Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 346 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 347 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో,విక్కీ పద్మావతి ఇద్దరూ భోజనాలు దగ్గర వడ్డిస్తూ ఉంటారు. విక్కిని చూసివెయిటర్ అనుకొని,పద్మావతి పిన్ని మాట్లాడుతుంది. అరవింద బ్రేకులు లేని కారులో గుడికి వెళుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి, విక్కి,పెద్ద కంపెనీకి, అధిపతి అని, మా అక్క చేసుకునే, పెళ్ళికొడుక్కి అన్నయ్యని, వెయిటర్ కాదు అని చెప్తుంది. పద్మావతి పిన్ని అయ్యో, నాకు తెలియక అలా మాట్లాడాను ఏమీ అనుకోకు బాబు అని అంటుంది. మీరు చాలా మంచి వారు బాబు అంత డబ్బు ఉండి కూడా ఇలా సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు. మీ మనసులో ఉన్న అమ్మాయి మీకు భార్యగా వస్తుంది బాబు అని అంటుంది. విక్కీ పద్మావతి వైపు చూసి, నువ్వు నా భార్యగా వస్తే నేను సంతోషంగా ఉంటాను పద్మావతి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: కారులో బ్రేకులు తీసేసిన కృష్ణ.. అరవిందను కాపాడేది ఎవరు?
అరవింద ప్రమాదం గురించి తెలుసుకోవడానికి కృష్ణ ఆత్రుత..
కృష్ణ అరవింద కు ఫోన్ చేస్తాడు.ఎక్కడిదాకా వెళ్ళావా అని అడుగుతాడు. ఇప్పుడే కదండీ స్టార్ట్ అయింది అప్పుడే గుడికి ఎలా వెళ్తాను అని అంటుంది అరవింద. నువ్వు లేకుండా నేను ఉండలేను రానమ్మ అని అంటాడు. నేను తిరిగి రాని లోకాలకి ఏం వెళ్లట్లేదు అండి గుడికి వెళుతున్నాను. మీరు నేను మన పాప ముగ్గురం సంతోషంగా ఉంటాము అని అంటుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వలేదు రానమ్మ అని మనసులో అనుకుంటాడు, కృష్ణ. ఇంకొంచెం సేపట్లో, కారుకి యాక్సిడెంట్ అవుతుంది బ్రేక్ లేకుండా, దేనికో దానికి డాష్ ఇస్తాడు నీ ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ వస్తుంది దాని కోసం ఎదురుచూస్తున్నాను అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari : ముకుంద మురారి మీద జలసీతో కృష్ణకి నిజం చెప్పేసిందా..
పద్మావతి కుటుంబానికి విక్కీ సహాయం..
పార్వతి ఆండాలు అందరూ కూర్చొని, నగలు తీసుకువచ్చిన, వ్యాపారితో మాట్లాడుతూ ఉంటాడు. మేము మొదట ఇస్తాం అన్న అంతే ఇస్తాం బాబు నీకు అప్పుడే చెప్పాను కదా అని అంటుంది అండల్. అప్పుడు రేట్ కి ఇప్పుడు రేటుకి చాలా తేడా ఉందమ్మా, ఇప్పటికిప్పుడు నాలుగు లక్షలు ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను పిల్ల పెళ్లి ఉంది కదా అంటాడు భక్త. నేను మొదటే చెప్పాను కదా, మీరు తీసుకునే టయానికి బంగారం ఎంత రేటు ఉంటే అంత ఇవ్వాలి అని. ఇప్పుడు అంత ఎక్కడ నుంచి పెడతాము అని ఇంట్లో వాళ్లంతా కంగారు పడుతూ ఉంటారు. అదే టైం కి అక్కడికి విక్కీ పద్మావతి వస్తారు. ఏమైంది నాన్న అని అడుగుతుంది పద్మావతి. విక్కీని చూసి బాబు నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అంటుంది పార్వతి. విషయం ఏంటో చెప్పమ్మా అని అంటుంది పద్మావతి. అందరూ కలిసి వ్యాపారిని నువ్వు ఇప్పుడు వెళ్లి బాబు తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు. అదంతా విక్కీ చూసి ఎందుకండీ నన్ను పరాయి వాడిని అని అనుకుంటున్నారా, విషయం ఏంటో నా ముందే చెప్పండి అని అంటాడు. చొప్పు నాన్న అంటుంది పద్మావతి. ఏం లేదు బాబు మొదట, మేము కట్టిన దాని కన్నా ఇప్పుడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. ఈ నెక్లెస్ మా అమ్మాయి పెళ్లికి చేద్దామనుకున్నాను. ఇప్పుడేమో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అని అంటాడు భక్త. ఎంత ఇవ్వాలండి అని అడుగుతాడు, విక్కీ. నాలుగు లక్షలు బాబు అని అంటాడు వ్యాపారి. విక్కీ చెక్కు తీసి నాలుగు లక్షలు రాసి అతనికి ఇస్తాడు. ఎందుకు బాబు ఇప్పుడు ఇలాగా అని అంటుంది పార్వతి. పర్వాలేదండి అనువుకి నేను ఇచ్చే గిఫ్ట్ అనుకోండి అని అంటాడు విక్కీ. ఇది నేను మా పరపతిని ఉపయోగించుకోవడానికి ఇవ్వట్లేదు, మా ఇంటికి రాబోతున్న కోడలికి మేము ఇచ్చే గిఫ్ట్ అని అంటాడు విక్కీ. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్లెస్ తీసుకుంటుంది పార్వతి. నాకు ఆకలిగా ఉందండి కాస్త టిఫిన్ పెట్టండి అని అడుగుతాడు విక్కీ. పద్మావతిని టిఫిన్, విక్కీ కి పెట్టమని ఇంట్లో వాళ్ళు పంపిస్తారు.

