Malli Nindu Jabili జూన్ 5 ఎపిసోడ్: సత్య ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో కూడా తెలియదమ్మ అని మీరా ఏడుస్తూ జగదాంబ తో జరిగిన విషయం చెప్తుంది. పట్నం కి పోయి దొరికిపోయినాడు, కలిసే రాత ఉంటె కచ్చితంగా వొస్తాడు లే అని జగదాంబ మీరా తో అనడం తో ఈ రోజు మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ 372 మొదలవుతుంది. అవును ఇంతకీ మల్లి ఎలా ఉంది, మల్లి అత్త గారు పిలిచారు అని పట్నం పోయినావు కదా ఏమిటి విషయం అని జగదాంబ ఆరా తీస్తుంది.

Malli Nindu Jabili జూన్ 5 ఎపిసోడ్: మీరా ను నిలదీసిన జగదాంబ
సమాధానం చెప్పమంటే అటు తిరిగి పోయావేంటే ఇటు తిరిగి సమాధానం చెప్పు అని జగదాంబ మీరని ని అడుగుతుంది. ఏడుస్తున్న మీరాను చూసి ఎందుకు ఏడుస్తున్నావ్ మీరా అని అడుగుతుంది. బాధతో ఏడుస్తూ జగదాంబను హత్తుకుంటుంది మీరా. నా కూతురికి జరిగిన అన్యాయం గురించి నా తల్లి దెగ్గర చెప్పుకోక పోతే నాకు నేనే మోసం చేసుకున్న దానిని అవుతాను అని మీరా అంటుంది. మల్లికి అన్యాయమా అని అర్ధం కానట్లు అడుగుతుంది జగదాంబ.

వాళ్ళ అంతు తేలుస్తాను
మీరా మల్లికి అన్యాయం జరిగింది అని చెప్పగానే మల్లి కి అన్యాయం చేసింది ఎవరో చెప్పు వాళ్ళ అంతు తేలుస్తాను అని జగదాంబ కోపంగా అంటుంది. ఆ అరవింద్ బాబు గారు మల్లి కాకుండా ఇంకొకరి మెడలో తాళి కట్టినాడు అని మాలిని అరవింద్ పెళ్లి గురించి అసలు జరిగిన విషయం చెప్పేస్తుంది మీరా.

మల్లి ని వాళ్ళే గెంటేసి ఉంటారు
అరవింద్ బాబు మాలిని మధ్యలో తాను ఉండను అని మల్లి ఎక్కడికో వెళ్లిపోయింది అని జగదాంబ తో మీరా అంటుంది. అది వెళ్ళిపోయి ఉండదు వాళ్ళే మెడ పట్టుకుని గెంటేసి ఉంటారు అని కోపం తో ఊగిపోతోంది. నా మల్లి జీవితం ఇలా అయిపోతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు అమ్మ అని బోరుమని ఏడుస్తుంది మీరా.

Malli Nindu Jabili జూన్ 5 ఎపిసోడ్: మన జీవితాలు ఇలా అవడానికి కారణం నాకు తెలుసు
మీరా అన్న మాటలు విన్న జగదాంబ ఇలా అంటుంది, మన జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు అని పక్కన ఉన్న ట్రంక్ పెట్టిలోంచి మీరా శరత్ ఫోటో బయటకి తీస్తుంది. వీడే కదా అని ఫోటో లో ఉన్న శరత్ ను చూపిస్తూ ప్రశ్నిస్తుంది జగదాంబ. అది చూసిన మీరా తన తల్లి కి ఈ విషయం ఎలా తెలుసు అన్నట్లు ఆశ్చర్యపోతుంది.

