25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
Telugu TV Serials

మోనితను చూసిన సౌందర్య… హైదరాబాద్ వెళదాం అంటున్న కార్తీక్..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తిక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఆగష్టు 29 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో కార్తీక్.. మోనితను దీప అని పిలవడంతో మోనిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మరో పక్క దీప తన భర్త కార్తీక్ ను వెతికే పనిలో ఉంటుంది. ఇక సౌందర్య వాళ్ళ ఫ్యామిలీ కూడా సౌర్య కోసం చీక్ మంగుళూర్ రావడంతో ఈరోజు సీరియల్ ఇంట్రెస్టింగ్ సాగిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఒక దగ్గర కారు ఆపి కార్తీక్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. గత నెల రోజుల నుంచి కార్తీక్ కు తన వాళ్ళ పేర్లు కూడా గుర్తు లేవు కానీ సడన్ గా దీప గుర్తుకు రావడం ఏంటి.. అసలు ఏమి జరుగుతుంది…లాభం లేదు కార్తీక్ మనసు, ఆలోచనల్లో నేనే ఉండాలి అలా కార్తీక్ ను నా వైపుకు తిప్పుకుంటాను అనుకుంటుంది..

మోనితను చూసిన సౌందర్య:

సీన్ కట్ చేస్తే సౌందర్య, ఆనందరావు, హిమలు ఒక రెస్టారెంట్ లో కూర్చుని సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మోనిత కూడా అదే రెస్టారెంట్ కు వచ్చి కూర్చుంటుంది. హిమ అనుకోకుండా మోనితను చూసి తాతయ్య, నాన్నమ్మలకు చేప్తుంది. వాళ్ళు కూడా మోనితను చూసి షాక్ అవుతారు. ఇక మోనిత కూడా వాళ్ళని చూసి షాక్ అయ్యి వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి.. కొంపదీసి దీప నా గురించి, కార్తీక్ గురించి ఎమన్నా చెప్పి ఉంటుందా అనుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. హిమను పక్కకు పంపించి ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. కార్తీక్ లేడు అన్నా బాధను దిగమింగుకుని నా ఆస్తిని బస్తీ వాళ్లకు ఇచ్చేసి అందరికి దూరంగా ఇలా వచ్చేసా ఆంటీ అంటుంది.. ఇక ఆ తెల్ల చీర కట్టుకుని బొట్టు, గాజులు తీసేస్తే ఏదో బాధగా ఉందని అంటుంది.. ఇంతలో కార్తీక్ ఫోన్ చేస్తాడు. టెన్షన్ పడుతూ కట్ చేస్తుంది.. ఇక సౌందర్య మాత్రం దీనికి సౌర్య గురించి చెప్పడం ఎందుకులే అని ఏమి మాట్లాడదు.ఇక. దీప వీళ్లకు ఏమి చెప్పలేదు అన్నమాట అనుకునే లోపే మళ్ళీ. కార్తీక్ ఫోన్ చేయటంతో హడావిడిగా సరే ఉంటాను ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది. మోనిత టెన్షన్ చూసి సౌందర్యకు అనుమానం వస్తుంది..దిన్ని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అండి అంటుంది.. అప్పుడంటే ఏవో తప్పులు చేసి మనల్ని చూసి భయపడేది మరి ఎప్పుడు ఎందుకు ఇలా టెన్షన్ పడుతుందో అర్ధం కావడం లేదు అంటాడు ఆనందరావు..

ఇల్లు కాళీ చేసి వేరే ఇంటికి వెళ్లిన సౌర్య:

తర్వాత సీన్ లో దీపను డాక్టర్ ఓదార్చుతూ ఉంటాడు. మరోపక్క సౌర్య బలవంతగా తాము ఉండే ఇల్లును కాళీ చేపించి వేరే ఇంటికి తీసుకుని వస్తారు. చంద్రమ్మ మాత్రం సౌర్య మీద కాస్త కోపంతో ఉంటుంది.ఆ ఇల్లు బాగుంది అలాగే మాకు కలిసి వచ్చిన ఇల్లు ఎందుకు కాళీ చేపించి తల్లి అంటుంది.. ఈ ఇల్లు కూడా బానే ఉంటుంది పిన్ని అంటుంది సౌర్య. కానీ మనసులో మాత్రం ఆ ఇంట్లో ఉంటే తాతయ్య, నానమ్మ వాళ్ళు మాటి మాటికీ నా కోసం వస్తూ పోతూ ఉంటారు అని వాళ్లకు తెలియకూడదు అని ఇక్కడికి తీసుకుని వచ్చేసాను అనుకుంటుంది మనసులో సౌర్య.

హైదరాబాద్ వెళదాం అన్నా కార్తీక్ :

సీన్ కట్ చేస్తే కార్తీక్ షాపింగ్ బయట మోనిత కోసం ఏదురుచూస్తూ ఉంటుంది. మోనిత రాగనే ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ చేయవు అంటే బిజీగా ఉన్నాను అందుకే కట్ చేశాను అంటుంది. అయినా ఒకసారి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తావ్ అంటుంది. నీకు రెండు సార్లు చేస్తేనే ఇంత కోపం వస్తే మరి నాకు ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు మాటిమాటికి ఫోన్ చేస్తే నాకు ఎంత కోపం. రావాలి అంటాడు.. సరే కార్తీక్ తప్పు నాదే సారీ ఎందుకు కాల్ చేశావ్ అంటాడు.మానం హైదరాబాద్ వెళదాం మోనిత అంటాడు.. హైదరాబాద్ నా అంటూ షాక్ అయిపోతు చూస్తుంది.. ఇక్కడ కన్నా అక్కడ అయితే మంచి సేల్స్ ఉంటాయి అంటాడు.. అందుకా అని మోనిత అంటే మరి ఎందుకు అనుకున్నావ్ అని డౌట్ గా అంటాడు.. వద్దు కార్తీక్ అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది.. కార్తీక్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది కదా ఎందుకు మోనిత ఇలా మాట్లాడుతుంది అని ఆలోచనలో పడతాడు

 


Share

Related posts

Intinti Gruhalakshmi సెప్టెంబర్ 10 ఎపిసోడ్: సామ్రాట్ ని తులసికి సారీ చెప్పమన్న అభి.. లాస్య నిజస్వరూపం తెలుసుకున్న సామ్రాట్..

bharani jella

Krishna Mukunda Murari: ఆదర్శ్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ముకుందని నిలదీసిన మురారి.. కన్ఫ్యూజన్ లో రేవతి..

bharani jella

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

bharani jella