బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ 1437 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగష్టు 22 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..దీప కార్తీక్ ఫోటో పట్టుకుని అందరిని అడుగుతూ ఉంటుంది.మరోవైపు కార్తీక్ రెస్టారెంట్ లో జ్యూస్ తాగుతూ కనిపిస్తాడు. ఇక కార్తీక్ మనిషి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి దీప వచ్చి కార్తీక్ ఫోటోని చూపించి ఈ ఫొటోలోని వ్యక్తిని ఎక్కడన్నా చూసారా అంటే అతడు చూడలేదు అని అంటాడు. ఇక దీప మళ్లీ వేరే వాళ్ళని అడుగగా వాళ్ళు చూసాము లోపల రెస్టారెంట్ లో జ్యూస్ తాగుతున్నాడని చెప్పగా దీప. పరుగున లోపలికి వెళ్తుంది. కానీ అప్పటికే కార్తీక్ ను అక్కడనుండి డ్రైవర్ కారులో. ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. కార్తీక్ అక్కడ లేకపోయే సరికి దీప బాగా ఏడుస్తుంది.
కార్తీక్ ను చూసిన దీప :
సీన్ కట్ చేస్తే ఇంద్రుడు దంపతులు సౌర్య దగ్గరికి వచ్చి సినిమాకు వెళ్దాం అనటంతో వెంటనే సౌర్య జేబులు కట్ చేయడానికి వెళ్తున్నారు కదా అని అంటుంది. దాంతో ఇంద్రుడు అలా కాదమ్మ అంటూ కావాలంటే నువ్వు మా మధ్యలో కూర్చొని మా చెయ్యి పట్టుకో అని, మాకు సినిమా చూడాలని ఉంది అనటంతో వెంటనే సౌర్య తనకు ఇష్టం లేకపోయినా పిన్ని, బాబాయ్ అడిగారని సరే అని సినిమాకు వెళ్తుంది.మరోవైపు దీప కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వస్తుంది. ఇక అదే మార్కెట్ లో సౌర్య ఒక వైపు, కార్తీక్ మరోవైపు ఉంటారు.ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సినిమాకు వెళ్తారు. ఇక కార్తీక్ అక్కడ బిర్యాని బాగుంటుంది తిందాం పద అని తన దగ్గర ఉన్న అసిస్టెంట్ తో అంటాడు.
దీపను ఎవరు అని ప్రశ్నించిన డాక్టర్ బాబు :
ఇక దీప కూరగాయలు తీసుకుంటూ ఉండగా కార్తీక్ మాటలు వినిపించడంతో వెంటనే దీప కార్తీక్ ని చూసి అక్కడికి వెళ్లి డాక్టర్ బాబు అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. అయితే కార్తీక్ మాత్రం దీపను చూసి ఎవరండీ మీరు అంటాడు. దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. గతంలో జరిగిన విషయాలు అన్ని కార్తీక్ కు చెబుతుంది.ఇక దీప ఎన్ని విషయాలు చెప్పినా కార్తీక్ ఎవరో అన్నట్లు చూస్తాడు. తన పక్కనే ఉన్న అసిస్టెంట్ ను రెస్టారెంట్ లో మీ ఫోటో చూపించి అడిగితే తెలియదు అని. చెప్పాడు అనే విషయాన్ని కూడా కార్తీక్ కు చెప్పగా.. ఎవరో పిచ్చిది అనుకున్నా అని కార్తీక్ ను అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో దీప ఒకేసారి కళ్ళు తిరిగి కింద పడుతుంది.
కార్తీక్ మాటలకు ఎమోషనల్ అయిన దీప :
ఆ తర్వాత జరిగిన విషయం మొత్తం ఇంట్లో డాక్టర్ కి చెప్పటంతో ఆయన దీపకు తన మాటలతో ధైర్యం ఇస్తాడు. అప్పుడే ఆ డాక్టర్ దగ్గరికి మరో వ్యక్తి క్యాంపు కోసం రావడంతో ఆ వ్యక్తి డేట్ మర్చిపోయినందుకు వెంటనే ఆ డాక్టర్ క్యాలెండరు వైపు చూసి డేట్ గుర్తుచేస్తాడు. దీప కూడా క్యాలెండర్ చూసి ఆ డేట్ తమ పెళ్లిరోజు అని గుర్తుకుచేసుకుని గతం తలుచుకుని బాగా ఎమోషనల్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.