బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న గుప్పెడంతమనసు సీరియల్ 528 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 13 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో. ముందుగా తెలుసుకుందాం.వసు, సాక్షిల నిశ్చితార్థం వేడుకలో వసు చాలా సరదాగా ఉంటూ ఇంటికి తోరణాలు కడుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. వసును చూసి అందరూ షాక్. అవుతారు. ఇక ఈరోజు. ఎపిసోడ్ లో. కూడా అదే సీన్ కంటిన్యూ. అవుతుంది.లగ్న పత్రిక రాయించుకునే వేడుక సందడిగా సాగుతుంటుంది. రిషిని మరోసారి ఆలోచించుకోమని చెప్పేందుకు మహేంద్ర, జగతి వస్తారు. అదే సమయంలో సాక్షి కూడా లోపలికి వచ్చి ఈ రెండు డ్రెస్సులో ఏది బావుందని రిషిని అడుగుతుంది. వసు ఊహల్లో ఉన్న రిషి వసును ఊహించుకుంటూ ఈ డ్రెస్సులు నీకు బాగోవు వసుధారా అంటాడు. నేను వసుధారని కాదు ఛీ అనేసి కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది సాక్షి. జగతి-మహేంద్ర ఇద్దరూ ముఖాలు చూసుకుంటారు.
వసు ప్రేమ విషయం జగతికి చెప్తుందా..?
సీన్ కట్ చేస్తే మరో పక్క బాల్కనీలో నిల్చున్న వసు రిషిని తల్చుకుంటూ ఫోన్లో ఫొటో చూస్తూ నిల్చుంటుంది. ఒక పొరపాటుని సరిచేసుకునే అవకాశం కోసం చూశాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. గిఫ్ట్ పగిలిన చప్పుడు మాత్రమే విన్నారు కానీ నా మనసు పగిలిన చప్పుడు మీరు వినలేదు అనుకుంటుంది. వెనుకనుంచి వచ్చి భుజం మీద చేయి వేస్తుంది జగతి. ఎందుకొచ్చావ్..ఏం చూద్దామని వచ్చావ్..ఓడిపోయావని మాకు గుర్తుచేద్దామనా వచ్చావా అంటుంది.ఏంటి మేడం ఇప్పుడేమైందని అంటుంది వసు..నువ్వు బాధపడ్డా నేను బాధపడకపోయేదాన్నేమో కానీ నువ్వు ఏం జరగనట్టున్నావ్ చూడు అది ఇంకా బాధగా ఉంది అంటుంది జగతి.బాధను కొలిచే మీటర్లు సాధనాలు ఇంకా రాలేదు కదా మేడం..నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్టు ఒక్కోసారి బాధపడేందుకు కూడా చిరునవ్వును ఆశ్రయించాలి అంటుంది వసు.నేను రిషి సార్ కు ఒక మాట చెప్పాలి అనుకున్నాను మేడం కానీ మీ అబ్బాయి నాకు ఆ అవకాశం ఇవ్వలేదు అంటుంది.నేను కూడా ఓ మాట అడగాలి అనుకున్నాను నాక్కూడా అవకాశం ఇవ్వలేదు అంటుంది జగతి. కొన్నిసార్లు ఏటికి ఎదురీదడమే కరెక్ట్.. మెండిగా వెళితేనే విజయం సాధిస్తాం అంటుంది.నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏదో జరిగి ఈ పెళ్లి ఆగోపోతుంది అంటుంది ఇక దేవయాని ఎంట్రీ ఇచ్చి ఏంటి జగతి ఇక్కడేం మాట్లాడుతున్నావ్ ఎంత కాదన్నా ప్రపంచానికి కన్నతల్లివి కదా.పనులన్నీ అలాగే ఉన్నాయ్..రా…వసుధారా నువ్వూ రా..నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అంటుంది దేవయాని.
