Telugu TV Serials

పరీక్షలు అయ్యాక రిషి, వసు విడిపోబుతున్నారా…?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 536 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 23 ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వసు కారు ముందు నిలబడి రిషి గురించి మాట్లాడిన మాటలు అన్ని వింటాడు. రిషి వసు ముందుకు రాగానే సార్ మీరేంటి సార్ ఇక్కడ అంటుంది. దీంతో కారు నాదే కదా. నా కారు దగ్గర నేను నిలుచనున్నాను అంటాడు రిషి. దీంతో మీ కారు అయితే దాని వెనుక ఎందుకు నిలుచున్నారు అని అడుగుతుంది. దీంతో మీరు అన్నీ విన్నారా అని అంటుంది. దీంతో నాకు వినికిడి శక్తి బాగానే ఉంది. అన్నీ వినబడ్డాయి అంటాడు.ముందుకు వస్తే ఏదో అడుగుతా అన్నావు కదా అని అడుగుతాడు రిషి. దీంతో అదేం లేదు సార్ అంటుంది. నాకు క్లాస్ కు టైమ్ అవుతోంది. నేను వెళ్తా అంటుంది వసు. దీంతో ముందు నువ్వు నిన్న రాసిన నోట్స్ ఇవ్వు అంటాడు. దాన్ని తీసుకొని వెళ్తాడు.

స్టాఫ్ మీటింగ్ పెట్టిన రిషి :

ఇక రిషి స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందరు మీటింగ్ కు అటెండ్ అవుతారు. ఇక పరీక్షలు దగ్గర పడడంతో జగతి మేడమ్ ఎక్స్ ట్రా క్లాసెస్ పెడదామా అని వేరొక టీచర్ అడగడంతో వద్దు అంటుంది జగతి మేడమ్. ఇంతలో రిషి వస్తాడు. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇన్విజిలేషన్, ప్రిపరేషన్ అన్నీ రెడీగా ఉన్నాయి అంటుంది జగతి. ఇంతలో సార్ ఎక్స్ ట్రా క్లాసులు పెట్టిద్దామా అని అడుగుతుంది ఓ మేడమ్. వద్దు మేడం ఎక్స్ ట్రా క్లాస్ లు పెడితే ఎక్కువ మార్కులు వస్తాయనేది తప్పు. వాళ్లకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటాడు రిషి. వాళ్ల బుర్రల్లో ఉండే టెన్షన్ ను ఫ్రీ చేసేలా డీబీఎస్ టీ కాలేజీ ఆనవాయితీ ప్రకారం మంచి ఫేర్ వెల్ అరేంజ్ చేయాలి అంటాడు. ఈ విషయం నోటీస్ బోర్డ్ లో పెట్టండి. స్టూడెంట్స్ కూడా రెడీ అవుతారు.

వసు, రిషి విడిపోబోతున్నారా..?

సీన్ కట్ చేస్తే కాలేజ్ అయిపోతే ఇక స్టూడెంట్స్ అంతా వెళ్లిపోతారు అని మహీంద్రాతో అంటుంది జగతి. వసుధర కూడా వెళ్లిపోతుంది అంటుంది జగతి. మరోవైపు గౌతమ్.. రిషితో మాట్లాడటానికి తన రూమ్ కు వెళ్తాడు. వసుధర నిన్ను ప్రేమిస్తోంది నిజమే కదా అంటాడు గౌతమ్.దీంతో ఆ టాపిక్ ఇప్పుడు అవసరం లేదు. నువ్వు వెళ్లొచ్చు అంటాడు రిషి. తనతో నన్ను మాట్లాడమంటావా అని అడుగుతాడు గౌతమ్. దీంతో దానంతట అదే పరిష్కారం అవుతుంది అంటాడు రిషి.ఎగ్జామ్స్ అయిపోయాక వసుధర వెళ్ళిపోతుంది కదా మీరిద్దరు కూడా విడిపోబోతున్నారు అని అంటాడు గౌతమ్. ఈ మాటలను వసు విని ఎమోషనల్ అవుతూ అమ్మవారి దగ్గరికి వెళ్లి నన్ను, రిషిని విడదీయకు దేవుడా అని వేడుకుంటుంది వసుధర.అప్పుడే మహీంద్రా తన దగ్గరికి వస్తాడు. వసుకు ధైర్యం చెబుతాడు. రిషి మనసు మారుతుందేమో వెయిట్ చేసి చూద్దాం అని భరోసా ఇస్తాడు మహీంద్రా.

ఒకరి ఆలోచనల్లో మరొకరు :

మరోవైపు రిషి కూడా గౌతమ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు కావాలనుకున్న వసుధర ఎందుకు దగ్గరవడం లేదు. నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉందా అని అనుకుంటాడు రిషి. ఇక వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ నా వైపు నుంచి తప్పు ఉంటే దాన్ని నేను సరిదిద్దుకుంటాను అని అనుకుంటుంది వసు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

 

 

 


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసికి డబ్బులు వేసిన నందు.. లాస్య తో బ్రేక్ అప్.. శృతిని అవమానించిన ప్రేమ్..!

bharani jella

Intinti Gruhalakshmi: తులసి నమ్మకాన్ని ఓమ్ము చేసిన అంకిత.! లాస్య ప్లాన్ ను తులసి తిప్పి కొడుతుందా.!?

bharani jella

Intinti Gruhalakshmi: సామ్రాట్ మనసు ముక్కలు చేసిన లాస్య.. తులసిని నిలదీసిన అభి..! ప్రేమ్ ను అటపట్టించిన శృతి..!

bharani jella