బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1445వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 31 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈ రోజు కూడా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. దీప కార్తీక్‌ని ఫాలో అవుతూ మోనిత ఉండే చోటికి వెళ్లడంతో మోనిత ఆడే నాటకం కూడా దీపకు అర్థమవుతుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతోంది.
దీప మాటలను కార్తీక్ నమ్ముతాడా?
డాక్టర్ బాబు.. పిల్లలు, అత్తయ్యా మావయ్యా ఎవ్వరూ గుర్తు రావట్లేదా? అని కార్తీక్ ముందు ఏడుస్తుంది దీప. ‘హేయ్ ఎవరి పిల్లలు ఎవరికి పుట్టిన పిల్లలు.. అంటూ తప్పుగా మాట్లాడుతుంది మోనిత. దాంతో మోనిత గొంతు పట్టుకుని ‘నా పిల్లల గురించే తప్పుగా మాట్లాడతావా?’ అని అరుస్తుంది. వెంటనే బొటిక్‌లో పని చేసే అమ్మాయి దీప చేతుల్ని లాగి.. మోనితని కాపాడుతూ.. ‘పరాయి మగాడి మీద మోజు పడటానికి సిగ్గు లేదా అమ్మా’ అంటూ దీపనే తిడుతుంది. దాంతో ‘అది నేను కాదు.. ఇదే’ అంటూ మోనిత గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. వెంటనే మోనిత.. ‘శివ ఈమెని లాగెయ్.. నన్నే చంపాలని చూస్తోంది.. కార్తీక్ నువ్వు పదా’ అంటూ కార్తీక్‌ని లోపలికి పంపిస్తుంది. శివ.. దీపని లాక్కుని వెళ్తూ ఉంటాడు.
ఈ జన్మకి కార్తీక్ నావాడు అంటున్న మోనిత :
ఇక దీప ఏడుస్తూ ఉంటే శివతో మోనిత శివ నువ్వు వెళ్లి సార్ కి టాబ్లెట్స్ ఇవ్వు నేను ఈమెని పంపిస్తాను’ అంటుంది. దాంతో శివ వెళ్లిపోతాడు. ‘టాబ్లెట్సా? ఏం టాబ్లెట్స్ వాడుతున్నావే? నా డాక్టర్ బాబుని ఏం చేద్దాం అని అరుస్తుంది దీప. ‘హలో దీపా నీలానే నాకు కార్తీక్ అంటే ప్రేమే.. నేనేం చెయ్యను.. జెస్ట్ నీ జ్ఞాపకాలన్నీ చెరిపేస్తున్నా అంతే అంటుంది.ఆ మరణంతో నీ డాక్టర్ బాబు శకం ముగిసింది. ఇప్పుడు ఇది మరో జన్మ.. అంటే నాది. ఇక ఎప్పటికీ కార్తీక్ నీ సొంతం కాడు అంటుంది మోనిత నవ్వుతూ. మా అనుబంధమే ఆయనకి అన్నింటినీ గుర్తుకు తెచ్చేలా చేస్తుంది.డాక్టర్ బాబు నా భర్త.. నా డాక్టర్ బాబు నా కోసం వస్తారు.. అంత వరకూ నా డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అంటూ మోనితకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
కార్తీక్ ను తనవైపు తిప్పుకున్న మోనిత :
మరొవైపు దీప.. ఇంటికి వచ్చి.. డాక్టర్‌కి డాక్టర్ తల్లికి జరిగింది అంతా చెబుతుంది. అంతా విన్న డాక్టర్ తల్లి.. మోనితని తిట్టిపోతుంది. డాక్టర్ మాత్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ‘నిజాన్ని ఎంతోకాలం దాచలేమన్న సంగతి తను మరిచిపోయిందమ్మా అని దీపను ఓదార్చుతాడు.అన్నయ్యా అది డాక్టర్ బాబుకి గతం గుర్తు రాకుండా ఏవో మందులు ఇస్తోంది’ అంటుంది దీప ఏడుస్తూ. ‘నీ భర్త గతం మరిచిపోడు.. కాబట్టి తిరిగి గుర్తు రాకుండా ఓ డ్రగ్ ఇస్తున్నట్లు ఉంది. అది మార్కెట్లో దొరకదు. తను డాక్టర్ కాబట్టి.. తనకి తెలిసే ఈ పని చేస్తుంది.. అది వేస్తే గతం గుర్తు రాదు.. తిరిగి గుర్తు రావాలంటే నీ ప్రేమే సరిపోతుందమ్మా.. అతడికి దగ్గరగా ఉంటూ నీ ప్రేమని గుర్తు చేసే ప్రయత్నం చెయ్యమ్మా చాలు అంటాడు డాక్టర్. సరే అన్నయ్యా అంటుంది దీప.ఇక కార్తీక్‌ని సొంతం చేసుకోవాలనే కుట్రతో కార్తీక్‌కి మరింత దగ్గర కావడానికి నాటకం స్టార్ట్ చేస్తుంది మోనిత. చేతికి దెబ్బ తగిలినట్లుగా… అబ్బా అంటూ అరుస్తూ కార్తీక్ కు దగ్గర అవ్వాలని చూస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!