Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 319 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

నిన్నటి ఎపిసోడ్ లోపద్మావతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆర్య అనులాదోష పూజ చేయించుకోవడానికి గుడికి వెళ్తారు.అక్కడ కుచల ఆఇష్టంగానే దోష పూజ చేస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో

పద్మావతిని విక్కీకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు అక్క చెల్లెలు ఒకే చోట పెద్దావిడ చెప్తూ ఉంటుంది. వెంటనే కుచల ఇప్పుడు ఒకదాన్ని తగిలించుకున్నాము, మళ్లీ ఇంకో దాన్ని తగిలించుకునే అంత, అవసరం మాకు లేదు, అయినా మా విక్కిని చేసుకోవడానికి, చాలామంది ఉన్నారు బయట, ఈ పద్మావతి మేం చేసుకోవాల్సిన అవసరం లేదు. అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కృష్ణ కూడా ఆ పెద్దావిడతో మీరు పెళ్లి చూడ్డానికి వచ్చారండి, ఇవన్నీ ఎందుకు మీకు అని అంటాడు. జరగని వాటి గురించి ఇలాంటివి చెప్పమాకండి. ఇంతలో అరవింద వెంటనే వాళ్ళ అన్న దాంట్లో తప్పేముంది. అను ఆర్యాలు పెళ్లి చేసుకుంటారని మనం అనుకున్నాము. ఏమో రేపు పద్మావతి విక్కీ పెళ్లి కూడా జరుగుతుంది ఏమో, అని అంటుంది. వెంటనే కుచల అరవింద ఇంక చాలు, ఇప్పటికే నేను చాలా విషయాలు కాంప్రమైజ్ అయ్యాను, విక్కీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఇక పూజ చేద్దామా అని అంటుంది. నీతో చెప్పాలనిపించి చెప్పానమ్మా తప్పయితే క్షమించండి అంటుంది. దేవత పూజ అయిపోయింది ఇంక పెళ్లి పనులు మొదలు పెట్టుకోండి అని పంతులుగారు చెప్తారు. కృష్ణ మనసులో చెప్పాను కదా పద్మావతి నువ్వు ఎప్పుడూ నా దానివే నేను అని అనుకుంటాడు.

ఆడపడుచుకు మర్యాద
అందరూ ఇంటికి వెళ్తారు. అరవింద కు బట్టలు పెట్టి పంపించాలని, ఆ మర్యాదలు చేస్తూ ఉంటారు పద్మావతి వల్ల అమ్మవాళ్ళు, కుచల మాత్రం చాలా అ ఇష్టంగానే అక్కడ కూర్చొని ఉంటుంది.సిద్దు ఇది ఏమైనా గ్రహచారమా ఏంటి ఇదంతా అని అడుగుతాడు. ఇదంతా ఆచారం సిద్దు గారు అని పద్మావతి చెప్తుంది. కుచల మాత్రం వీళ్ళకి ఏమీ లేదు మాకు చీరలు పెడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ ఏసీ లేదు నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది. సిద్దు ఇక్కడ చల్లగా ఉంది కదా ఆంటీ అని అంటాడు. నాకు వేడిగా ఉంది ఇంటికి వెళ్ళాలి తొందరగా కానివ్వండి అని అరుస్తుంది. అందరూ మళ్ళీ అరవింద్ అను పొగిడే పని పెట్టుకుంటారు. ఇక త్వరగా పెళ్లి పనులు మొదలుపెట్టి పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చేసేయండి. అని అరవింద అంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆప్యాయత ఎప్పుడూ మాతో ఇలానే ఉండాలి. పద్మావతి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో అంటుంది. వెంటనే కుచల నువ్వెంత ప్రేమ చూపించాలిన అవసరం లేదు. రోజు కాస్ట్లీ చీరలు కట్టి మేము ఇలాంటి చీరలు ఎప్పుడు కట్టాం, డిస్కౌంట్ శారీస్ పెట్టారు మాకు. అక్కర్లేదన్నట్టుగా పక్కన పడేసేసి, ఇది మమ్మల్నిఇన్సల్ట్ చేసినట్టే, ఇలాంటి చేయడం మా ఇంట్లో పని వాళ్లు కూడా కట్టరు. అని కుర్చీలోపడేసి కోపంగా వాళ్ళని అరుస్తూ ఉంటుంది. లేకపోతే లేదని, సైలెంట్ గా ఉండాలి కానీ ఇలా చీప్ బట్టలు పెట్టడం ఏంటి అరవింద. చీర అక్కర్లేదని పక్కన పెడుతుంది.

