Malli Nindu Jabili జూన్ 7 ఎపిసోడ్: మామ్ నా కారు ఆగిపోయింది నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తావా అని మాలిని వసుంధరను అడగడంతో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి జూన్ 6 నేటి ఎపిసోడ్ 374. సరే మాలిని అని వసుంధర డ్రాప్ చేస్తాను అంటుంది. ఇంతలో నేను బయటకే వెళ్తున్నాను నేను డ్రాప్ చేస్తాను మాలిని అని శరత్ అడుగుతాడు కానీ నో థాంక్స్ వొద్దు అని మాలిని సమాధానం చెప్తుంది. నువ్వు ఎంత కాదు అనుకున్న మా అన్న నీ నాన్న తండ్రి వలన తప్పు జరిగిపోయిన తండ్రి ష్టానానికి ఉండే ఆ గౌరవం వేరు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను అని మాలినికి హిత బోధ చేసే ప్రయత్నం చేస్తుంది శరత్ చెల్లలు కాంచన. పద మాలిని అని శరత్ అడగడం తో సరే అని ఒప్పుకుని తన వెంట బయల్దేరుతుంది.

మల్లి ఆలోచనలు మొత్తం అరవింద్ వైపే
తరువాత సీన్ లో మల్లి తాను ఉండే లేడీస్ హాస్టల్ రూమ్ లో చదువుకునే ప్రయత్నం చేస్తుంది కానీ తన ఆలోచనలు]మొత్తం]అరవింద్ వైపే వెళ్తున్నాయి, అరవింద్ చదువు పూర్తి అయ్యే వరకు ఆసరాగా ఉంటుంది అని ఇప్పించిన ఇంటర్న్షిప్ ఉద్యోగం గురించి ఆలోచిస్తుంది. నేను కనిపించని నిమిషం నుండి నా గురుంచి మీరు ఎంత పరితపించి పోయుంటారో నేను అర్ధం చేసుకోగలను బాబు గారు అని మల్లి అరవింద్ గురించి అనుకుంటుంది. నా భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంటర్న్ షిప్ లెటర్ ని తీసుకువొస్తే చింపేసాను అని బాధపడుతుంది. నా వల్ల మీరు అందరూ ఇబ్బంది పడకూడదని నేను ఆలా చేయక తప్పలేదు. నన్ను క్షమించండి బాబుగారు అని అరవింద్ ని తలుచుకుని ఏడుస్తుంది.

Malli Nindu Jabili జూన్ 7 ఎపిసోడ్ : అయ్యగార్లు, అమ్మగార్లు అందరూ ఒక సారి బయటకు రండి
మరో పక్క జగదాంబ తో అరవింద్ ఇంట్లో సీన్ మొదలవుతుంది. అయ్యగార్లు, అమ్మగార్లు అందరూ ఒకసారి బయటకు రండి అని జగదాంబ ఇంట్లో ఉన్నవారు అందర్నీ పిలుస్తుంది. బయట కారులో మాలిని డ్రాప్ చేస్తాడు శరత్, తాను కూడా లోపలి వొస్తాను అని అడుగుతాడు. జగదాంబ అరుపులకు అందరూ బయటకి వొస్తరు, ఎందుకు పిలిచావ్ అని సుమిత్ర జగదాంబను అడుగుతుంది. మేము వియ్యపొల్లము కాదా అమ్మ గారు కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడండి అని జగదాంబ అంటుంది. మా మల్లి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎంత వరకు వొచ్చింది అని అందర్నీ అడుగుతుంది జగదాంబ. ఇలా మాటి మాటికీ బెదిరించకండి అని అనుపమ అంటుంది, నేను న్యాయంగానే అడిగాను నాది బెదిరింపు అంటారు ఏంది అని సమాధానం ఇస్తుంది జగదాంబ.

ఆ బాధ్యత నాది
ఎవరు పాటించుకున్న లేకపోయినా మల్లిని వెతకడం ఆ బాధ్యత నాది అని అరవింద్ అంటాడు. తొందరగానే మల్లిని వెతికి మీ ముందుకు తీసుకువొస్తాను అని అరవింద్ అంటాడు, మొగుడివి ఆ మాత్రం బాధ్యత తీసుకోవా మరి అని జగదాంబ అంటుంది. ఇంతలో అక్కడికి మాలిని వస్తుంది, అందరి మొఖాలు ఒకేసారి షాక్ లోకి వెళ్తాయి.
నన్ను మీరాను చూసి బెదిరిపోయినట్లు ఉన్నావ్
అనుపమ పక్కకు వెళ్లి నిలుచున్న మాలినిని చూసి జగదాంబ ఇలా అంటుంది, ‘నన్ను మీరాను చూసి]బెదిరిపోయినట్లు ఉన్నావ్, ఎలాగున్నావ్ పంతులమ్మ నీకేంటి దిట్టంగానే ఉన్నావ్’ అని వెటకారం చేస్తుంది. ’ కథ మొత్తం తెలుసుకున్నాను అందుకే వొచ్చాను అని జగదాంబ మాలిని వొంక చూస్తూ అంటుంది, మా ఇంటికి ఎందుకు వొచ్చారు అని మాలిని గట్టిగ అడుగుతుంది. నా కూతురు కోసం వొచ్చాము అని మీరా సమాధానం ఇస్తుంది. నా కూతురు మీ అందరి సంతోషం గురించి అలోచించి బయటకు వెళ్లి పోయింది, అందుకే నా కూతురు నాకు దొరికే వరకు ఇక్కడే ఉంటాం అని మాలిని తో చెప్తుంది మీరా. బయట ఉంది వెతుక్కోండి మా ఇంట్లో ఉండటం ఎందుకు అని మాలిని అడుగుతుంది, ఆ డిస్కషన్స్ అన్ని అయిపోయాయమ్మా వీళ్ళే అడగొలిగా మాట్లాడుతున్నారు అని రామకృష్ణ మాలిని తో అంటాడు.

