Telugu TV Serials

వసుధారకు స్పెషల్ గా గిఫ్ట్ ఇచ్చిన రిషి… ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే..

Share

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ 554 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి. ఈరోజు ప్రసారం. కానున్న ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..! ఈ రోజు సెప్టెంబర్ 13 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో వసుధార తన రూమ్ లో కూర్చుని జగతి మేడం-మహేంద్ర సార్ పెళ్లిరోజు వేడుకలో ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.సరిగ్గా అప్పుడే రిషి… వసు రూమ్ కి వచ్చి వసుకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు.

వసు కోసం చీరను తీసుకువచ్చిన రిషి :



వసుధార నీకోసం చీర తీసుకొచ్చాను కట్టుకో అంటాడు. శారీనా సార్ అంటూ వసు ఆశ్చర్యంగా ముఖం పెడుతూ గతంలో తను చీరకట్టుకుని తూలిపడబోతుంటే రిషి పట్టుకున్న విషయం గుర్తుచేసుకుంటుంది వసుధార. ఆ ఆలోచన నుంచి వసును బయటకు తీసుకొచ్చిన రిషి నీకోసం తీసుకొచ్చాను ఈ చీర నీకు.చాలా బావుంటుంది ఏమీ ఆలోచించకుండా కట్టుకో అని ఇస్తాడు.వసుధార సిగ్గుపడుతూ సరే సార్ అంటుంది.ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…దేవయానికి షాకిస్తూ జగతి-మహేంద్ర పెళ్లిరోజు వేడుక ఇంట్లోనే జరిపించేందుకు ఒప్పుకుంటాడు రిషి.

వసు మెడలో దండ వేసిన రిషి :


ఇక అందరు కూడా పూలు కట్టేందుకు ఒకచోట కూర్చుంటారు. రిషి రావడం చూసి ఒక్కొక్కరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు…రిషి-వసుధార మాత్రమే మిగులుతారు.ఇద్దరు కూడా కలిసి పూల మాల కడతారు.అలాగా అనుకోకుండా రిషి పూలమాలను వసు మెడ లో వేస్తాడు. ఇదంతా చూసి జగతి, మహేంద్ర, ధరణి, గౌతమ్ మురిసిపోతారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దేవయాని రిషిని పంపించేందుకు ప్రయత్నించినా రిషి మాత్రం పెద్దమ్మను పట్టించుకోకుండా మీరు వెళ్లండి పెద్దమ్మా అనేస్తాడు. ఇక చేసేది లేక విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. 

రిషి, జగతి కలిసిన శుభవేళ.. ఆనందానికి అవధులు లేవుగా.?



ఆ తర్వాత అందరం కలసి క్యారెమ్స్ ఆడుకుందామా అని అడుగుతుంది ధరణి. రిషి రూమ్ లోపలకు వెళ్లిపోతాడు. జగతి, మహేంద్ర, గౌతమ్, ధరణి, వసుధార అంతా క్యారమ్ బోర్డు దగ్గర కూర్చుంటారు.ఇక వసు రిషి సార్ కి రావొచ్చు కదా క్యారేమ్స్ ఆడదాం అని మెసేజ్ పెట్టడంతో రిషి ఎంట్రీ ఇస్తాడు. వెంటనే థ్యాంక్యూ సార్ అని మెసేజ్ చేస్తుంది వసుధార. వీళ్లిద్దరి చాటింగ్ చూసి జగతి-మహేంద్ర సైగలు చేసుకుంటూ నవ్వుకుంటారు..ఆ తర్వాత రిషి-జగతిని ఒక టీమ్ గా ఉంచాలని ప్లాన్ చేసిన మహేంద్ర ఏదో తిప్పలుపడి జగతి, రిషి ఒక టీమ్ లో ఉండేలాగా సెట్ చేస్తాడు

జగతి ఆనందం :

తనతో కలసి ఆడేందుకు రిషి ఒప్పుకోవడంతో ఆనందంలో ఉంటుంది జగతి. వసు మాత్రం మహేంద్ర సార్ మనమే గెలవాలి అంటే.. అదే సమయంలో రిషి కూడా మనమే గెలవాలి మేడం అని జగతి మేడంకు చేయి అందిస్తాడు.రిషి ప్రవర్తన చూసి జగతి ఆనందపడుతుంది. ఇక మహేంద్ర, వసు, గౌతమ్, ధరణి కూడా వాళ్లిద్దర్నీ చూసి ఎంతో సంతోషపడతారు. మరి క్యారెమ్స్ గేమ్ లో ఎవరు గెలిచారు… రిషి తెచ్చిన చీరను వసు కట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.


Share

Related posts

సౌర్యకు హిమ గురించి చెడుగా చెప్పిన శోభ.. చెంప పగలకొట్టిన జ్వాల..!

Ram

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

bharani jella

Karthika Deepam: నిజం తెలుసుకున్న జ్వాల ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది… హిమను చంపేయనుందా..??

Ram