బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1428 ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఆగష్టు 11 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగునుందో ముందుగానే తెలుసుకుందాం. సౌర్య ఎంతో తెలివిగా అలోచించి శోభ నిజస్వరూపం అందరికి తెలిసేలా చేస్తుంది. శోభ గురించి స్వప్నకు చెప్పి స్వప్నలో పూర్తిగా మార్పును తెస్తుంది సౌర్య.. ఈ క్రమంలోనే తను మారిన విషయం చెప్పడానికి సత్యతో ప్రేమగా మాట్లాడుతుంది. ఇక సత్య మాత్రం నువ్వు మారావ్ అదే చాలు నాకు సంతోషం స్వప్న అంటాడు.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.స్వప్న నీకు ఒక విషయం చెప్పాలి.నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిత్య విషయంలో నా తప్పేం లేదు స్వప్నా అంటాడు సత్యం. (నిత్య ఎవరంటే స్వప్నతో పెళ్లికి ముందు సత్యం ప్రేమించిన అమ్మాయి).నిత్య నన్ను కోరుకుంది.. నేను నిత్యని కోరుకోలేదు స్వప్నా మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప వేరే బంధమే లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కొన్ని నిజాలను మనం నిరూపించలేం మనం మనసుతో మాత్రమే నమ్మాలి అంటూ పైకి లేస్తాడు సత్యం. వెంటనే స్వప్న నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి అంటుంది. ఆ మాటకు సత్యం చాలా సంతోషిస్తాడు.
నన్ను వదిలేయండి అంటూ నిరూపమ్ కు దండం పెట్టిన సౌర్య:
సీన్ కట్ చేస్తే సౌర్య ఒకచోట కూర్చుని నిరుపమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నిరుపమ్ వెనక నుంచి వచ్చి సౌర్య కళ్లను మూస్తాడు. వెంటనే సౌర్య..డాక్టర్ సాబ్’ అంటుంది.‘నేనే అని ఎలా ఎక్స్పర్ట్ చేశావ్ సౌర్యా అంటాడు నిరుపమ్ నవ్వుతూ. ‘ఆ మాత్రం గుర్తు పట్టలేనా డాక్టర్ సాబ్ అంటుంది సౌర్య. నిజంగా నువ్వు గ్రేట్ సౌర్యా మేము ఎవ్వరం కనిపెట్టలేని శోభ నిజస్వరూపాన్ని నువ్వు కనిపెట్టావ్ అంటాడు.నువ్వు మా ఫ్యామిలీ కోసమే పుట్టావ్ సౌర్యా అంటాడు నిరుపమ్ నవ్వుతూ సౌర్య చేతిని తన చేతిలోకి తీసుకుని. వెంటనే తన చేతిని విడిపించుకుని మీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేవు కదా ఇక సంతోషంగా పెళ్లి చేసుకోని హాయ్‌గా ఉండండి అంటూ దన్నం పెట్టి.. ‘నన్ను వదిలేస్తే.. నేను ప్రశాంతంగా ఉంటాను’ అనేసి వెళ్లిపోతుంది సౌర్య.
స్వప్న ప్రేమ.. సౌర్య అపార్ధం:
ఇక సౌర్య హాల్లో బాధగా కూర్చుంటే స్వప్న కోన్ తీసుకెళ్లి సౌర్య చేతికి ప్రేమగా పెట్టాలని చూస్తుంది.‘గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడు..నువ్వూ నా మేనకోడలివే కదే’ అంటూ స్వప్న ప్రేమగా మాట్లాడుతుంటే.. సౌర్య మాత్రం ఈ నాటకాలు వద్దు ఈ ప్రేమలొద్దు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇంతలో నిరుపమ్ వచ్చి ‘గోరింటాకు పెట్టించుకోవచ్చు కదా’ అంటాడు సౌర్యతో అవసరం లేదు అని వెళ్ళిపోతుంది.ఇదంతా ఆనందరావు గుమ్మం దగ్గర నుంచి చూస్తూనే ఉంటాడు. ఇక సౌర్య ఎప్పుడు మారుతుందో అని ఆ ముగ్గురూ మాట్లాడుకోవడం చూసి ఆనందరావు దగ్గరకు వచ్చి.. ‘నువ్వు మా కూతురివి.. నువ్వు మారడానికే ఇన్నేళ్లు పట్టింది.. ఇక మనవరాలు మారాలంటే ఇంకెన్నాళ్లు పడుతుందో’ అంటాడు.
