Nindu Noorella Saavasam november 13 2023 episode 79: అక్క మూత తీయగానే బ్యాట్స్మెల్ వస్తుంది ఏంటి అని ఆకాష్ డుగుతాడు. అన్నంకుళ్ళిపోయింది ఆకాష్ అందుకే తాతయ్య అన్నం తినకుండా వెళ్ళిపోతున్నాడు అని అమృత అంటుంది. పర్వాలేదమ్మా నాకు ఇప్పుడు ఆకలేం వెయ్యట్లేదు నేను ఇంటికి వెళ్ళాక తింటానులే అని వాచ్మెన్ అంటాడు. ఆకలి వేయకపోయినా మీరు పెద్దవారు కదా తాతయ్య టైం కు తిని టాబ్లెట్ వేసుకోవాలి కదా రండి తాతయ్య మీరు మా అన్నం తిందురు కానీ అని అమృత అంటుంది. నాకు పెట్టి మీరేం తింటారమ్మా అని వాచ్మెన్ అంటాడు. కట్ చేస్తే, అంజు నువ్వు ఇలా అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటే మీ అమ్మ బాధపడుతుంది కదా నేను నీలాగే మా అమ్మ లేదని అన్నం తినకుండా మానేసే దాన్ని కానీ మా నాన్న అప్పుడు ఏం చెప్పాడు తెలుసా నువ్వు అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చుంటే మీ అమ్మ బాధపడుతుంది

నువ్వు అన్నం తిని బాగా చదువుకుని ధైర్యంగా ఉంటే మీ అమ్మ సంతోషిస్తుంది అని చెప్పాడు అప్పటినుంచి నేను అన్నం తిని బాగా చదువుకోవడం మొదలు పెట్టాను, నువ్వు కూడా మీ అమ్మ కోసం ఏడవడం మానేసి అన్నం తిని బాగా చదువుకో నిన్ను చూసి నీ అమ్మ ఆనందిస్తుంది నాకోసమో నీ కోసమో నువ్వు చదువ వద్దు నువ్వు ఈ ఎగ్జామ్ రాసి బాగా మార్కులు తెచ్చుకుంటే మీ నాన్న కళ్ళల్లో సంతోషం కోసం నువ్వు చదువుకొని ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి అని భాగమతి అంజలికి అన్నం తిన పెడుతుంది. కట్ చేస్తే, తాతయ్య నీ చేతికి గాయమైనట్టు ఉంది అది ఎలా అయింది అని అమృత అడుగుతుంది. గేటు తీసేటప్పుడు దానికి ఒక రేకు ఉందమ్మా అది తాగిలితే గాయమైంది అని వాచ్మెన్ అంటాడు. తాతయ్య చేయికి గాయమైంది కాబట్టి అన్నం మీరు ఎలా తింటారు నేను తినిపిస్తాను అని అమృత వాచ్మెన్ కి అన్నం తినిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద గుణం నేర్పించిన మీ అమ్మని ఒక్కసారి చూడాలని ఉందమ్మా మీ అమ్మని స్కూల్ కి ఒకసారి తీసుకువస్తారా అని వాచ్మెన్ అంటాడు.