కుచల కి సర్ది చెప్పిన పద్మావతి
స్తొమతని బట్టి కాదు, మా అభిమానాన్ని చూడండి. ఇది మీకోసమే ప్రత్యేకంగా నేయించిన చీర, మేము దగ్గరుండి చేయించాం కాబట్టి తక్కువ ధరకే డిస్కౌంట్ లో ఇచ్చారు. ఇదే షాపులోకి కొనుక్కుంటే మీకు చాలా దర పడుతుంది.మా అక్క ని మీరు ప్రేమగా చూసుకుంటున్నారు.దానికి , నేను ఇప్పుడు వెలకట్టలేను. పద్మావతి అనగానే కుజుల కోపంగా వెంకటగిరి,వెంకటగిరి నేయించారంట అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా పిన్నిని కన్వెజ్ చేశారంటే నువ్వు చాలా గ్రేట్ పద్మావతి అని అరవింద అంటుంది.

పద్మావతి, విక్కీ ల సరదాలు
పద్మావతి, విక్కీ నడుచుకుంటూ పొలాల్లో తిరుగుతూ ఉంటారు. సరే కాస్త జాగ్రత్తగా చూసుకోని నడవండి. ఈ పొలాల గట్లమీద నడవడం మీకు కొత్త కదా, నా సంగతి తర్వాత ముందు నువ్వు జాగ్రత్తగా నడువు అని అంటాడు విక్కీ. చూడండి నేను పుట్టినప్పటినుంచి ఇక్కడే తిరుగుతున్నాను. నాకు కొత్త ఏం కాదు ఎలా నడవాలి నాకు తెలుసు. ఏదో పొలం చూస్తానంటే తీసుకొచ్చాను. ఇక ఇద్దరు నడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు. సరే కొంచెం తొందరగా నడవండి ఏంటి చిన్నపిల్లలు వచ్చినట్టు నడుస్తున్నారు అని అంటుంది పద్మావతి. నడుస్తూ నడుస్తూ పద్మావతి కింద పడుతుంది. విక్కి వెంటనే నవ్వుతూ సారీ పద్మావతి అలా నడవాలంటే తెలియక నేను నార్మల్గా నడిచాను. ఏంటి సారు సెటైర్ వేస్తున్నారా అని అంటుంది. అయ్యో పద్మావతి మీద సెటిర్ వేస్ వాడిని కాదు నేను, నేను మీకు చూపించే తొందరలో పడ్డాను లేదంటే అని లేకపోతే ఉండగా కాలు బెణికింది అని అర్థమవుతుంది. పద్మావతిని ఎత్తుకొని, తీసుకొస్తూ ఉంటాడు. ఒక పంప్ సెట్ దగ్గర పద్మావతిని కూర్చోబెట్టి, ఎక్కడ దెబ్బ తగిలిందో చూడ్ని అని కాళ్ళు పట్టుకుబోతాడు. పద్మావతి వద్దు సార్ అంటుంది. పద్మావతి కాలు పట్టుకుని విక్కీ సరిచేస్తాడు. విక్కీపద్దు మీద నీళ్లు పోస్తాడు. పద్మావతి నీళ్లు పోస్తూ ఉండగా కిందపదబోతుంది విక్కి పట్టుకుంటాడు.
ఇంటికి వచ్చినప్పటినుండి పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం నాతోనే వుంటూ నన్ను అందిపచేస్తావ్, మరి నా ప్రేమ ని ఎందుకు ఒప్పుకోవు పద్మావతి. ఉంటాడు విక్కీ….

రేపటి ఎపిసోడ్ లో
కృష్ణ పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చి, నా మంచితనం నీకు పిచ్చితనంలా అనిపిస్తుందా, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి అని అంటాడు. పద్మావతి మర్యాదగా బయటకి వేళ్ళు అంటుంది. లేదు పద్మావతి మన పెళ్లి ఈరోజు ఇక్కడే జరిగిపోవాలి,అని తాళి బొట్టు తాడు బయటకు తీస్తాడు… చూడాలి రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ని ఎవరు కాపాడతారో….