Malli Nindu Jabili జూన్ 7 ఎపిసోడ్ : అడ్డగోలు పని చేసింది మీరు
అడ్డగోలు పని చేసింది మీరు అడ్డంగా మాట్లాడుతున్నాను అని నన్ను అనకండి అని జగదాంబ రామకృష్ణతో అంటుంది. తప్పుడు పేరు పెట్టుకుని తప్పుడు ఆలోచనలు పెట్టుకుని మా ఉరి వొచ్చింది మమ్మల్ని మోసం చేసింది నువ్వు అని మాలినిని అంటుంది జగదాంబ. మాలిని మోసం చేయలేదు మోసపోయింది అని రామకృష్ణ అంటాడు, అబద్ధాలు చెప్పడం మోసం కదా అని మాలిని చేసిన పనులని ప్రశ్నిస్తుంది జగదాంబ. మాలిని మీ ఊరు వొచ్చింది నిజం తెలుసోకోవడానికి మిమ్మల్ని మోసం చేయడానికి కాదు అని రామకృష్ణ అంటాడు.

అయినా నిన్ను కాదు మీ అమ్మ బాబులను అనాలి
నిన్ను అని లాభం లేదు నిన్ను కన్నా అమ్మ బాబులని అనాలి అని జగదాంబ అంటుంది ఇంతలో అక్కడికి శరత్ వస్తాడు. మీరా జగదాంబను అక్కడ చూసి శరత్ తిరిగి వెళ్ళిపోదాం అని వెళ్తుంటే, ఓయ్ పట్నం అల్లుడా ఆగు అని జగదాంబ అంటుంది. నాకు వేరే పని ఉంది నేను మల్లి కలుస్తాను అని శరత్ అంటాడు, నీ వేషాలు అంత మొత్తం తెలిసిపోయిన తరువాత మొఖం చాటేసుకుంటావా అని అడుగుంతుంది జగదాంబ.

మీరా నీ మొగుడొచ్చాడు
నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆగిన శరత్ ని కింద పైన చూసి మీరా నీ మొగుడొచ్చాడు అని అంటుంది జగదాంబ, టిప్పు టాపు గ బలే ఉన్నాడు అని వెటకారం చేస్తుంది. మనిషి బాగుంటే ఎమ్ లాభం లే మనసు బాగుండాలి కదా అని శరత్ ని తిడుతుంది జగదాంబ. మీరు చాలా మితి మీరి ప్రవర్తిస్తున్నారు మీ మౌనంగా ఉంటున్నాం అంటే మాకు సమాధానం చెప్పరాదు అని కాదు అని అంటుంది జగదాంబ.

దీనికొక పరిష్కారం తెచ్చుకోవాలి లేదంటే వేళ్ళ ముందు మనం తల దించుకోవాల్సి వస్తుంది అని సుమిత్ర భర్త అంటాడు. సమస్యకు పరిష్కారం కావలి అంటే మల్లిని త్వరగా వెతికి పొట్టుకోవడం అని రూప అందరితో అంటుంది.
మీకు ఏ కూతురి మీద ఎంత ప్రేముందు అది మీ ఇష్టం కానీ ఇద్దరు మీ కూతుర్లే మల్లిని వెతికి పట్టుకోమని శరత్ ను అడుగుతుంది మీరా, జగదంబ కూడా శరత్ మల్లి గురించి నిలదీస్తుంది. ఎపిసోడ్ చివర్లో మల్లి కాలేజీ లో గౌతమ్ ప్రత్యేక్షమయి మల్లిని ఇబ్బంది పెడతాడు. ఇంకా కథలో ఎం జరిగిందో తెలియాలి అంటే మల్లి నిండు జాబిలి సీరియల్ఈ రోజు ఎపిఓస్డ్ చూడాల్సిందే. తిరిగి రేపటి మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.