మా అమ్మ లేదు తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్లి పోయింది అని ఆకాష్ అంటాడు. సారీ అమ్మా బాధపడకండి మంచి వాళ్ళను ఎప్పుడు భగవంతుడు తీసుకువెళ్లి పోతాడు అని వాళ్ళని ఓదారుస్తాడు వాచ్మెన్. కట్ చేస్తే నీలా ఆలోచిస్తూ నడుస్తూ కింద పడబోతుంటే గుప్తా గారు పట్టుకుంటారు. గుప్తా గారు ఏంటండీ ఈ పని మనోహరీ ఇలా ఎందుకు చేస్తుందని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే మీరు ఈ రొమాన్స్ ఏంటి చూడలేక చస్తున్నాను అని అరుంధతి అంటుంది. ఏంటమ్మా నీ బాధ నీకేనా నాకు లేదా నా ఉంగరం పోయి నేను తిప్పలు పడుతున్నాను నా ఉంగరం దొరికిన వెంటనే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోయెదను నాకు ఈ తిప్పలు ఉండదు నీకు ఆ బాధ ఉండదు అని గుప్తా అంటాడు. ఏంటండీ ఎవరితో మాట్లాడుతున్నారు అని నీలా బిత్తరపోయి అడుగుతుంది. ఉందిలే నా ప్రాణానికి ఒక ఆత్మ నన్ను చంపుకు తింటుంది రోజు వేగలేక చస్తున్నాను అని గుప్తా అంటాడు. మీలో మీరు మాట్లాడుకోవడం కూడా నాకు చాలా నచ్చింది అని నీలా సిగ్గుపడుతూ అంటుంది.

అవునా అంటూ గుప్తా సంతోషంతో అడుగుతూ ఇందాక ఏదో పెళ్లి గురించి అన్నావు ఎవరిది అని గుప్తా అంటాడు. చెప్తేనేమో అమ్మగారు తిడతారు చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బుతుంది ఏం చేయాలా అని ఆలోచించి నీలా గుప్తాతో ఇలా అంటుంది, ఏమీ లేదండి ఇందాక మనోహరి మేడమ్ కాలికి మెట్టెలు పెట్టుకున్న గుర్తులు చూశాను అది చూసి నేను మీకు పెళ్లి అయిందా అమ్మగారు అని అడిగితే కంగారు పడిపోయి నన్ను కొట్టి బయటికి నెట్టేసింది ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదండి ఆవిడకి ఇంతకుముందే పెళ్లయినట్టుందిఈ విషయం ఎవరికీ చెప్పకండి అని నీలా అంటుంది. ఎవరికీ తెలియకూడదొ వారే వినేశారు ఇంకా ఏమున్నది అని గుప్తా అంటాడు.ఎవరు విన్నారండి అని నీలా అడుగుతుంది. ఏమీ లేదులే బాలిక నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని గుప్తా అంటాడు. అంటే ఐదేళ్లలో మనోహరి కి పెళ్లయింది అన్నమాట తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉంటుంది అని అరుంధతి ఆలోచనలో పడుతుంది.

కట్ చేస్తే అమర్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామంటే వద్దంటావు ఏంట్రా అని శివరామ్ అంటాడు. తనే లేనప్పుడు ఈ బర్త్డే సెలబ్రేట్ ఎందుకు నాన్న అని అమరేంద్ర అంటాడు.చూడమ్మా మనోహరి వాడికి నువ్వైనా చెప్పు నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా అని శివరామ్ మనోహర్ని అడుగుతాడు.చిన్నప్పటినుంచి దానికి బర్త్డే చేసుకోవాలంటే చాలా ఇష్టం కానీ తన పేరెంట్స్ లేరని బాధపడేది ఇప్పుడు ఇంత మంచి కుటుంబం దొరికాక సెలబ్రేట్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సెలబ్రేట్ చేస్తే తన ఆత్మ సంతోషిస్తుంది

అని మనోహరి అంటుంది. సరే మీ ఇష్టం అలాగే చేద్దాం అని అమరేంద్ర అంటాడు. ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు వస్తారు. తాతయ్య నాయనమ్మ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఫస్ట్ డే స్కూలు ఎలా ఉందమ్మా అని అమరేంద్ర అడుగుతాడు.స్కూల్ బాగుంది స్కూల్లో టీచర్స్ ఎలా ఉన్నారు స్టూడెంట్స్ కూడా బాగున్నారు డాడీ మాకు చాలా బాగా నచ్చింది అని ఆకాష్ అంటాడు. చాలా థాంక్స్ మిస్సమ్మ మాకు మంచి స్కూల్ సెలెక్ట్ చేసినందుకు అలాగే మంచి తాతను ఇచ్చినందుకు కూడా అని అమృత అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది