బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1445 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ లో గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.గత ఎపిసోడ్లో మహేంద్ర, జగతీల పెళ్లి రోజు బాగా చెయ్యాలని రిషి అనుకుంటాడు.అలాగే దేవయానికి ‘వసుతో కలిసి ప్రయాణించాలని ఉంది పెద్దమ్మా ఒక మంచిరోజు చూసి వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడదాం అని చెప్పడంతో దేవయాని మనసులో ఇష్టం లేకపోయినా బయటకు మాత్రం సరే అంటుంది. ఇక ఫంక్షన్ ఉంది కదా అని వసుని ఇంటికి తీసుకునివస్తాడు రిషి. వసు వచ్చాక అందరు కలిసి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తారు.
కళ్ళు కళ్ళు కలిసిన శుభవేళ :
ఈ క్రమంలోనే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందంటే మ్యారేజ్ డే ఫంక్షన్‌కి పువ్వులు అల్లుతూ ఉంటారు వసు, జగతీ, ధరణీలతో పాటు గౌతమ్ కూడా. అయితే ఇంతలో మహేంద్ర, రిషీలు అక్కడికి వస్తారు. వస్తు వస్తూనే రిషి, వసు వంక చూస్తాడు. అలా ఇద్దరు కాసేపు రొమాంటిక్‌గా చూసుకుంటారు.ఒకరిని చూసుకుని ఒకరు మురిసిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే జగతీ, మహేంద్ర, ధరణీ, గౌతమ్‌లు వాళ్ళని చూసి కావాలనే వాళ్లకు ఏకాంతాన్ని కల్పిస్తూ పక్కకు తప్పుకుంటారు. పూలు కడుతున్నావ్ కదా సరే రిషి నేను వెళ్తాను’ అంటాడు. అయ్యో కూర్చోండి సార్’ అంటుంది వసు పూల మాలలు కడుతూ నువ్వు పూలకు సంబంధించిన పుట్టుపూర్వత్తరాలు చెప్పనంటే కూర్చుంటాను అంటాడు రిషి. ‘సరే సార్ కుర్చోండి అంటుంది వసు.
వసు మెడలో పూలదండ వేసిన రిషి:
ఇక ధరణి, జగతీ, మహేంద్ర, గౌతమ్‌లు మెట్ల మీద నుంచి చాటుగా వాళ్ల మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటారు.ఇక వసు రిషీకి పూల మాలలు కట్టడం నేర్పిస్తుంది. రిషికి రాకపోతే అలా కాదు ఇలా నేను చూపిస్తాను’ అంటూ రిషీ చేతులు పట్టుకుని తనే రిషితో పూలు మాల కట్టిస్తుంది. ఇక వరమాలలా పూల దండను చేతులతో పైకి లేపి దండ పూర్తి అయిన తర్వాత రిషికి అందిస్తుంది వసు. ఆ దండను రిషి పట్టుకోగానే వసు పూలకోసం అని ముందుకు వంగుతుంది. సరిగ్గా అప్పుడే రిషి చేతుల్లోని దండ వసు మెడలో పడుతుంది. అది చూసిన జగతీ నోరు ఆవలించి మరీ మురిసిపోతుంది. మిగిలిన వాళ్లు ఆ సీన్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. అయితే వసు, రిషి వాళ్ళు జగతి, మహేంద్ర వాళ్ళను చూస్తారో లేదో చూడాలి