నీ కూతురికి జరిగిన అన్యాయం గురించి చెప్పినవ్ మరి నీకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడు చెప్తావు అని మీరాను మొఖం పట్టుకుని అడుగుతుంది జగదాంబ. పెద్ద పెద్ద విషయాలు ఇనప పెట్టిలో ఎలా దాగుతాయి అనుకున్నవు ముందు వీడిని పట్టుకుని తన్నాలి అని శరత్ ఫోటోను చూపిస్తూ అంటుంది జగదాంబ.
నా కంటే ముందే వసుంధరను పెళ్లి చేసుకున్నాడు
శరత్ బాబు గారి గురించి నీకు ఇంకో విషయం చెప్పాలి అమ్మ, వసుంధర అనే ఆమెని శరత్ బాబు నా కంటే ముందే పెళ్లి చేసుకున్నారు అని మీరా అంటుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్ లో మీరా వయసులో ఉన్న శరత్ తో వసుంధరకు శరత్ కు పుట్టిన బిడ్డ గురించి మీరా అడగటం దానికి శరత్ అవును అనడం మనం చూస్తాం. అరవింద్ బాబు గారు మల్లికి మాలినికి తాళి కట్టాడు, శరత్ బాబు గారు వసుంధరకు తాళి కట్టినాడు కానీ నాకు మాత్రం మల్లిని ఇచ్చాడు అని మొత్తం చెప్పేస్తుంది మీరా. మల్లికి తన నాన్న శరత్ బాబుగారు అని తెలిసిపోయినది అని కూడా చెప్పేస్తుంది.

Malli Nindu Jabili జూన్ 5 ఎపిసోడ్: నన్ను ఆడిపోసుకున్నారు కానీ ఇప్పుడు
నేను గయ్యాళి దానిని అని నన్ను ఆడిపోసుకున్నారు కానీ ఇప్పుడు ఆఖరికి నేను చెప్పినట్లే జరిగింది అని జగదాంబ అంటుంది. పట్నం మొగాడిని అస్సలు నమ్మకూడదు, అయినా మల్లి కనిపించకుండా పోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వొచ్చినవ్ అని అడుగుతుంది. నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఎం చేయాలో అర్ధం కావట్లేదు అని తన బాధ చెప్పుకుంటుంది మీరా.
Malli Nindu Jabili: అందరి ముందు మల్లి తాళిని బయటకు తీసిన అరవింద్…వసుంధర దుమ్ము దులిపిన అరవింద్ కుటుంబం…ట్విస్ట్ మీద ట్విస్ట్!!
సత్య లేడు కాబట్టి నేను రంగం లోకి దిగుతాను
నువ్వు నీ కూతురు అమాయకులు కాబట్టే మీ జీవితాలు ఇలా ఉన్నాయి. మీ తరుపున పోరాడటానికి సత్య లేదు కాబట్టి నేను రంగం లోకి దిగుతాను అని మీరాకు ధైర్యం చెప్తుంది జగదాంబ. ఆ అరవింద్ ఇంట్లో తిష్ట ఎసి మల్లికి న్యాయం జరిగేలా చేస్తాను అని జగదాంబ అంటుంది దానికి బదులుగా గొడవలు అయిపోతాయి అని మీరా అంటుంది. గొడవల్లో నాకంటే తోపు ఎవరి కొమ్ములు లేని పొట్టేలుని పంజా విసిరానంటే శివంగి అయిపోతా నువ్వు ఎం బయపడకు ఇక నుండి కథను నేను నడిపిస్తా అని ఆవేశం తో అంటుంది జగదాంబ.

అరవింద్ మాలిని మధ్య సంభాషణ
తరువాత సీన్ లో తన గదిలో ఒక్కడే కూర్చిని మల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అరవింద్. ఇంతలో మాలిని అక్కడకు వస్తుంది. ఎమ్ ఆలోచిస్తున్నావు అరవింద్ అని దానికి ఏమిలేదు అని సమాధానం ఇస్తాడు అరవింద్. ఆన్సర్ తెలిసి కూడా అడిగాను చూడు నాకు బుద్ధి లేదు, మల్లి కనిపించడం లేదు అనే కదా నీ బాధంతా అని అంటుంది. మల్లి కనిపించింది మాలిని అని అరవింద్ అనే సరికి ఆశ్చర్యంగా మొఖం పెడుతుంది మాలిని. ఎక్కడ అని అడుగుతే గుడి దెగ్గర మల్లితో అరవింద్ కు అయినా మాటలు గర్షణ గురించి మాలిని కి చెప్పేస్తాడు అరవింద్.

