Nuvvu Nenu Prema: పద్మావతిని వాళ్ళమ్మ వాళ్ళ అక్క నువ్వు పెళ్లి గురించి మాట్లాడడానికి విక్రమాదిత్య వల్ల కుటుంబంతో మాట్లాడడానికి వెళ్దామని అడుగుతుంది. కానీ పద్మావతి మనసులో మాత్రం చాలా కంగారుపడుతూ ఉంటుంది. టెంపరోడికి తనతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను. ఇప్పుడు మళ్లీ ఆ ఇంటికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయో మీకేం తెలుసమ్మా అని పద్మావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్లందరి కోసం ఆ ఇంటికి వెళ్ళక తప్పదు పద్మావతికి..

విక్కీ ఎందుకు అదోలా ఉన్నావ్ అని వాళ్ళ అక్క వచ్చి అడుగుతుంది ఏం లేదు అని విక్కీ అంటాడు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని వాళ్ళ అక్క అంటుంది. మరోవైపు పద్మావతి వాళ్ళ ఇంట్లో మురళిని కూడా వాళ్లతో పాటు ఆ ఇంటికి రమ్మని అందరూ అడుగుతారు. ఇక పద్మావతి తప్పక ఆ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తుంది.
పద్మావతి వాళ్లు వెళ్ళగానే ఆర్య వాళ్ళ అమ్మ పద్మావతి వాళ్ళ అమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంది. తేరగా ఈ ఇంటి సంబంధం వచ్చిందని ఇక పనిలో పనిగా ఈ పెళ్లితో పాటే పద్మావతి పెళ్లి కూడా చేసేద్దామని వాళ్ళ అత్తయ్య అంటుంది. అందుకు ఆర్య వాళ్ళ అమ్మ మళ్లీ కల్పించుకొని పద్మావతి వాళ్ళ అమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోగానే కళ్ళతోనే విక్కి పద్మావతి మాట్లాడుకుంటారు. ఒకరి బాధను ఒకరు చూపులతోనే మాట్లాడుకుంటారు.

మరోవైపు విక్కి నికిత ఎంగేజ్మెంట్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. అమ్మ అను ఇక్కడ మామిడాకులు లేవంట నువ్వు వెళ్లి తీసుకురా అని వాళ్ళ మావయ్య చెబుతాడు. మామిడాకుల కోసం వెళ్తుంది కానీ చెట్టుకి ఎక్కడో అందుకుండా ఉండడంతో తను ఎగిరి పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆర్య వచ్చి తనని పైకెత్తి కోపిస్తాడు. ఇద్దరి మధ్య ఓ లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో విక్కీ నిశ్చితార్థం జరుగుతూ ఉండగా పద్మావతి అక్కడ నుంచి జరిగే పక్కకు వెళ్ళిపోతుంది. పద్మావతి చేతిని మురళి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు వదులుతారా. వదలరా అని పద్మావతి అరుస్తుంది. అంతలో విక్కీ వాళ్ళ అక్క అరవింద అక్కడికి వచ్చి పద్మావతి ని మురళిని చూస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.