కృష్ణ నట విశ్వరూపం..
అరవింద చనిపోయినట్టుగా కృష్ణ ముందుగానే ఊహించుకొని, ఎలా మాట్లాడాలో, అందరిలోతనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అయ్యో అరవిందా, అప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి. మూడుముళ్ల మన బంధం ఏడడుగుల మన జీవితం, ఇక్కడితోనే ఆగిపోయిందా, కార్ యాక్సిడెంట్ లో నువ్వు చనిపోయావంటే నేను నమ్మలేకుండా రానమ్మ. నిన్ను ఎలా మర్చిపోవాలి నీ జ్ఞాపకాలతో, నేను ఎలా బతకాలి అని, తనలో తాను అనుకుంటూ, పద్మావతి గారు, అరవింద లేని లోటును మీరే తీర్చాలి. అరవింద గారి ప్లేస్ మీరువస్తేనే బాగుంటుంది.మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా,అని అడిగినట్టుగా ఊహించుకొని, ఇలా జీవిస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. ఇలా మాట్లాడితేనే నా గురించి వేరేగా అనుకోకుండా ఉంటారు. పద్మావతి పెళ్లికి రెడీగా వుండు అని అనుకుంటాడు కృష్ణ.

అరవింద కారు కి ఆక్సిడెంట్..
అరవింద నాయనమ్మ శాంతాదేవి అరవింద్ ఇంకా ఇంటికి రాలేదు, గుడికి వెళ్లి చాలాసేపు అయింది కదా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ చేయాల్సిన పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అరవింద ఇంకా ఇంటికి రాలేదు ఏమిటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నారాయణ ఫోన్ మాట్లాడుతూ వస్తాడు. నారాయణ అరవింద్ కానీ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. లేదమ్మా నాకు ఏం చేయలేదు అని అంటాడు. ఒకసారి అరవింద్ కి కాల్ చేస్తాను. అని అరవింద్ కి కాల్ చేస్తాడు నారాయణ. ఇదిగో మా అరవింద ఫోను మాట్లాడు అని ఇస్తాడు. ఆ మారిందా వస్తున్నావా అని అడుగుతుంది శాంతాదేవి. వస్తున్నాను నానమ్మ దారిలో ఉన్నాను. అని మాట్లాడుతూ ఉండగా డ్రైవర్ కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది అని అరవింద్ అడుగుతుంది డ్రైవర్ని, బ్రేక్స్ పడట్లేదు మేడం అని అంటాడు. అయ్యో ఇప్పుడెలా బ్రేక్స్ పడట్లేదా జాగ్రత్త, చూసుకొని పోనివ్వండి అని అరవింద భయంగా కంగారుగా అంటూ ఉంటుంది. ఇదంతా శాంతాదేవికి ఫోన్లో వింటూ ఉంటుంది. అమ్మ అరవింద ఏమైంది అని అడుగుతుంది. నానమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేస్తుంది అరవింద. బ్రేక్స్ పడక కారు అటు ఇటు పోనిచ్చి డ్రైవరు ఒకసారిగా దేనికో గుద్దేస్తాడు. అరవింద చేతికి తలకి గాయం అయ్యి, బ్లడ్ వస్తూ ఉంటుంది. నారాయణ ఏమైందమ్మా ఫోన్ పెట్టేసావా ఏంటి కంగారు పడుతున్నావ్ అని అడుగుతాడు. అరవింద కార్ కి ఏదో అయినట్టు ఉన్నది నారాయణ, తను భయంగా నాయనమ్మ అనడం నేను విన్నాను. ఏమైందో ఏంటో అరవింద క్షేమంగా ఇంటికి రావాలి దేవుడా అని అనుకుంటుంది. ఇదంతా దూరం నుండి కృష్ణ వింటూ మీరు ఎంత ప్రార్ధన చేసిన, అరవింద ఈఅపాయం నుంచి తప్పించుకోలేదు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అడిగిందా అని అనుకుంటాడు.