అరవింద్ ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది మాలిని. ఇప్పుడున్న పరిస్థితులలో అత్తయ్య మామయ్య మల్లిని అంగీకరించలేరు, ఇక్కడే వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఛీ అనిపించుకోవడం తప్ప మల్లికి ఇక్కడ ఏముంది అని అరవింద్ కి చెప్తుంది మాలిని. పేరెంట్స్ ని కూడా బాధ పెట్టకూడదు అరవింద్ అని అంటుంది, దానికి బదులుగా నేను ఏమైనా కావలి అని చేస్తున్నానా మల్లి చదువు అయిపోయేదాకా ఆగమని అంటే ఎవరైనా విన్నారా అని అంటదు అరవింద్. ఆ రోజు మల్లి నా ప్రాణాలు కాపాడక పోయుంటే ఈ రోజు మాలినికి భర్తగా ఉండేవాడిని కాదు కదా అని అంటదు ఇలా వీరి మద్య కొంచెం సేపు సంభాషణ జారుతుంది.

కథలో గౌతమ్ మాలి మధ్య కీలక మలుపు
మరోవైపు రోడ్ మీద ఒక్కతే నడుచు కుంటూ వెళ్తుంది మల్లి, ఇంతలో అక్కడ కారు లో వెళ్తున్న గౌతమ్ నిర్లక్ష్య ధోరణ తో వేగంగా నడుపుతూ నీరు ఆగిన ఒక గుంటమీదనుంచి వెళ్తాడు. ఆ గుంటలో నీరు మాలి మీద పడుతాయి. ఈ గౌతమ్ పాత్ర కథలో కీలక మలుపును తెస్తుంది, మల్లి జీవితం లోకి అరవింద్ కాకుండా మరొక మొగాడు మనకు కనపడతాడు. కారు ఆలా నిర్లక్షయంగా నడుపుతూ వెళ్తున్నందుకు గౌతమ్ ని పట్టుకుని నిలదీస్తుంది మల్లి.

అయితే ఇదివరకు కూడా గౌతమ్ మల్లిని కారు తో గుద్ది క్షమాపణ అడగకుండా వెళ్ళిపోతాడు, ఇప్పుడు మల్లి మనకు కనిపించడానికి అర్ధం తాను కథలో ముఖ్య పాత్రా పోషించబోతున్నాడు అని అర్ధం. తరువాత సీన్ లో జగదాంబ మీరా పట్నం వస్తారు, అక్కడ జగదాంబను కారు తగలడం తో కింద పది గాయపడుతుంది. ఇంతలో అటుగా వెళ్తున్న అరవింద్ మీరాను చూసి జగదాంబను హాస్పిటల్ లో చేరుస్తాడు, జగదంబ అరవింద్ మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. ఇక మొత్తం కథ చూడాలి అంటే ఈ రోజు మల్లి నిండి జాబిలి పూర్తి ఎపిసోడ్ చూడవలసిందే. తిరిగి రేపటి మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ రిటన్ అప్డేట్ తో మల్లి కలుద్దాం అంత వరకు సెలవు.
పాఠకులకు విజ్ఞప్తి: తెలుగు సీరియల్స్ మీద మేము రాస్తున్న కథనాలను ఎంతగానో ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు. ఈ కథనాలని మేము మీకోసం ఎలా రాయాలో ఎలాంటి సీరియల్స్ కావాలో మీ ఫీడ్ బ్యాక్ ను మాకు info@newsorbit తలియచేయండి. మల్లి నిండు జాబిలి జూన్ 5 ఎపిసోడ్ చదివినందుకు మరొకసారి ధన్యవాదాలు.