Malli Nindu Jabili మే 25 ఎపిసోడ్: నా కూతురా? ఈ మాట నీ నోటి వెంట వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అని తన కూతురి కోసం ఆరాట పడుతున్న శరత్ తో సత్య అంటాడు. సత్య శరత్ మధ్య జరిగే ఈ సన్నివేశం తో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి ఈ రోజు మే 25 ఎపిసోడ్ 365. నా కూతురు అనే పదాన్ని పలికే అర్హత కూడా నువ్వు ఎప్పుడో కోల్పోయావు, జన్మకు కారణం అయిన వాడిని తండ్రి అని అంటారు ఆలా అని ప్రతి ఒక్కరు ఆ స్థానానికి సరిపోరు అని సత్య అంటాడు.

Malli Nindu Jabili మే 25 ఎపిసోడ్: లోకంలో ఉన్న తండ్రులులో నువ్వు దారుణమైన వాడివి
తిరిగి మీరా తో కలవడానికి శరత్ చేసే ప్రయత్నం మనం క్రిందటి ఎపిసోడ్ లో చూసాం. శరత్ సత్య మధ్యలో ఆ సంభాషణ నేటి ఎపిసోడ్ లో కొనసాగుతుంది. లోకం లో చెడ్డ తండ్రులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నువ్వైతే వారందిరిలో దారుణమైన వాడివి అని సత్య శరత్ ని అంటాడు. బిడ్డ బాల్యాన్ని పోగొట్టావ్, బిడ్డకు సమాజంలో గుర్తింపు లేకుండా చేసావు అని సత్య అనే మాటలక సమాధానం లేక మౌనంగా ఉంటాడు శరత్. నీలాంటి వాడిని చూడాలంటె అసహ్యంగా ఉంది అని సత్య అనేస్తాడు.

మల్లి వొంట్లో ప్రవహించేది నా రక్తం
సత్య అన్న మాటలకు శరత్ ఇలా బదులు ఇస్తాడు. మల్లి వొంట్లో ప్రవహించేది నా రక్తమే అయినా మల్లి మాత్రం నీ కూతురే సత్య. మల్లిని నీ నుంచి దూరం చేద్దాం అని రాలేదు మల్లికి కొన్ని ఇచ్చి వెళదాం అని వొచ్చాను. సత్య నువ్వు నాకంటే గొప్పోడివి, తండ్రి స్థానానికే కాదు దేవుడు స్థానానికి కూడా అర్హుడివి, ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి బిడ్డను గాలికి వదిలేస్తే నువ్వు పట్టుకున్నావు బిడ్డను గుండెల్లో దాచుకున్నావు. నాకు మల్లిని కలిసే అదృష్టాన్ని కలిపించు అని సత్యను వేడుకుంటాడు శరత్. తన భవిష్యత్తు ఏమిటో అర్ధం కాక సతమతం అవుతుంది నీ తో మాట్లాడే ఇష్టం కూడ చూపించదు అని సత్య సమాధానం ఇస్తాడు.

మల్లి బయట ప్రపంచం చూడబోతుంది
మల్లి చదువు పూర్తి అయిన తరువాత బయట ప్రపంచం చూడబోతుంది, అప్పుడు మల్లికి చాలా అవసరాలు ఉంటాయి అవి ఇవ్వడానికే నేను ఇక్కడకు వొచ్చాను నన్ను మల్లితో కలిపించు అని శరత్ అడుగుతాడు. ఒక ఆడపిల్ల తండ్రి పడే బాధ కేవలం మరో ఆడపిల్ల తండ్రి మాత్రమే అర్ధం చేసుకోగలుగుతాడు అర్ధం చేసుకో సత్య అని అంటాడు. మల్లి భవిష్యత్తు కోసమే నేను ఇక్కడికి వొచ్చాను నన్ను వెళ్లనివ్వు సత్య అని శరత్ ప్రాధేయ పడతాడు. శరత్ మాటలు అర్ధం చేసుకున్న సత్య సరే అని మల్లిని కలవడానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత శరత్ చేతులు ఎత్తి సత్యకు దండం పెడతాడు.

Malli Nindu Jabili మే 25 ఎపిసోడ్: మల్లిని కలిసిన శరత్
బయట తలుపు చప్పుడు అవటం విన్న మల్లి ఎవరో చూస్తాను అని అటు వెళ్లగా అక్కడ శరత్ ని చూసి కోపం తో భావోద్వేగానికి లోనవుతుంది. మీకు చెప్పకుండా వొచ్చినందుకు ఏమి అనుకోకండి అని మొదట శరత్ మల్లి మీరాలను క్షమాపణ అడుగుతాడు. వసుంధర అన్న మాటలకు వేసిన నిందలకు వసుంధర తరుపున నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు. మీ క్షమాపణలు మాకు అవసరం లేదు బయలుదేరండి నేను ఏమీ వినను అని మల్లి కోపంగా శరత్ ని తిరిగి వెళ్లిపొమ్మని చెప్తుంది.