పద్మావతి మనసులో మాట బయట పెట్టాలి అనుకున్న విక్కీ..
విక్కీ,కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది పద్మావతి.ఏంటి సారు టిఫిన్ వద్దన్నారు జ్యూస్ ఇక్కడికి తీసుకు రమ్మన్నారు ఏమిటి అని అడుగుతుంది. ఎవరు ఏం మాట్లాడితే సంతోషంగా ఉంటారో, ఎలా మాట్లాడితే సంతోషంగా ఉంటారు నీకు తెలుసు కదా పద్మావతి. ఇక్కడికి నేను ఎందుకు రమ్మన్నాను నీకు తెలియదా అని అడుగుతాడు. అంతే పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు. శ్రీనివాస, నా గుండె దడ మల్లా మొదలైంది అని అనుకుంటుంది పద్మావతి. ఈయన చూపించేటటువంటి ప్రేమ కి నా మనసులో కూడా ప్రేమ మొదలైంది అని అనుకుంటుంది పద్మావతి. నీ మనసులో ఉన్న ప్రేమని బయటకు తీయాలని పద్మావతి నా ప్రయత్నం అని అనుకుంటాడు విక్కీ. నా మనసులో మాట మీకు చెప్పాలని ఉన్నా, పరిస్థితులకు భయపడి చెప్పట్లేదు అని అనుకుంటుంది. నీ మనసులో ప్రేమను నేను ఎలాగైనా బయటికి తీస్తాను, అని అంటాడు విక్కీ.నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు పద్మావతి అని అంటాడు. నాకు ముందు మా నాయన అంటే ఇష్టం అని, తర్వాత మా అమ్మ అంటే ఇష్టంఅని అంటుంది.

అమ్మ, నాన్న కాదు పద్మావతి వాళ్లు కాకుండా ఇంకెవరిష్టం? వాళ్లు కాకుండా అంటే అని ఆలోచిస్తూ ఉండగా నా పేరు చెప్పు అని మనసులో అనుకుంటాడు. మా అక్క అంటే ఇష్టం అని అంటుంది పద్మావతి. నేనంటే నీకు ఇష్టం ఉన్ననువ్వు బయట పెట్టలేకపోతున్నావు పద్మావతి.పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు,వాటికి తలంచి నీ మనసులో మాటని దాచుకోవాల్సిన పనిలేదు, నీ మనసులో నేనున్నానని ఇప్పటికైనా బయటపెట్టు పద్మావతి అని అడుగుతాడు విక్కీ. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు సార్, ఇలా మీరు అడుగుతుంటే నాకు చెప్పాలని ఉంది అని మనసులో అనుకుంటుంది పద్మావతి.మీరు ఇంతలా,అడుగుతుంటే నేను ఇప్పటికి కూడా చెప్పకపోతే నీ ప్రేమనే నేను అవమానించిందని నమ్ముతానేమో,ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టదల్చుకోలేదు, నా మనసులో కూడా మీరు ఉన్నారని ఇప్పుడే ఇక్కడే చెప్పేస్తాను అని మనసులో అనుకుంటుంది.

రేపటి ఎపిసోడ్ లో, అందరి ముందు, కృష్ణ ఫోన్లో మా రాణమ్మకి యాక్సిడెంట్ అయిందా, లేదు మీరు చెప్తుంది అబద్ధం. రాణమ్మ అని పెద్దగా అరచి ఫోన్ కింద పడేస్తాడు. పద్మావతి విక్కి కంగారుగా అక్కడికి వస్తారు.. చూడాలి అసలు అరవింద ప్రాణాల తో ఉందో లేదో..