బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1436 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. కార్తీక్, దీపలు బతికే ఉండడంతో సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగుతుందనే చెప్పాలి. పుట్టకొకరు చెట్టుకొకరు అయినట్లు హిమ ఏమో సౌందర్య వాళ్ళ దగ్గర, సౌర్య ఏమో ఇంద్రుడు., చంద్రమ్మ దంపతుల దగ్గర, దీప ఏమో డాక్టర్ దగ్గర, కార్తీక్ ఏమో ఎక్కడున్నాడో తెలియదు. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఎంట్రీ సూపర్ అనే చెప్పాలి…
కార్తీక్ కోసం దీప వెతుకులాట :
ఇక ఈరోజు ఎపిసోడ్ లో దీప డాక్టర్ చెప్పినట్లు కార్తీక్ కోసం పక్క ఊరు ఆసుపత్రికి వెళ్లి ఆరా తీస్తుంది. రిసెప్షన్లో ఉన్న ఆమెని మేడమ్ కొన్ని రోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఇక్కడికి తెచ్చారంట.ఆయన ఎక్కడ ఉన్నారు అంటుంది. ‘కారు యాక్సిడెంటా?’ అంటుంది ఆ రిసెప్షనిస్ట్. అవును అంటుంది దీప ఆశగా. అయ్యో నిన్ననే అతన్ని తీసుకెళ్లిపోయారు అంటుంది ఆమె. దాంతో దీప షాక్ అయిపోతుంది. ‘తీసుకెళ్లిపోయారా? ఎవరు?’ అంటుంది దీప.వాళ్ల ఆవిడ వచ్చి ఆయన్ని తీసుకెళ్లిపోయారు మేడమ్ అని ఆ రిసెప్షనిస్ట్ చెప్పగానే దీప అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ అంటున్నారంటే డాక్టర్ బాబు కదా అనుకుంటుంది.అప్పుడే ఓ నర్స్ పర్స్ తెచ్చి ఇచ్చి ఇది ఆ వ్యక్తి మరిచిపోయి వెళ్లిపోయారు’ అంటుంది.
దీపను ఓదార్చిన డాక్టర్ తల్లి :
పర్సు ఓపెన్ చేసి చూసి అందులో ఉన్న ఫోటో చూసి కార్తీక్ దే అని తెలుసుకుంటుంది. ఇక ఆ నర్స్ ఈ పర్సును అతడికి ఇచ్చేస్తారు కదా..ఆయన మీకు ఏం అవుతారు’ అంటుంది. దీప ఆయన నా భర్త అని చెప్పగానే.. ‘భర్తా? అతడ్ని తీసుకుని వెళ్లిన ఆమె తన భార్య అని చెప్పింది అంటుంది. ఆ పర్స్ పట్టుకుని డాక్టర్ ఇంటికి వెళ్లి జరిగింది అంతా చెబుతుంది.నీ భర్తని ఎవరో తీసుకుని వెళ్లడం ఏంటీ.? నీ భర్తేం చిన్న పిల్లోడు కాదు కదా? తీసుకుని వెళ్తే మాత్రం నీ భర్త ఎలా వెళ్తాడు.కంగారు పడకుండా నీ భర్తని నువ్వు వెతుకు కచ్చితంగా దొరకుతాడు అంటూ ధైర్యం చెబుతుంది.
కార్తీక్ రీ ఎంట్రీ అదుర్స్ :
సీన్ కట్ చేస్తే దీప ఆ పర్స్ తీసుకుని ఆ చుట్టు పక్కల రోడ్ల మీద కనిపించే ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తూనే ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద కారు వచ్చి ఆ దగ్గర్లో ఆగుతుంది.దానిలోంచి దిగుతూ కార్తీక్ రీఎంట్రీ ఇస్తాడు. అయితే ఈసారి కార్తీక్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.కార్తీక్ కారు దిగిన వెంటనే డ్రైవర్ పరుగున వచ్చి అవతల డోర్ నుంచి కార్తీక్ దగ్గరకు వస్తాడు. ‘ఏంటి గణపతి ఇక్కడ ఆపావ్’ అంటాడు కార్తీక్. ‘సార్ నా పేరు గణపతి కాదు.. శివ అంటాడు డ్రైవర్. ఆ ఏదొకటిలే.. ఎందుకు ఇక్కడ ఆపావ్’ అంటాడు కార్తిక్. ‘మేడమ్ ఫోన్ చేశారు సార్ మీకు జ్యూస్ తాగే టైమ్ అయ్యిందని’ అంటాడు శివ.
కార్తీక్ భార్య ఎవరు..?
ఇప్పుడు జ్యూస్ నేను తాగాను అంటాడు కార్తీక్ ఆవేశంగా.. నాకు తినాలనిపించినప్పుడు తింటాను. తాగాలి అనిపించినప్పుడు తాగుతాను అంటాడు. ‘సార్ ఇదంతా మేడమ్ మీ మీద తీసుకుని శ్రద్ధ సార్.. మీ మీద మేడమ్‌కి ఉన్న ప్రేమ సార్ అంటాడు శివ.. ఇప్పుడు జ్యూసులు తాగడం నా వల్ల కాదు కానీ.. తాగేశానని చెప్పెయ్’ అంటాడు కార్తీక్. ‘కుదరదు సార్.. మేడమ్ నా మాటల్ని నమ్మరు. మీరు జ్యూస్ తాగుతున్నప్పుడు ఫొటో తీసి మేడమ్‌కి మెసేజ్ చెయ్యాలి’ అంటాడు డ్రైవర్. పదా వెళ్లి జ్యూస్ తాగుదాం’ అంటాడు కార్తీక్. మీరు వెళ్ళండి సార్ నేను ఇక్కడే ఉండి ఫోటో తీస్తా అంటాడు. సరే ఫోటో క్లారిటీగా తీయమని చెప్పి కార్తీక్ జ్యూస్ కార్నర్‌లోకి వెళ్లి జ్యూస్ ఆర్డర్ చెప్పుకుని తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కాస్త దూరంలో దీప కార్తీక్‌ని వెతుకుతూ ఉంటుంది. మరి దీప కార్తీక్ ను చూస్తుందా..? అసలు కార్తీక్ కు ఏమైంది.? కార్తీక్ వాళ్ళ ఆవిడ ఎవరు అనే వివరాలు తెలియాలంటే తరువాయి భాగంలో చూడాలి.!