Telugu TV Serials

మోనిత నటన చూసి షాక్ అయిన దీప.. నిజంగానే కార్తీక్ గురించి మోనితకు తెలియదా..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1440 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది ఇక ఈరోజు ఆగష్టు 25 ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్లో ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. గత ఎపిసోడ్‌లో దీప, మోనితను కలుసుకుని డాక్టర్ బాబు గురించి అడుగుతుంది. దీపలానే మోనిత కూడా కార్తీక్ ఫొటో పట్టుకుని కార్తీక్‌ని వెతుకుతూ తిరగడం చూసి షాక్ అవుతుంది.

మోనితను ఫాలో అయిన దీప :

ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. మోనిత మాటలను నమ్మని దీప ఆటోలో తనని ఫాలో అవుతు ఓ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంటి గేట్ దగ్గర ఆగుతుంది. లోపలికి వెళ్లిన కారులోంచి మోనిత దిగుతుంది. మోనిత లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు కూడా మోనిత ఏడుస్తూనే కనిపిస్తుంది. ‘ఏడుస్తున్నట్లు ఎలా నాటకం ఆడుతుందో చూడు.. దీన్ని నమ్మడానికి వీల్లేదు.. పెద్ద గుంట నక్క.. కచ్చితంగా డాక్టర్ బాబు ఇక్కడే ఉండి ఉంటారు. అవసరం అయితే.. దీన్ని ఈ రోజు చంపేసి అయినా సరే నా డాక్టర్ బాబుని నాతో తీసుకుని వెళ్లిపోతాను అనుకుంటుంది.

మోనిత నటన చూసి షాక్ లో దీప :

ఆటో వాడికి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి.. నెమ్మదిగా మోనిత వెనుకే ఫాలో అవుతుంది.ఇక మోనిత లోపలికి వెళ్లి ఒక స్థంబానికి ఆనుకుని కార్తీక్ ఫొటో పట్టుకుని ‘కార్తీక్ ఎక్కడున్నావ్ కార్తీక్’ అని ఏడుస్తుంది. దీప గుమ్మంలో అడుగుపెట్టేసరికి అదే సీన్ చూసి షాక్ అవుతుంది.ఎందుకు కార్తీక్ మన జీవితాలు ఇలా తయారయ్యాయి.. ఎప్పుడూ మనం కలిసి సంతోషంగా ఉండలేమా? అంటుంది.దీప కలిసింది తనతో నువ్వు లేవు.. ఏంటని అడిగితే.. ఎవరో తీసుకుని వెళ్లారు అంటోంది. అలా ఎలా తీసుకుని వెళ్తారు? నువ్వు ఎలా వెళ్లావ్?అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది.కార్తీక్ ఫొటో చూస్తూ మోనిత ఏడుస్తుంటే.. ‘దీనికి నిజంగానే ఏం తెలియదా?’ అనుకుంటుంది దీప.ఇక మోనిత ఏడుస్తూ ఉండగానే.. ఇల్లంతా కార్తీక్ కోసం సైలెంట్‌గా వెతుకుతుంది.కానీ ఎక్కడా కార్తీక్ కనిపించడు దాంతో దీప.. ‘దీన్ని నమ్మాలా వద్దా నేను ఫాలో చేసిన విషయం.. నేను ఇక్కడ ఉన్న విషయం దానికి తెలియదు కాబట్టి నిజంగానే దీని ఏడుపు నిజమేనా? డాక్టర్ బాబు ఎక్కడున్నారో దీనికి తెలియదా?’ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

కార్తీక్ కోసం దీప వెతుకులాట :

ఇక దీప మళ్లీ కార్తీక్‌ని వెతకగడం మొదలుపెడుతుంది.సరిగ్గా అప్పుడే అటుగా కార్తీక్, శివల కారు వస్తూ ఉంటుంది. దీపని చూసిన కార్తీక్ కారు ఆపమని శివతో అంటే శివ ఆపడానికి ఇష్టపడకపోవడంతో.. ‘ఆపుతావా దూకెయ్‌నా’ అంటాడు కార్తీక్ కోపంగా. దాంతో శివ కారు ఆపుతాడు. కారుకి కాస్త దూరంలోనే దీప.. కార్తీక్ ఫొటోని పట్టుకుని వెతుకుతూ ఉంటుంది. ఆవిడను ఎక్కడో చూసినట్టు ఉందయ్యా అని అంటాడు. శివ.. దీపని చూసి.. ‘అమ్మో ఇప్పుడు ఈవిడ ఈయన్ని కలిస్తే మేడమ్ నన్ను చంపేస్తుంది అనుకుని ఎవరు సార్’ అంటాడు శివ.నాకు గుర్తుంది.. నీకు గుర్తు లేదు. మొన్న నా దగ్గరకి వచ్చి ఏదో అడిగింది.. ఆవిడే కదా’ అంటాడు కార్తీక్. ‘ఆవిడా అబ్బే కాదు సార్ అంటాడు శివ.అప్పటికే దీప.. అలా ముందుకు నడిచి వెళ్లి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది.

దీపను ఓదార్చిన డాక్టర్ తల్లి :

ఆవిడ వెళ్లిపోయింది కదా సార్ రండి వెళదాం అని కార్తీక్ శివ వెనుకే కారువైపు వెళ్లిపోతాడు.ఇక డాక్టర్ ఇంటికి తిరిగి వెళ్లిన దీప.. జరిగింది అంతా డాక్టర్ తల్లికి చెబుతుంది. అసలు మోనిత ఎవరు? అంటే.. మొదటి నుంచి అది చేసిన కుట్రలు.. మోసాలు.. నాటకాలు అన్నీ చెబుతుంది ఆ పెద్దావిడకి. అంతా విన్న పెద్దావిడ దీపకు ధైర్యం చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 


Share

Related posts

తులసి సామ్రాట్ లది భార్యాభర్తల బంధం..!! రచ్చ రచ్చ చేసిన అభి..!

bharani jella

Intinti Gruhalakshmi 24 August: తులసిలో అష్ట దేవతలను వర్ణించిన సామ్రాట్..!

bharani jella

Intinti Gruhalakshmi: సామ్రాట్ పై అభి ఫైర్.. నందు, లాస్య మనోగతం చెప్పిన సామ్రాట్..!

bharani jella