వసు ఊహల్లో రిషి :
అటు రూమ్ లో రెడీ అయిన రిషి మాత్రం ఇంకా వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. నేను ఏం చేస్తున్నానో అర్థమవుతోందా.. నాకు క్లారిటీ ఉంది నేను నమ్మిందే చేస్తున్నాను అని అద్దంలో చూసుకుని అనుకుంటాడు. వెనుకే వసుధార నిల్చుని మాట్లాడినట్టు ఊహించుకుంటాడు. ఏంటి వసుధార రిషి సార్ అర్థంకారు అనుకుంటున్నావా..లైఫ్ అంటేనే చిక్కు లెక్కకదా.నాకు నేనే ప్రేమ పరీక్ష పెట్టుకుంటున్నాను.గెలుపైనా, ఓటమైనా అన్నిటికీ నాదే బాధ్యత అనుకుంటాడు.నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా నా మనసు చెప్పేదే నేను వింటున్నాను…నాది ఒకే మాట, ఒకే ప్రేమ.. నమ్మినదానికోసం ప్రాణం ఇస్తాను..ప్రాణం ఇచ్చేదాన్నే నమ్ముతాను. ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుందో నీకు-నాకు తెలియదు.. గమ్యం మాత్రం తెలుసు..కాలం మారినా రిషి మనసు మారదు..దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా దూరం కానిది ప్రేమ ఒక్కటే వసుధార అంటూ మాట్లాడుకుంటుండగా అక్కడకు వస్తుంది ధరణి. ఏంటిదంతా అని అడిగితే జరగాల్సింది ఏదో జరుగుతుందని చెప్పి మీరు వెళ్లండి వదినా అంటాడు.
ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అంటున్న మహేంద్ర :
మహేంద్ర మాత్రం రిషి తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక అసలేం జరుగుతోంది ఇంట్లో..వాడు చేసే ప్రతిపనినీ మౌనంగా అంగీకరిస్తున్నాం.ఇది కరెక్ట్ కాదు అంటాడు మరోపక్క జగతి నాకు చెప్పడానికి అవకాశం లేదు కదా మహేంద్ర అంటుంది.ఇక్కడ జరిగేది చూస్తూ మాట్లాడకుండా ఊరుకోవాలా..ఏమి మాట్లాడవేంటి జగతి అంటాడు.నువ్వు,నేను, అన్నయ్య,వసుధార ఎవ్వరూ మాట్లాడకపోతే ఎలా..ఏదో ఒకటి చేయాలి జగతి… దీనికి ఒక్కటే మార్గం ఉంది జగతి అని మనం ఇంట్లోంచి వెళ్లిపోదాం పద అంటాడు. జగతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంట్లో జరిగేది ఆగాలంటే మనం వెళ్లిపోతోనే ఆగుతుంది అంటాడు.నేనే రాను మహేంద్ర.. రిషిని అంచనా వేయడంలో ప్రతీసారీ తప్పు చేస్తున్నాం.
మహేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టిన జగతి:
మనం వెళ్లిపోతే జరిగేది ఆగుతుంది అనుకుంటున్నావా? ఆగదు…పైగా ఇంకా తొందరగా ఈ తంతు జరుగుతుంది అంటుంది. అక్కయ్య విషపు ఆలోచనలు నీకు తెలుసుకదా.మనిద్దరం వెళ్లిపోతే తప్పు చేసినవారం అవుతాం అంటుంది జగతి.. ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా అని మహేంద్ర అంటే వెళ్లిపోయి రిషి మనసు గాయపర్చే బదులు..ఉండిపోయి ఆ బాధని మనమే భరిద్దాం.. కొన్నింటిని కాలమే పరిష్కరిస్తుంది అంటుంది జగతి.చూడ్డం తప్ప ఏం చేయలేం…లగ్న పత్రిక రాసుకునే ఏర్పాట్లు జరుగుతుంటాయి. ధరణి మాత్రం వసుధారని గమనిస్తూ నువ్వేం మాట్లాడవేంటి వసు అంటుంది ధరణి. ఈ సంతోషంల నాకు మాటలు రావడం లేదంటుంది వసుధార. వసు నువ్వు ఓకేనా అని జగతి అంటే.. నాట్ ఓకే అని లేదు మేడం.. నేను సంతోషంగా ఉన్నానంటుంది.ఇంతలో సాక్షి తల్లిదండ్రులు ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ ముగుస్తుంది.