మల్లికి తన ఆస్తులు రాసిచ్చేసిన శరత్
ఆలా కోపంతో కన్న తండ్రిని బయటకు వెళ్ళమని మల్లి అనడం మీరా కు నచ్చదు…వెంటనే మల్లి అని పిలిచి కోపంగా చూస్తుంది. వెంటనే మల్లి నీరు మూసుకుని కిందకు చూస్తుంది. మీరా ఆలా చేసినందుకు థాంక్యూ అని చెప్తాడు శరత్. వేసుకున్న కోట్ లోంచి బాండ్ కాగితాలు బయటకి తీస్తాడు శరత్. పిల్లల భవిష్యత్తు కొరకు తల్లి తండ్రులు ఆస్తులు సంపాదిస్తారు…ఇవి నేను సంపాదించిన ఆస్తులు. వీలునామాకు సంబంధించిన కాగితాలు ఇవి వీటిలో మాలిని పేరుతో పాటు మరో పేరుకూడా ఉంది అని అంటాడు. ఇది విన్న మల్లి మీరా కు ఎలా స్పందించాలో అర్ధం కాదు ఇంతలో అక్కడికి సత్య వస్తాడు.

మల్లి ఇంటికి చేరుకున్న వసుంధర
శరత్ తన ఆస్తిలో వాటా మల్లికి ఇస్తాడు…దానికి సంబందించిన పత్రాలు మల్లికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా వసుంధర హుటాహుటిన అక్కడికి చేరుకుంటుంది. శరత్ కారును చూసిన వసుంధర ఈయన ఇక్కడకి ఎందుకు వొచ్చి ఉంటారు ఎవరిని కలవడానికి అని సందేహం తో ఆరా తీయడం మొదలు పెడుతుంది. మరోవైపు మల్లి శరత్ ఆస్థి వొద్దు అని తెరస్కరిస్తుంది. నీ భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత నాకు ఉందమ్మా అని శరత్ మల్లి తో అంటాడు. దానికి బదులుగా బాధ్యత ఒకేసారి పుట్టుకరాదు కదా అని నిలదీస్తుంది.

Malli Nindu Jabili మే 25 ఎపిసోడ్: నేను నిన్ను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు మల్లి
మల్లి అన్న మాటలకు శరత్ బాధపడతాడు. నేను నిన్ను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు తల్లి అని మల్లికి అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాడు. నిన్ను ఎప్పటికప్పుడు ఒక కవచం లా కాపాడుకుంటూ వొచ్చాను, మాలిని మీద నేను చూపించే ప్రేమ నీకు కనపడినట్లు నీ మీద నేను చూపించే ప్రేమ నీకు కనపడలేదు అంతే తేడా అని అంటాడు. దయ చేసి ఈ డాకుమెంట్స్ తీసుకో అమ్మ ఇవి నీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయి తీసుకో అని బ్రతిమిలాడుతాడు. ఇదంతా తలుపు దెగ్గర నిలుచుని ఉన్న వసుంధర చూసి ఆవేశం తో ఊగిపోతోంది.

శరత్ ఇచ్చిన ఆస్థి పత్రాలు చించేసిన మల్లి
సరే అని శరత్ ఇచ్చిన పత్రాలు తీసుకుని అందరి ఎదుట చించేస్తుంది మల్లి. ఇది చూసిన వసుంధర కూడా ఆశ్చర్య పోతుంది. కానీ సత్య మాత్రం ఆనందపడతాడు. ఇలాంటి ఆస్తులతో మీరు కూతురి ప్రేమను కొనలేరు అని మల్లి అన్న మాటలకు బదులుగా నేను కొనాలి అని రాలేదమ్మా నీకు గుర్తింపు ఇవ్వడానికి వొచ్చాను అని చెప్తాడు. ఎం గుర్తింపు ఇద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది మల్లి. నా ఇంటి పేరు ఇస్తాను, సమాజానికి నూవు నా కూతురు అని తెలిసేలా చేస్తాను అని అంటాడు శరత్. ఇలా కొంచెం సేపు భావోద్వేగాలతో కూడిన చెర్చ జరుగుతుంది.

మీడియా ముందుకు మల్లి
మల్లి మాటలకు వసుంధర కూడా ఒక్క నిమిషం జాలి పడినట్లు మనకు కనిపిస్తుంది. నాకు తండ్రి ఉన్నాడుపేరు సత్య అని మరొకసారి చెప్తుంది మల్లి. ఈ తండ్రి నీకోసం ఆ రోజు నేలకొండపల్లి వొచ్చాడు సత్య చేతిలో మరణపు అంచుల వరకు వెళ్ళాను, నిన్ను వదిలించుకోవాలి అనుకునేవాడికి అంత దూరం రావాల్సిన అవసరం ఎందుకు ఉందమ్మా అని శరత్ గతం లో జరిగింది మల్లికి వివరిస్తాడు. ఆ రోజు మీరా శరత్ ను ఆపేస్తుంది, తాను తండ్రి అనే విషయం మల్లికి తెలియకుండా ఆపేసింది అని మల్లి తెలుసుకుంటుంది. సత్య కూడా మల్లిని శరత్ ను క్షమించమని అని అడుగుతాడు. శరత్ లో నిజాయితీ కనపడుతుంది అని సత్య సపోర్ట్ చేస్తాడు. చివరికి మల్లి శరత్ కలిసిపోతారు. మల్లిని శరత్ కాలేజీ దెగ్గర దింపడానికి వెళ్తాడు అక్కడ మల్లి కోసం ఎదురు చూస్తున్న మీడియా మల్లిని ప్రశ్నలతో ముంచేస్తారు. అసలు మీడియా అక్కడికి ఎందుకు వచ్చింది, వసుంధర ప్లాన్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మల్లి నిండు జాబిలి రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడక తప్పదు. తిరిగి రేపటి ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు…