ్గర ద్వారపాలకు లాగా నిలబడి దోరు తీయకుండా ఉన్నారేంటి అని అతను అంటాడు. తీద్దామనుకునే లోపు మీరే బద్దలు కొట్టుకొని వచ్చేసారు కదా అని చలపతి అంటాడు. నా వడ్డీ డబ్బులు అసలు కట్టకుండా ఇకనుంచి వెళ్ళేది లేదు అని అతను అంటాడు. మీ అసలు వడ్డీ మొత్తం ఇచ్చేస్తానండి అని చలపతి అంటాడు.

ఏంటి ఇచ్చేది 10 నెలలుగా నా ఇల్లు కిరాయి కట్టలేదు మీ అప్పు ఎక్కడ తీరుస్తాడు అని ఇంటి ఓనర్ అంటాడు. నీ కిరాయి ఇతని డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను దాక్షాయని వెళ్లి బ్యాగ్ తీసుకురా అని అంటాడు చలపతి. సరే అని దాక్షాయని వెళుతూ తుమ్ముతుంది. దాక్షాయని ఆగు ఆ బ్యాగు తీయకు ఏవండీ మీరు రేపు ఉదయం కల్లా వచ్చేసేయండి మీ డబ్బులు ఇచ్చేస్తాను అని చలపతి అంటాడు. ఇప్పుడు ఇస్తానన్నారు కదా అని అతను అంటాడు. మా ఆవిడ తుమ్మింది కదా అండి డబ్బులు ఇవ్వకూడదు అని చలపతి అంటాడు. సరే అయితే రేపు పొద్దున్నే వస్తాను అని వాళ్ళు వెళ్ళిపోతారు.

ఏవండీ ఇప్పుడైతే తుమ్ముని అడ్డం పెట్టుకొని వాళ్ళని పంపించేస్తారు రేపు పొద్దున వస్తే ఏమిస్తారు అని దాక్షయని అడుగుతుంది. వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండటం కదా దాక్షాన్ని మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోతాము అని చలపతి అంటాడు మా అన్నయ్య ఇంట్లోకి రాణిస్తాడంటావా అని దాక్షాయిని అంటుంది. ఇంటి ముందు పడి ఉంటే ఎందుకు రానివ్వడు అని చలపతి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ నువ్వు వస్తుంది