Telugu TV Serials

ఫేర్ వెల్ పార్టీ తరువాత వసు, రిషి విడిపోనున్నారా…?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 537 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 24 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వసు తన గదిలో కూర్చుని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటు రిషి కూడా వసు ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకరిపై మరొకరి ప్రేమను బయటపడకుండా మనసులోనే ఫీలవుతున్నారు అనే ప్రేక్షకులకు అర్ధం అవుతుంది.

ఊహల్లో వసు, రిషి :

గతంలో రిషి ఇచ్చినప్పుడు కిందపడేసిన గిఫ్ట్ ని తిరిగి అతికిస్తుంది వసుధార..ఆ గిఫ్ట్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది.ఇక రిషి మాత్రం వసు కశ్చీఫ్ చూస్తూ ఇన్ని జ్ఞాపకాలు ఎందుకిచ్చావ్ వసుధార..వాటినే మిగల్చాలనా అనుకుంటాడు.మరోపక్క రిషి కోసం వసు వీఆర్ అని ఉంగరం చేయిస్తుంది. అది ఎలా అయినా మిమ్మల్ని చేరాలి..చేరుకుంటుంది అనుకుంటుంది.రిషి కూడా వసు  నువ్వే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవద్దు..నువ్వు నా కళ్లముందే ఉండాలి..నాతోనే ప్రయాణం చేయాలి అనుకుంటూ క్యాలెండర్ లో 24వ తేదీని సర్కిల్ చేసి ఫేర్ వెల్ పార్టీ… ఫేర్ వల్ ఎవరికి?ఫైనలియర్ స్టూడెంట్స్ కా..వసుధారతో నా పరిచయానికా? అనుకుంటాడు.

దేవయానికి షాక్ ఇచ్చిన జగతి :

సీన్ కట్ చేస్తే జగతి -మహేంద్ర ఇద్దరూ మెట్లు దిగుతూ మాట్లాడుకుంటూ వస్తుంటారు..ఇంతలో దేవయాని వచ్చి ఏంటి మహేంద్ర ఫేర్ వెల్ పార్టీ గ్రాండ్ గా చేస్తున్నారా అని అడుగుతుంది.గ్రాండ్ గా ఏం కాదు..సింపిల్ గానే చేస్తున్నాం అంటాడు మహేంద్ర. ఫేర్ వెల్ పార్టీకి స్వీట్స్ చేయించాను..కొందరు దూరమవుతారు కదా అందుకే చేయించాను అంటుంది దేవయాని.ఎదుటివారి మంచి కోరుకోవాలి కానీ..చెడు కోరుకోవద్దు అక్కయ్య…చేతిలో స్వీట్ పెట్టుకుని మనసులో విషం పెట్టుకుంటే బాగోదని దేవయాని వైపు చూస్తూ ధరణికి సమాధానం చెబుతుంది జగతి.దేవయాని మాత్రం మనసులో విషం ఏంటి.. రిషి నిన్ను అమ్మా అని పిలవాలని కోరుకుంటున్నావ్ కదా పాపం.. మంచి మనసుతో కోరుకోవాలని అన్నావ్ కదా..నేను కోరుకుంటున్నాను..జరగాలి కదా
రిషిని కనీసం నువ్వు పేరు పెట్టి కూడా పిలవలేవు..సార్ అంటావ్.. ఇన్ని పెట్టుకుని మళ్లీ నాకే నువ్వు ప్రవచనాలు చెబుతున్నావ్ చూడు అంటుంది దేవయాని.ఇంతలో మెట్లు దిగుతున్న కొడుకుని చూసి.. రిషి కాఫీ అంటుంది జగతి.
దేవయాని ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కాఫీ కప్పు విసిరికొడతాడు అనుకుంటుంది. కానీ అలా జరగదు రిషి కూల్ గా ఉండడం చూసి దేవాయని షాక్ అవుతుంది.అదీ సంగతి అక్కయ్యగారు..మరి నేను కాలేజీకి వెళ్లిరానా ..ధరణి అక్కయ్య గారికి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు ఇప్పుడు తనకి చాలా అవసరం అని అంటుంది జగతి.

