16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Telugu TV Serials

వసు ఆశయం కోసం రిషి తీసుకున్న నిర్ణయం ఏంటి… మరి వసు తన ఆశయాన్ని చేరుకుంటుందా..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 541 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో రిషి, వసు తమ మనసులోని మాటలను ఒకరికి ఒకరు చెప్పుకోవడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే చెప్పాలి. ఇక ఈరోజు ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం…ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేంద్ర,గౌతమ్ లు రిషి ఎప్పుడు. నిద్ర లేస్తాడా అని ఏసురుచూస్తూ ఉంటారు. రిషి లేచి వాళ్ళను చూసిఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా నీకోసమే ఎదురు చూస్తున్నాము అంటారు.ఎందుకు అని రిషి అంటే నిన్న నువ్వు వసుని కలిసావు కదా ఏమైంది మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా అని అడగగా మాట్లాడుకున్నాము అని అంటాడు రిషి.

రిషిని ప్రశ్నించిన గౌతమ్, మహేంద్ర :

అప్పుడు వాళ్ళిద్దరూ సంబర పడిపోతారు.మరి నువ్వు వసు చెప్పింది సరే అన్నవా అని అనగా లేదు నేను చెప్పిందే వసుధార సరే అన్నది అంటాడు.. ఇక మహీంద్రా, గౌతమ్ సంబరపడిపోతారు… ఏమి చెప్పావ్ అంటే చదువుకోమని చెప్పాను అంటాడు పరీక్షలు అయ్యేవరకు మనసులో ఇంకేం పెట్టుకోవద్దు అని చెప్పాను అని అంటాడు. నువ్వు మాట్లాడిందా చదువు గురించా అని ఇద్దరు వెటకారంగా ముఖం పెడతారు.అప్పుడు రిషి మహేంద్ర తో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కానీ వాసుదారిని ప్రస్తుతానికి చదువుకోనిద్దాము వసుధారా మనకు దొరికిన అదృష్టం దాన్ని ఎలా వదులుకుంటాను అని అంటాడు.

వసును చూసి కూడా మాట్లాడని రిషి :

సీన్ కట్ చేస్తే పుష్ప, వసు ఇద్దరు నడుస్తూ చదువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.ఇంతలో వాళ్లు నడుస్తున్నప్పుడు రిషి కనిపిస్తాడు ఇద్దరికిద్దరూ మాట్లాడుకోరు ఇలా మాట్లాడుకోకపోవడం ఇంత బాధగా ఉంటుందా అని వసు అనుకుంటుంది. ఇప్పుడు వసుతో మాట్లాడితే చదువు డిస్ట్రబ్ అవుతదేమో అని రిషి అనుకుంటాడు. కనీసం ఆల్ ది బెస్ట్ అయినా చెప్పాలి కదా సార్ అని మనసులో అనుకుంటుంది వసు.రిషి కూడా మనసులోనే ఆల్ ది బెస్ట్ చెప్తాడు. మనసులో మాట బయటకు చెప్పకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది అని రిషి మనసులోనే అనుకుంటాడు.కనీసం లిఫ్ట్ ఇవ్వొచ్చు కదా అని వసు అనుకోగా అదే సమయంలో రిషి క్యాబ్ పంపిస్తున్నాను అని వసుకి మెసేజ్ పెడతాడు.ఇక వసు నవ్వుకుంటూ మీరు జెంటిల్మెన్ సార్ అని అనుకుని క్యాబ్ లో వెళ్ళిపోతుంది.

వసు కోసం జగతి తాపత్రయం :

ఆ తర్వాత సీన్లో రిషి, గౌతమ్, మహేంద్ర అందరు హల్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతట్లో జగతి పుస్తకాలు పట్టుకొని ఈ బుక్స్ వసుకు ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వస్తాను అని అంటుంది.అప్పుడు నువ్వు కూడా వెళ్లొచ్చు కదా రిషి అని మహేంద్ర అంటాడు.ఇంతట్లో రిషి కోపంగా చూసేసరికి గౌతము నువ్వు వెళ్ళు అని అంటాడు. అప్పుడు రిషి నేనే వెళ్తాను అని బయలుదేరుతాడు కానీ పరీక్షలు అయ్యేవరకు మనం కలవకూడదు అని రిషి సార్ అన్నా మాటలను గుర్తు తెచ్చుకుని నువ్వే వెళ్ళు గౌతమ్ అని అంటాడు.

ఒకరి ఊహల్లో మరొకరు :

మరో వైపు,వసు చదువుతూ రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతట్లో కార్ శబ్దం వినిపించేసరికి రిషి వచ్చాడు అనుకోని తలుపుతీస్తుంది. కానీ అక్కడ జగతి మేడం,గౌతమ్ లు ఉంటారు రిషి సార్ రాలేదా అని అడగగా మేము వచ్చాము కదా ఇప్పుడు ని ద్యాస అంతా చదువు మీదనే ఉండాలి అంటుంది జగతి.గౌతమ్ కూడా బాగా చదువుకో వసుదారా నీ మీదే అందరం అసలు పెట్టుకున్నాము అని అంటాడు.ఆ తర్వాత సీన్లో రుషికి వసు కాఫీ ఇస్తున్నట్టు రిషి ఊహించుకుంటాడు. నువ్వు కాఫీ తెచ్చావేంటి వసుధార అని అనగా గౌతం, ఏం మాట్లాడుతున్నావ్ రా నేను వసుధార ను కాదు.మనసు ఎక్కడ పెట్టుకున్నావో అని అనగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి.మరో పక్క వసు కూడా రిషిని పక్కనే ఉన్నట్టు ఊహించుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Guppedantha Manasu November 1 Episode: పెద్దమ్మపై ప్రేమ…. వసు, రిషిల బంధానికి అడ్డుగా నిలవనుందా..??

Ram

సౌర్య, హిమలు చేసిన పనికి ఇంట్లో నుంచి వృద్ధాశ్రమంకు వెళ్లిపోతున్న సౌందర్య, ఆనందరావులు..!

Ram

Intinti Gruhalakshmi: లాస్య తులసి చేత పెనాల్టీ కట్టిస్తుందా.!?నందు బిజినెస్ స్టార్ట్ చేస్తాడా.!?

bharani jella