Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో మంచి రేటింగ్స్ తో నడిచే రెండు మూడు సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. ఇప్పుడు ఈ సీరియల్ 331 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 332 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Nuvvu Nenu Prema: అరవింద్ అను చంపడానికి కృష్ణవేసిన కొత్త పథకం ఫలించనుందా…
విక్రమాదిత్య కి పెళ్లి ప్రపోజల్ :
సంగీత్ ఫంక్షన్ ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఈలోపు పద్మావతి కానివ్వండి ఎలాగో గెలిచేది మేమే కదా అని అనగా, అందుకు కుచేలా నీ కళ్ళు నెత్తికి ఎక్కాయి, గెలిచేది మీరు కాదు మేము అని అంటుంది. అలా వాదనలు వేసుకుంటున్న సమయం లో నారాయణ స్నేహితుడు వస్తాడు. మా అమ్మాయి ఎలాగో ఫారిన్ నుండి ఇక్కడకి వచ్చేసింది, మీ అబ్బాయి విక్రమాదిత్య ని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు నారాయణ ని అతని స్నేహితుడు. నారాయణ తో పాటుగా అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు, కానీ విక్రమాదిత్య మాత్రం పద్మావతి వైపు చూస్తూ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, దయచేసి నన్ను బలవంతం చెయ్యకండి అని అంటాడు. అప్పుడు నారాయణ స్నేహితుడు మీలాంటి మంచి కుటుంబం థ్ వియ్యం అందుకునేందుకు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాం అని అంటాడు.

కుచేలా కి వార్నింగ్ ఇచ్చిన ఆండాళ్ళు:
అప్పుడు విక్రమాదిత్య పద్మావతి వైపు చూస్తూ ‘మనసులో నిన్ను పెట్టుకొని వేరొక్కరిని ఎలా పెళ్లి చేసుకుంటాను పద్మావతి’ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పద్మావతి ‘కొన్ని కొన్ని సార్లు మనసు చెప్పేది కాకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి సారూ. అప్పుడే అందరం సంతోషం గా ఉంటాము’ అని తన మనసులో అనుకుంటుంది. మరోపక్క సంగీత్ కి వచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారేంటి పెళ్లి కూతురు వాళ్ళు కట్నం అని కుచేలా ని అడగగా, నా కోడలు అతిలోక సుందరి కదా, అందుకే మేమే ఎదురు కట్నం ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాము, అని వెటకారంగా మాట్లాడుతూ అను ని అవమానిస్తుంది. ఇది గమనించిన ఆండాళ్ళు అను ని లోపాలకి వెళ్ళమని చెప్పి , కుచేలా తో ఏంటి నా కోడల్ని అవమానిస్తున్నావు అని అంటుంది. మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి ఈ పెళ్లి చేస్తున్నాం, లేకపోతే మీ అందరిని మా సెక్యూరిటీ తో బయటకి గెంటించేదానిని అని అంటుంది కుచేలా, అప్పుడు ఆండాళ్ళు ‘ఏంటి నన్నే గెంటిస్తావా..ఇది పిండి రుబ్బిన చేతులు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. నా దెబ్బ ఎలా ఉంటుందో చూస్తావు’ అని అంటుంది.

పద్మావతిని తన మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టమని అడిగిన విక్రమాదిత్య :
అప్పుడు కుచేలా నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా అని అనగా, ఇప్పుడు ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, నా కోడలి ఇల్లు కూడా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా ఇష్టమొచ్చినప్పుడు పోతా, నీకు ఎందుకు అని అంటుంది ఆండాళ్ళు. నాకోడలు బంగారం లాంటిది, దాని మనసు వెన్న, అలాంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టావని నాకు తెలిసిందో, అప్పుడు చెప్తా నీ పని అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆండాళ్ళు. పద్మావతి తన స్నేహితురాలితో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయం లో విక్రమాదిత్య పద్మావతి వద్దకి వచ్చి , కాసేపు ఏకాంతం గా మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటాడు.

ఆ తర్వాత విక్రమాదిత్య పద్మావతి తో మాట్లాడుతూ మన ప్రేమని బ్రతికించు అని అడగడానికి వచ్చాను, ఇకనైనా నీ మనసులో మాటని బయటపెట్టు, ఇప్పటికే నిన్ను చాలాసార్లు అడిగాను, కానీ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని చెప్తూనే వచ్చావు, కానీ నీ కళ్ళు చూస్తుంటే నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అర్థం అవుతుంది, నాకు సమయం లేదు , మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు , ఈ సంగీత్ అయ్యేలోపు నీ మనసులోని మాట బయటపెట్టు అని అడుగుతాడు విక్రమాదిత్య.

ఇక పక్క ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో కుచేలా నా నెక్లెస్ పొయ్యింది అంటూ గొడవ చేస్తుంది, పద్మావతి ని మీ బ్యాగ్ చూపించండి అని అంటుంది. ఆత్మాభిమానం తో బ్రతికే మమల్ని అవమానించాలని చూస్తున్నారా అని పద్మావతి అంటుంది. ఏ తప్పు చెయ్యనప్పుడు మీ బ్యాగ్ చూపించొచ్చు కదా అని కుచేలా అనగా , పద్మావతి తన బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తుంది, అందులో కుచేలా నెక్లెస్ ఉంటుంది, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.