బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్. రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 544 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 1 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వసుకి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు అయ్యేవరకు ఒకరికొకరం మాట్లాడుకోకూడదని కండిషన్ పెట్టుకుంటారు. ఇక రిషి మాత్రం పరీక్షలు అయ్యాక మీకొక ముఖ్యమైన విషయం చెబుతా అంటాడు..అయితే ఇంట్లో వసు గురించి అందరు మాట్లాడడంతో అది నచ్చని దేవయాని వెళ్లి సాక్షీని కలుస్తుంది.
దేవయాని, సాక్షిల మరొక కుట్ర :
ఎలాగయినా మనం వసుతో చివరి పరీక్ష రాయనీయకూడదు.. ఆ వసుధార విజయం సాధిస్తే అది వాళ్ల ప్రేమకు విజయంగా మారుతుంది. అలా జరగకూడదు అంటే మనం ఎలా అయినా వసుధారతో పరీక్ష రాయనియకుండా చేయాలి అంటుంది దేవయాని సరే అంటుంది సాక్షి.ఇక వసు పరీక్ష రాసి బయటికి వచ్చేసరికి.. రిషి ఎదురుపడతాడు. పరీక్షలు ఎలా రాశారు అని వసుతో పాటు ఉన్న మిగిలిన స్టూడెంట్స్‌ని అడుగుతాడు. అందరితో పాటు ‘బాగానే రాశాం’ అంటుంది వసు కూడా.
వసును కిడ్నాప్ చేసిన సాక్షి :
ఇక అప్పటికే గేట్ దగ్గరకు వచ్చేస్తుంది సాక్షీ పురమాయించిన మనిషి. వసుని చాటుగా గమనిస్తుంది. ఇక తర్వాత వసు లేబ్రేరీలో పని ఉందని అందరికీ బై చెప్పి వెళ్తూ ఉంటే జగతి మహేంద్రలు ఆపుతారు. మేము డ్రాప్ చేస్తాం అంటారు. లైబ్రరీలో పని ఉంది అనడంతో వాళ్లు కూడా వెళ్లిపోతారు. ఇక వసు ఒంటరిగా సాక్షి పెట్టినావు మనిషికి దొరికేస్తుంది. ఎవరన్నా ఉన్నారేమో అని.చుట్టూ చూసి ముక్కుకి ఓ క్లాత్ పెట్టి నొక్కేస్తుంది. వసు ఆమె మీద వాలిపోతుంది.
వసు కోసం కంగారుపడుతున్న రిషి:
ఆ వెంటనే పక్క గదిలోకి లాక్కుని వెళ్లి అందులో పడేస్తుంది వసుని. సరిగ్గా అప్పుడే వసు బ్యాగ్‌లోంచి రిషి ఇచ్చిన రంగు గోలీలు కిందపడతాయి. అయితే వసు ఫోన్ రావడంతో అటుగానే వెళ్తాడు కానీ చూడదు.వసుని ఆ గదిలో పడేసి తాళం వేసి వెళ్లిపోతారు సాక్షీ, ఆ ఆడమనిషి. నైట్ అయ్యేసరికి వసుకి మెసేజ్ చేస్తాడు రిషి. కానీ వసు దగ్గర నుండి ఎటువంటి రిప్లై లేదు అని కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ రావడంతో కంగారుపడతారు.
వసు కోసం జగతి, మహేంద్ర వెతుకులాట :
కంగారు పడుతూ గౌతమ్ కు చెబుతాడు. ఇద్దరూ కలిసి వసు రూమ్‌కి వెళ్తారు. రూమ్ దగ్గర కూడా లేకపోవడంతో ఇద్దరు కూడా కంగారు పడతారు. వెంటనే రెస్టారెంట్‌కి ఫోన్ చేసి అక్కడికీ రాలేదు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత జగతికీ కాల్ చేసి జరిగిన విషయం చెబుతాడు. వెంటనే జగతి, మహేంద్రలు బయలుదేరతారు. అయితే దేవయాని హాల్లో కుర్చుని మజాగా టీ తెప్పించుకుని తాగుతూ.. ‘ఎక్కడికి మహేంద్రా?’ అంటుంది. ‘వసుధార కనిపించడంలేదు వదినగారు మేము వెళ్తున్నాం’ అంటూ పరుగుతీస్తారు వాళ్లు.
వసు గురించి రిషి తెలుసుకుంటాడా..??
వెంటనే దేవయాని సాక్షీకి ఇక్కడ సినిమా స్టార్ట్ అయ్యింది అని మెసేజ్ పంపిస్తుంది. ‘సూపర్.. అయినా వసుధారకు ఇచ్చిన డోస్ మామూలుది కాదు.తను లేవడం,రేపు పరీక్ష రాయడం అసాధ్యంలే’ అనుకుంటుంది సాక్షి.
ఇక రిషి కంగారుగా కాలేజ్‌కి పరుగుతీస్తాడు. రేయ్ గౌతమ్ నువ్వు బయట వెతుకు. నేను లోపల వెతుకుతాను’ అంటూ లోపలికి వెళ్తాడు.ఎక్కడ వెతికినా వసు కనిపించదు. ఇంతలో జగతి, మహేంద్రలు వస్తారు. వాళ్లూ వెతుకుతూ ఉంటారు ఇక రేపటి ఎపిసోడ్ లో వసు గురించి రిషి తెలుసుకుంటాడో లేదో చూడాలి.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!