Malli Nindu Jabili ఏప్రిల్ 27: శరత్ గురించి నిజం తెలిసిన వసుంధర అతనిని నిలదీస్తుంది. మీ కొటేషన్స్ నా ఎమోషన్స్ ని కూల్చేస్తాయి అని అనుకుంటున్నారా? అని వసుంధర శరత్ ని కడిగేయటం తో మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 27 ఈ రోజు ఎపిసోడ్ S1E345 మొదలవుతుంది. క్రితం ఎపిసోడ్ లో శరత్ మీరా గురించి నిజం అరవింద్ కుటుంబానికి చెప్పేస్తాను అని వసుంధర బయలుదేరటం తో ముగుస్తుంది. ఇక ఈ రోజు కథ లో ఎలాంటి మలుపులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జరిగినదానికి శరత్ ని పెద్ద మనసుతో క్షమించు వసుంధర
నిజం ఏనాటికి బయటకి రాదు అనుకున్నావా శరత్ అని వసుంధర భావోద్వేగానికి లోనవుతుంది. ఇంతలో శరత్ తల్లి వసుంధరను పెద్దమనసు చేసుకొని శరత్ ని క్షమించమని అడుగుతుంది. నిజం ఏరోజుకైనా బయటకి వస్తుంది అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాము అని అంటుంది. క్షమించమన్నారు అంటే ఇంతకాలం మీ అబ్బాయి చేసిన తప్పు గురించి మీకు తెలుసు అన్నమాట, అంటే మీరు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు అన్నమాట. పైగా క్షమించమని చాలా సులువుగా అడుగుతున్నారు ఇప్పుడు నా మనసు ఇంకా రగిలిపోతుంది అని ఏడుస్తూ అంటుంది వసుంధర.

వద్దు నాన్న…మీరు ఇంకేం చెప్పొద్దు
మాలిని అనుకోని పరిస్థితులలో జరిగినదానికి… అని శరత్ మాలినితో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు. మాలిని శరత్ ని మాట్లాడకుండా ఆపేసి, వద్దు నాన్న మీరు ఇంకేం చెప్పొద్దు. మామ్ నా గురించి నా కాపురం గురించి ఆవేశపడుతున్నా మీరు నా గురించి చాలా కూల్ గా ఆలోచిస్తున్నారు అని నాకు మీ మీద చాలా గౌరవం ఉండేది అది మీరు ఇప్పుడు పోగొట్టుకున్నారు. కొడుకు అమ్మకు దెగ్గరగా ఉంటాడు కూతురు నాన్నకు దెగ్గరగా ఉంటుంది, నాన్నను రోల్ మోడల్ గా చూస్తుంది ఇప్పుడు మీరు ఆ స్థానానన్ని కోల్పోయారు. మీరు నాకు శిఖరం లా ఉండే వారు ఇప్పుడు నెల మీదకు పడిపోయారు. మామ్ ని మీరు చాల బాధ పెట్టారు. ఆడదానికి ఉండే కమిట్మెంట్స్ మగవాడికి ఎందుకు ఉండవు అంది మాలిని శరత్ ని ఏడ పెడా తిట్టేస్తుంది.

మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంది
నా దృష్టిలో మీరు ఫాదర్ గా ఫెయిల్ అయ్యారు, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని ఎమోషనల్ అవుతుంది మాలిని. మాలిని ఇలా అనటం శరత్ ను ఎంతగానే పిండేస్తుంది. అతనికి మాలిని తో చిన్నప్పటినుండి గడిపిన క్షణాలు అన్ని గుర్తు వస్తాయి.
చూడండి మీరా గురించి గాని మల్లి గురించి గాని ఎవరికైనా తెలిసిందంటే మాత్రం నేను ఉరుకునేదే లేదు అని వసుంధర శరత్ కి వార్నింగ్ ఇస్తుంది. మీ భార్య పేరు వసుంధర మీ కూతురి పేరు మాలిని థట్స్ ఆల్ కాదని పిచ్చి వేషాలు వేసారో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పేస్తుంది. ఇంతలో మాలిని అంటుంది ‘ఆ మల్లి ఏమి తక్కువ కాదు నేను అరవింద్ దూరం అవ్వడానికి మల్లినే కారణం’.

ఇప్పుడు దాని గురించి ఎందుకు వదిలేయ్ అని మల్లి అరవింద్ పెళ్లి గురించి శరత్ కు మాలిని చెప్పకుండా ఆపేస్తుంది వసుంధర. ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం మీ నాన్న నీకు న్యాయం చేస్తాడు అని అనుకుంటున్నావా? అని అంటుంది. శరత్ వైపు తిరిగి మల్లి వలన నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది ఇలానే జరుగుతే అది జాగర్తగా ఉండాలి అని వార్నింగ్ ఇస్తుంది వసుంధర.
మల్లి గురించి మనోమదన పడుతున్న అరవింద్

తరువాత సీన్ లో అరవింద్ ఒంటరిగా కూర్చుని మల్లి గురించి బయటకు ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత మంది మల్లి గురించి తప్పుగా అనుకుంటున్నా మల్లి మాత్రం ఒంటరిగా ఓపికగా ఆ బరువు మోస్తుంది ఎంత మంది ఆడవారు ఇలా ఉంటారు అని మనసులో అనుకుంటాడు అరవింద్. కోటి మందిలో ఒక్కరు కూడా నీలా ఉండటం కష్టమే అని అనుకుంటూ మల్లిని వెతుకుతూ వెళ్తాడు. మల్లి గుడికి వెళ్ళింది అని తెలుసుకుని కలవడానికి వెళ్తాడు అరవింద్. అక్కడ గుడిలో మల్లి బండలు తుడుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అందరూ తనని తిట్టిన విషయాలు గుర్తువొచ్చి ఆ దేవుడితో బాధ వ్యక్తపరుస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న మాలిని వసుంధరలు గుడి దెగ్గర అరవింద్ బైక్ చూసి గుడి లోపలి వెళ్తారు. అక్కడ అరవింద్ మల్లికి ప్రసాదం తినిపిస్తూ ఆప్యాయంగా మాట్లాడటం చూసి కోపం తో రగిలి పోతారు. ఆ తరువాత ఏమవుతుందో తెలియాలి అంటే మల్లి నిండు జాబిలి రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.
