బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులకు అలరిస్తూ 1452 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఇక ఈరోజు సెప్టెంబర్ 8న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం…గత ఎపిసోడ్లో గుడిలో కార్తీక్. తో ప్రమాణం చేయించడానికి మోనిత ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే అక్కడికి దీప వచ్చి కార్తీక్ ను అడ్డుకుని నేను ఏ విషం కలపలేదు అని పిల్లల మీద ప్రమాణం చేయడంతో కార్తీక్‌కి దీప మీద నమ్మకం ఏర్పడుతుంది.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది.మోనిత నువ్వు కూడా ప్రమాణం చెయ్ అని కార్తీక్ అంటే మోనిత షాక్ అవుతుంది. అప్పుడే సౌర్యను చూసిన మోనిత వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి’ అనుకుంటూ ‘నేనే ప్రమాణం చెయ్యను పదా కార్తీక్ వెళ్దాం అంటూ బలవంతంగా అక్కడ నుంచి కార్తీక్ ను తీసుకుని బయలుదేరుతుంది.
గుడిలో జరిగిన విషయం డాక్టర్ అన్నయ్యకి చెప్పిన దీప :
సీన్ కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని డాక్టర్ అన్నయ్యకు వాళ్ళ అమ్మకు చెబుతుంది. అంతకు తెగించింది అన్నమాట ఆ మోనిత అని డాక్టర్ వాళ్ళ అమ్మ మోనితను తిడుతుంది.కార్తీక్ కు త్వరగా గతం గుర్తుకు రావాలి లేదంటే మోనితనే తన భార్య అని బలంగా నమ్మే అవకాశం ఉంది అని దీపతో అంటాడు.ఎలాగయినా ఆయనకు గతం త్వరగా గుర్తొచ్చేలాగా చేస్తాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది.
మోనితపై కోపంతో కార్తీక్ చేసిన పని :
ఇక కారులో వెళ్తూ కార్తీక్ పాపం ఆ వంటలక్క నీకు విషం పెట్టి చంపాలని అనుకోలేదు అని ప్రమాణం చేసింది కదా.నువ్వు కూడా చేసి ఉంటే అయిపోదును కదా?’ అంటూ మాట్లాడతాడు. దాంతో మోనితకు కోపం వచ్చి కారు ఆపమని అరుస్తుంది. దాంతో కార్తీక్ కారు ఆపి దిగుతాడు. ఇక మోనిత కూడా కారు దిగి కార్తీక్‌తో గొడవకు దిగుతుంది. ‘అసలు ఏంటి కార్తీక్ నువ్వు? ఎప్పుడూ వంటలక్క వంటలక్కా అంటావ్.ఇక నుంచి ఆమెతో మాట్లాడటం, కలవడమే కాదు ఆమె ఆలోచనలు కూడా మన మధ్య రాకూడదు అని నాకు మాటిస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను అంటుంది కోపంగా.
ఇంటి దారి మరిచిపోయిన కార్తీక్ :
దాంతో కార్తీక్ రివర్స్ అయ్యి ఏంటి నువ్వు నాకు కండిషన్స్ పెడుతున్నావ్ నేను మాట ఇవ్వను..మాటివ్వకపోతే కదలను అన్నావ్ కదా.అలానే ఉండు నేను వెళ్తున్న అని. కోపంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు.ఇక మోనిత. కార్తీక్ ను పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అడ్రెస్స్ కూడా గుర్తు లేదు ఇప్పుడు. ఎక్కడికి వెళ్తాడో ఏంటో అని కంగారు పడుతుంది మోనిత.తీరా కాస్త దూరం వెళ్లాక కార్తీక్ ఎటు వెళ్లాలో తెలియక దారి మరిచిపోతాడు. అప్పుడే దీప వచ్చి కార్తీక్‌ని ఇంటికి తీసుకొస్తుంది.
కార్తీక్ ఇంట్లో దీపను చుసి షాక్ అయిన మోనిత :
ఇక మోనిత ఇంటికి వచ్చేసరికి దీప కార్తీక్ తలకి బామ్ రాస్తూ ఉంటుంది. అది చూసి మోనిత రగిలిపోతూ నువ్వేంటే ఇక్కడా? నడువు బయటికి అని గోల చేస్తుంది.అయితే కార్తీక్ కూల్‌గా.. ‘మోనితా అసలు జరిగింది ఏంటో తెసుకోకుండా అలా చెయొద్దు.. ఈవిడ కారణంగానే ఈ రోజు నేను నీకు దక్కాను తెలుసా? అని మోనితకు సర్ది చెప్పే ప్రయత్నం చెస్తాడు.ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నా భర్తను ఇంటికి తీసుకుని వచ్చినందుకు థాంక్యూ వంటలక్కా అంటూ దీపని కౌగిలించుకుని థాంక్స్ చెబుతుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!