కాలేజ్ లో ఫేర్ వెల్ ఏర్పాట్లు :

సీన్ కట్ చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ అంతా ఫేర్ వెర్ పార్టీ సందడిలో ఉంటారు. వసుధార ఇంకా రాలేదేంటని పుష్ప వెతుకుతూ ఉంటుంది. రిషి-గౌతమ్ ఇద్దరూ బ్యానర్ సెట్ చేస్తుంటారు.అప్పుడే వచ్చిన వసు నాక్కూడా ఏదైనా వర్క్ చెప్పండి సార్ అంటుంది.ఫైనలియర్ వాళ్లంతా మా అతిథులు కాబట్టి వాళ్లకి ఏపనీ చెప్పం అంటాడు రిషి.నన్ను అతిథిలా దూరం పెడుతున్నారా అనుకుంటుంది వసు.ఇంతలో మహేంద్ర ఎంట్రీ ఇచ్చి గౌతమ్ ను పిలిచి వాళ్లకు కాస్త ప్రైవసీ ఇద్దాం అని అంటాడు.సరే అంకుల్.. కింద కొన్ని పనులున్నాయ్ అందరూ రండి అని వసు-రిషిని వదిలేసి అంతా వెళ్లిపోతారు.

వసు తన ప్రేమ విషయం రిషికి చెప్పనుందా..?

ఇక రిషి వసుధార దగ్గరకు వెళ్లి బ్యాగ్ తీసుకుని ఇప్పుడు కూడా ఈ బరువు మోయాలా అంటాడు. కొన్ని బరువులు దింపాలి అనిపించదు సార్..ఇందులో పుస్తకాలు మాత్రమే కాదు నా భవిష్యత్, నా జ్ఞాపకాలున్నాయి అంటుంది వసు
ఇంతలో రిషి పెదనాన్న ఫణీంద్ర వచ్చి రిషిని పిలిచి
ఫుడ్ కి సంబంధించి అంతా రెడీనా అని అడుగుతాడు. హ. అంతా ఓకే పెదనాన్న అంటాడు రిషి. ప్రోగ్రాం ప్రారంభిద్దాం అని పిలుస్తాడు ఫణీంద్ర.
వీళ్ల మధ్య దూరం తగ్గేదెప్పుడో అని మహేంద్ర అంటే. ఈ రోజు వసుధార తన మనసులో మాట రిషికి చెప్పేస్తుంది అనుకుంటున్నాను అని జగతి అంటుంది.ఫేర్ వెల్ పార్టీ చేసుకోవడం ఆనందంగా ఉన్నా..మనసులో ఏదోమూల బాధ అంటూ ప్రసంగం మొదలుపెట్టి డీబీఎస్టీ కాలేజీ గురించి, పరీక్షల గురించి మాట్లాడతాడు రిషి..జగతి కూడా స్టూడెంట్స్ అందరిని ఆశీర్వదిస్తుంది. ఇక స్టూడెంట్స్ అంతా వసుధారని మాట్లాడమని అడుగడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Devatha 6 August 618: రాధ, దేవిని ఆదిత్య వాళ్ళింటికి తీసుకువెళ్లిన మాధవ్..! దేవుడమ్మను అడ్డుకున్న సత్య..!

bharani jella

ఈరోజు ఎపిసోడ్ సూపర్….కార్తీక్, దీపలను అలా చూసి షాక్ లో ఉన్న మోనిత..!!

Ram

Devatha Serial: మాధవ్ తో ఆదిత్య నా పెనిమిటన్న రుక్మిణీ.. ఆదిత్య రుక్మిణీ, దేవిని తనతో తీసుకువెళ్తాడా.. 

bharani jella