శోభ ఇల్లు, హాస్పిటల్ సీజ్ చేసిన బ్యాంకు అధికారులు.:
ఇక శోభ తలపట్టుకుని ఇంట్లో కూర్చుంటుంది.బ్యాంకు వాళ్ళు శోభ దగ్గరకు వచ్చి ‘మేడమ్.. మీరు చేసిన ఈ నిర్లక్ష్యానికి గాను.. మీ ఇల్లు జప్తు చేస్తున్నాం ఇక్కడ సంతకం చేయండి అంటారు. శోభ సంతకం చేసి ఇస్తుంది. మీ ఆసుపత్రి కూడా సీజ్ చేస్తున్నాం’ అనేసి వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోతారు. వెంటనే శోభ కోపంగా సౌర్యా నిన్ను వదిలిపెట్టను…నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాను అంటూ రగిలిపోతుంది.
అందరు ఉన్నా ఏకాకిలా మిగిలిన సౌర్య :
ఇక సౌర్య ఇంటి ముందు గార్డెన్లో ఒంటరిగా కూర్చుని ఉంటే సౌందర్య వచ్చి ఎందుకమ్మా ఒంటరిగా ఉంటావ్? నీ కోసం మేమంతా ఉన్నాం మా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవు అంటుంది.‘ప్రేమా? ఎక్కడిది? నేను ఇంట్లోంచి పారిపోయినప్పుడు మీరు నాకోసం వెతికారా? నేనే సౌర్యని అని తెలియగానే ప్రేమ.. నా మనవరాలు అంటున్నారు? అసలు నా కోసం మీరు వెతికలేదు కదా? నేను మీ కోసం వెతికాను. ఇల్లు మారిపోయారని తెలిసింది అంటుంది.అన్నేళ్లు నా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయని మీరు.. ఇప్పుడు ఈ నాటకాలు ఎందుకు’? అంటుంది సౌర్య కోపంగా.
చిన్న రౌడీ రీ ఎంట్రీ :
దాంతో సౌందర్య.. ‘ఏంటి సౌర్యా నువ్వు? నోటికి ఏదొస్తే అది అనేస్తావా? నీ మీద మాకు ప్రేమ లేకపోవడం ఏంటీ అంటుంది బాధగా. దాంతో సౌర్య గతంలోకి వెళ్తుంది.చిన్నప్పటి సౌర్య ఓ అనాథాశ్రమంలో ఒంటరిగా కూర్చుని మొత్తం ఆ హిమ వల్లే.. మా అమ్మ నాన్నా లేకుండా పోయారు.. ఆ ఇంటికి వెళ్లను అని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే కారులోంచి సౌందర్య . సౌర్యని చూడగానే చాలా ఆనందంగా దగ్గరకు రాబోతుంది. ‘ఆగు నాన్నమ్మా.. ఎందుకు వచ్చావ్? ఇంతకాలం నన్ను ఎందుకు వెతకలేదు? నువ్వు రావద్దు వెళ్లిపో.. ఆ హిమ ఉన్న ఇంటికి నేను రాను అంటుంది.రా సౌర్యా ఇంటికి వెళ్దాం’ అంటుంది ఆవేదనగా సౌందర్య. ‘నేను రాను మా అమ్మా నాన్నలు ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది.. నేను ఇక్కడే ఉంటున్నాను అని సౌందర్యకు చిక్కకుండా పరుగుతీస్తుంది. వెంటనే సౌందర్య కూడా సౌర్య వెనుకే వెళ్లి పట్టుకుంటుంది. సౌర్య మాత్రం మళ్లీ నా కోసం వస్తే ఇక్కడ నుంచి కూడా ఎక్కటికైనా వెళ్లిపోతాను అంటుంది. నాన్నమ్మా ప్లీజ్ వెళ్లిపో వెళ్లకుంటే నా మీద ఒట్టే అంటుంది.దాంతో సౌందర్య నిస్సహాయంగా సౌర్య వైపు చూస్తూ ఏడుస్తూ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.